OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసేవాళ్ళకి మంచి కిక్ ఇచ్చే మూవీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో మంత్రగత్తెలు అమ్మాయిల్ని బలి ఇస్తుంటారు. ఒక డాన్స్ అకాడమీ పెట్టి ఇదంతా చేస్తుంటారు. ఈ హాలీవుడ్ మూవీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
సుజీ బన్నియన్ (డకోటా జాన్సన్) అనే అమెరికన్ అమ్మాయి, జర్మనీలోని బెర్లిన్‌లో ప్రఖ్యాత మార్కోస్ డాన్స్ అకాడమీలో చేరడానికి వస్తుంది. ఈ అకాడమీని మాడమ్ బ్లాంక్ అనే మంత్రగత్తె నడుపుతూ ఉంటుంది. అక్కడ పైకి మాత్రం అది ఒక డాన్స్ అకాడమీ లాగా కనిపిస్తుంది. అయితే లోపల ఒక రహస్యం దాగి ఉంటుంది. సుజీ అకాడమీలో చేరినప్పటి నుండి అక్కడ వింత సంఘటనలు, భయంకరమైన ఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. సుజీ డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు, అకాడమీలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ అకాడమీ వాస్తవానికి మంత్రగత్తెల సమూహం నడిపే స్థలం. వాళ్ళు పురాతన ఆచారాలతో బలి ఇచ్చే రిచువల్స్‌లో పాల్గొంటూ ఉంటారు.
ఎంతో మంది అమ్మాయిలను అక్కడ ఉండే మంత్రగత్తెలు బలి ఇచ్చారు. సుజీకి సంబంధించిన ఒక భయంకరమైన రహస్యం కూడా బయటపడుతుంది. సుజీని కూడా వాళ్ళు బలి ఇవ్వాలి అనుకుంటారు. ఇదే సమయంలో ఒక ఫిర్యాదు రావడంతో, డాక్టర్ జోసెఫ్ క్లెంపరర్ అనే సైకోఅనలిస్ట్, అకాడమీలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గురించి దర్యాప్తు చేస్తాడు. అతను అకాడమీలోని చీకటి రహస్యాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతను కూడా మంత్రగత్తెల చేతిలో చిక్కుకుంటాడు. చివరికి సుజీ ఈ మంత్రగత్తెల నుంచి తప్పించుకుంటుందా ? వాళ్ళు సుజీని ఎందుకు బలి ఇవ్వాలని అనుకుంటున్నారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : మనుషులపై పగ తీర్చుకోవాలనుకునే మర్మైడ్స్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఫ్యాంటసీ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సస్పిరియా’ (Suspiria). 2018 లో విడుదలైన ఈ సినిమాకి ఇటాలియన్ దర్శకుడు లూకా గ్వాడగ్నినో దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ నటి డకోటా జాన్సన్ ఒక అమెరికన్ మహిళగా నటించారు. ఆమె బెర్లిన్‌లోని మంత్రగత్తెల నిర్వహించే ఒక డ్యాన్స్ అకాడమీలో చేరుతుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ సినిమా కథ 1970 నాటి బెర్లిన్ నేపథ్యంలో జరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.