Prabhakar Rao: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అన్ని దారులు మూసుకు పోయాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాకు రావడం ఖాయమేనా? ఎటు వెళ్లాలన్నా రెడ్ కార్నర్ నోటీసు ఆయన్ని వెంటాడుతుందా? ఆయన విజ్ఞప్తిని అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చిందా? ఈనెల చివరికి తెలంగాణకు రావడం ఖాయమేనా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
పాపాలు పూర్తి అయితే ఎలాంటివారికైనా తల వచ్చక తప్పదు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విషయంలో అదే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ఏడాదిన్నర తప్పించుకున్నారు. చివరకు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది అమెరికా ప్రభుత్వం. దీంతో రేపో మాపో ఆయన ఇండియాకు రానున్నారు. నేరుగా తెలంగాణకు వస్తారా? లేకుంటే అలా అలా గడిపి కేసు విషయం తెలుసుకుని వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు భయంతో ఏడాదిన్నరగా ఇండియాకు రావడం మానేశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు. ట్రంప్ సర్కార్ రాకముందే ఆయన తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అసలే ట్రంప్ సర్కార్.. ఎన్నారైలను ఏదో విధంగా వారి వారి దేశాలకు తరలిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభాకర్‌రావు ఆశ్రయం ఇచ్చేందుకు ససేమిరా అంది.
రాజకీయ కక్షతో తనపై కేసులు పెట్టారంటూ, తాను ఐపీఎస్ అధికారి అంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయేందుకు ఆయన వేయాల్సిన స్కెచ్‌లన్నీ వేశారు. చివరకు అవన్నీ బూమరాంగ్ అయ్యాయి. మరోవైపు ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది ఇంటర్ పోల్.
ALSO READ: ఉచితంగా రూ. కోటి బీమా, ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రస్తుతం అమెరికాలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా ఆయన్ని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఆయన్ని డిపోర్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు చేసింద కేంద్రప్రభుత్వం.
జూన్ 20లోగా ప్రభాకర్‌రావు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. 20వ లోగా హాజరు కాకపోతే అప్రకటిత నేరస్తుడుగా ప్రకటిస్తామని తెలిపింది. అంతకుముందు ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. చివరకు అన్నిదారులు మూసుకుపోవడంతో ప్రభాకర్‌రావు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.