OTT Movie : కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆతృత పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి సినిమాలను చూసి ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఒక జంట రోడ్ ట్రిప్ లో ఉన్నప్పుడు జరుగుతుంది. అక్కడ వీళ్ళు ఒక టైమ్-లూప్ లో ఇరుక్కుంటారు. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో వెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
రీడ్, ఒలివియా గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒలివియా ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఇక వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఒలివియాను తన ఇంటికి తీసుకెళ్ళి, పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం కూడా చేసుకుంటాడు. ఇక ఆ ఫంక్షన్ అయిపోయాక తల్లిదండ్రులతో సరదాగా గడిపి మళ్ళీ సిటీకి రిటర్న్ జర్నీ చేస్తాడు. వీళ్ళు కారులో ప్రయాణిస్తుండగా తొందరగా వెళ్ళే దారిలో వెళ్ళమని రీడ్ తో ఒలివియా చెప్తుంది. ఇక రీడ్ ఒక షార్ట్‌కట్ తీసుకుంటాడు. ఆదారిలో వెళ్తున్నప్పుడు ఒక ట్రక్కు వీళ్ళ కారుని ఢీకొట్టడంతో అడవిలో చిక్కుకుంటారు. ఒక వింత వృద్ధ మహిళ ఈ జంట దగ్గరికి వచ్చి మరో మార్గంలో వెళ్ళమని చెప్తుంది. ఆ దారిలో ఎంతదూరం ప్రయాణించినా ఏ ఒక్క ఊరూ దరిదాపుల్లో కూడా కనిపించదు. అది ఒక అంతులేని దారిగా వీళ్ళకి అనిపిస్తుంది.
అయితే ఈ రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు కారులో నుంచి దిగితే ఆ ప్రాంతం అంతా చీకటిగా కనిపిస్తుంది. మళ్ళీ కారులో కూర్చుంటే బయట పగలు కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో వీళ్ళకి వింతైన దృశ్యాలు కనబడతాయి. జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతుంటారు. అంతేగాక ఒక సైకో కిల్లర్ నుండి ఈ జంట బెదిరింపులను ఎదుర్కొంటారు. ఈ రహదారి కేవలం వాహనాలు సంచరించే దారి మాత్రమేకాదు. వీళ్ళను ఆ దారి ఒక టైమ్-లూప్ లోకి తీసుకెళ్తుంది. అంతే గాక ఆ సైకోకి అతీంద్రీయ శక్తులు కూడా ఉంటాయి. చివరికి వీళ్ళు ఆ టైమ్-లూప్ లో నుంచి బయటికి వస్తారా ? ఈ జంటని వెంటాడుతున్న కిల్లర్ ఎవరు ? ఆ సైకో వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ?అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : రక్త పిశాచులుగా మారే మనుషులు… వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన సీన్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డ్రైవ్ బ్యాక్’ (Drive Back). 2024 లో వచ్చిన ఈ మూవీకి కోడీ ఆష్‌ఫోర్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో జాక్ గోల్డ్, విట్ కున్స్‌చిక్ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళ నటనకు ప్రశంసలుకూడా వచ్చాయి. ఇది స్క్రీమ్‌ఫెస్ట్ హారర్ ఫిల్మ్ ఫెస్టివల్, పాప్‌కార్న్ ఫ్రైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. IMDb లో ఈ చిత్రానికి 7.1/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ సినిమాలను చూసేవాళ్ళకి ఇది ఒక బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు.