E-Paper
Advertisement

OTT Movie : మనుషులపై పగ తీర్చుకోవాలనుకునే మర్మైడ్స్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : మనుషులపై పగ తీర్చుకోవాలనుకునే మర్మైడ్స్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఫ్యాంటసీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : సముద్ర జీవులతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అయితే వీటిలో మత్స్యకన్యల స్టోరీలతో సినిమాలు కాస్త అరుదుగానే వస్తున్నాయి. వచ్చిన కాటికి మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. అప్పట్లో తెలుగులో వెంకటేష్ నటించిన సాహస వీరుడు, సాగర కన్య ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.  చైనాలో కూడా ఈ జానర్లో వచ్చిన ఒక  సినిమా, ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. చైనాలో అత్యధిక వసూలు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

లియు జువాన్ అనే ధనవంతుడైన వ్యాపారవేత్త, సముద్ర తీరంలోని ఒక బేను కొనుగోలు చేస్తాడు. అక్కడ సోనార్ టెక్నాలజీని ఉపయోగించి సముద్ర జీవులను తొలగించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ సోనార్ వల్ల సముద్రంలో నివసించే మత్స్యకన్య (Mermaid) లకు తీవ్రంగా హాని జరుగుతుంది. మత్స్యకన్యలు తమ జాతిని రక్షించుకోవడానికి ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. సముద్రంలో ఉండే ఈ సమూహం అంతా కలసి, షాన్ అనే అందమైన మత్స్యకన్యను జువాన్‌ దగ్గరికి పంపి అతన్ని చంపే ప్లాన్ వేస్తారు. షాన్ మానవ ప్రపంచంలోకి వచ్చి, జువాన్‌తో సన్నిహితంగా ఉంటుంది. ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది. ప్లాన్ ప్రకారం షాన్ అతన్ని చంపడానికి బదులు, అతనితో ప్రేమలో పడుతుంది. జువాన్ కూడా ఆమె పట్ల ఇష్టం పెంచుకుంటాడు.

అయితే ఆమె తాను మత్స్యకన్య అనే విషయం అతని దగ్గర దాచిపెడుతుంది. ఇక్కడే స్టోరీ మరో ఊహించని మలుపు తీసుకుంటుంది. ఒక రోజు జువాన్‌ కు షాన్ మత్స్యకన్య అని తెలిసిపోతుంది.అతనితో పాటు మరికొంత మందికి కూడా తెలుస్తుంది.అక్కడి వాళ్ళు వీళ్ళను పట్టుకుని క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. మరొవైపు జువాన్ తాను నిర్మించే ప్రాజెక్ట్‌ వల్ల మత్స్యకన్యలకు సమస్యలు వస్తాయని తెలుసుకుంటాడు. వాళ్ళను కాపాడాలని నిర్ణయం తీసుకుంటాడు.చివరికి జువాన్ మత్స్యకన్యలను కాపాడుతాడా ? వీళ్ళ లవ్ స్టోరీ ఏమౌతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ చైనీస్ ఫాంటసీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఈ మూవీని చూసి 86 మంది చనిపోయారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హార్రర్ మూవీ

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ చైనీస్ ఫాంటసీ మూవీ పేరు’ది మెర్మైడ్’ (The Mermaid). 2016 లో వచ్చిన ఈ మూవీకి స్టీఫెన్ చౌ దర్శకత్వం వహించారు. ఇందులో ఒక వ్యాపారవేత్తని హత్య చేయడానికి మత్స్యకన్యను పంపుతారు. ఇది కాస్తా లవ్ స్టోరీకి దారి తీస్తుంది. ఈ మూవీ చైనాలో 2016 ఫిబ్రవరి 8న విడుదలైంది. అనేక బాక్సాఫీస్ రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టింది. మెర్మైడ్ చైనాలో ఆల్ టైమ్‌లో అత్యధిక ఓపెనింగ్ వీక్‌ను కలిగి ఉంది. ఇక్కడ ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×