Dacoit fire glimpse : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ మన హీరోలలో శేష్ అడివి ఒకరు. ప్రస్తుతం శేష్ అంటే తెలియని వారు లేరు. కానీ ఈ బ్రాండ్ సంపాదించడానికి శేష్ కు చాలా టైం పట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపిస్తాడు శేష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. తను హీరోగా చేసిన కర్మ అనే సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోవడం పక్కన పెడితే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చాడు. గూడచారి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ
బాక్స్ ఆఫీస్ వద్ద మామూలుగా విడుదలైన గూడాచారి సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది. తక్కువ బడ్జెట్ తో కూడా ఇంత క్వాలిటీ సినిమా చేయొచ్చు అని నిరూపించిన సినిమా గూడచారి. సినిమా తర్వాత అడవి శేషు కంప్లీట్ గా బిజీగా మారిపోయాడు. తర్వాత తను చేసే ప్రతి సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఫేస్ చేసిన అన్ని సినిమాల్లో కూడా అదే శైలి లో ఉంటాయి. ఇక ప్రస్తుతం శేష్ డెకోయిట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా కీలకపాత్రలో కనిపిస్తుంది.
అంచనాలు పెంచిన టీజర్
డెకోయిట్ ఫైర్ గ్లిమ్స్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకుముందు శేష్ నటించిన సినిమాల్లో ఇటువంటి అంశాలు అయితే ఆడియన్స్ సప్రైజ్ చేసాయో అదే విధంగా దీనిని కూడా ప్లాన్ చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే దానిని మించి ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఇప్పటినుంచి వస్తుంది అనుకునే ఈ సినిమా కాస్త లేట్ అయినా కూడా ఆడియన్స్ కి సప్రైజ్ ఇవ్వడం ఖాయం అని ఒక నమ్మకం ఈ టీజర్ తో వచ్చేసింది. “చాలామంది నిన్ను మోసం చేశారు కానీ మాత్రం నేను.. అంటూ రా గా శేష్ చెప్పే డైలాగ్ బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఒక అంచనా వస్తుంది. ఈ సినిమా క్రిస్మస్ కానుక డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా టీజర్ తోనే ప్రకటించింది చిత్ర యూనిట్.