E-Paper
Advertisement

కాంక్రీట్ గోడలో యువతి శవం… పుట్టిన ప్రతీ ఆడపిల్లను క్రూరంగా చంపే ముఠా

కాంక్రీట్ గోడలో యువతి శవం… పుట్టిన ప్రతీ ఆడపిల్లను క్రూరంగా చంపే ముఠా
Advertisement

Korean Supernatural Thriller: నమ్మబుద్ధి కాదు గానీ ఇప్పటికీ కొన్నిచోట్ల దారుణమైన మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను చూస్తే అది నిజమే అనిపించక మానదు. దేవతలు, దెయ్యాలు అంటూ చేయకూడని పనులతో క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా ఆచారం పేరుతో ఓ ముఠా సృష్టించే దారుణమే ఈ సినిమా. ఊహించని ట్విస్టులతో, టర్న్ లతో సాగే ఈ సినిమా పేరే ‘స్వాహా : ది సిక్స్త్ ఫింగర్’ (Svaha The Sixth Finger). 2019లో విడుదలైన ఈ కొరియన్ సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాన్ని ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1999లో కొరియాలోని ఒక చిన్న గ్రామంలో కవల ఆడపిల్లలు జన్మించడంతో మొదలవుతుంది. వారిలో ఒకరు నార్మల్ గా కనిపించే అమ్మాయి కాగా, మరొకరు భయంకరమైన రూపంతో, వికృతమైన శరీరంతో పుడుతుంది. ఆ వింత శిశువు కొద్దిరోజుల్లోనే చనిపోతుందని అందరూ భావిస్తారు. కానీ ఆమె మాత్రం బ్రతుకుతుంది. కుటుంబం దాన్ని ఒక ‘దెయ్యం’గా భావించి, ఇంటి వెనుక షెడ్‌ లో బంధించి రహస్యంగా పెంచుతారు. ఆ వింత జీవి ఉన్న ప్రాంతంలో ఎప్పుడూ ఏవో వింత శబ్దాలు, విపత్తులు జరుగుతుండటంతో ఆ కుటుంబం తరచూ ఇళ్లు మారుతూ ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం, పాస్టర్ పార్క్ అనే వ్యక్తి నకిలీ మత సంస్థలు, రహస్య కల్ట్ గ్రూపుల మోసాలను బయటపెట్టే పరిశోధకుడిగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన దృష్టి “డీర్ మౌంట్” అనే ఒక కొత్త బౌద్ధ మత సెక్ట్ వైపు మళ్లుతుంది. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ గ్రూప్ వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని గ్రహించిన పార్క్, తన బౌద్ధ సన్యాసి స్నేహితుడి సహాయంతో దానిపై నిఘా పెడతాడు. అదే సమయంలో నగరంలో కాంక్రీట్ గోడలో పూడ్చిపెట్టిన ఒక యువతి శవాన్ని పోలీసులు కనుగొంటారు.

దర్యాప్తులో ఆ హత్యకు, డీర్ మౌంట్ గ్రూప్‌కు చెందిన నా-హాన్ అనే యువకుడికి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. పాస్టర్ పార్క్ పరిశోధనలో ఒక భయంకరమైన పుస్తకం దొరుకుతుంది. ఆ గ్రూప్‌ను స్థాపించిన కిమ్ జే-సియోక్ అనే వ్యక్తి 1899లో జన్మించాడని, అతను అమరత్వాన్ని సాధించిన ఒక దైవ పురుషుడని ప్రచారం జరుగుతుంది. పూర్వం ఒక టిబెటన్ సన్యాసి కిమ్ జే-సియోక్‌కు ఒక భవిష్యవాణిని చెబుతాడు. కిమ్ పుట్టిన వందేళ్ల తర్వాత, అతను పుట్టిన ఊరిలోనే ఒక “సర్పం” జన్మిస్తుందని, ఆ అమ్మాయి చేతిలోనే కిమ్ మరణం సంభవిస్తుందని చెబుతాడు.

Advertisement

తన అమరత్వాన్ని కాపాడుకోవడానికి కిమ్ జే-సియోక్ నలుగురు యువకులను బ్రెయిన్‌వాష్ చేసి ‘నాలుగు దిక్కుల దేవతలు’గా మారుస్తాడు. వారి ద్వారా 1999లో ఆ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లనూ వెతికి వెతికి అత్యంత క్రూరంగా హత్య చేయిస్తుంటాడు. నా-హాన్ చిట్టచివరి అమ్మాయి అయిన గ్యుమ్-హ్వాను చంపడానికి ఆమె ఇంటికి వస్తాడు. కానీ అక్కడ షెడ్‌లో బంధించి ఉన్న ఆమె వింత ట్విన్ సిస్టర్‌ను చూస్తాడు. నిజానికి ఆ వింత రూపంలో ఉన్న అమ్మాయి దెయ్యం కాదు, ఆమె అసలైన బుద్ధుడి ప్రతిరూపం. అమరత్వంపై వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి, అమాయక ఆడపిల్లలను చంపుతున్న కిమ్ ను ఆ దెయ్యం లాంటి దేవత పిల్ల ఏం చేసింది ? తాను మోసపోయానని గ్రహించిన నా-హాన్ చేసిన పని ఏంటి ? చివరికి వచ్చే మైండ్ బెండింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

తెలుగులో చూడొచ్చా ?

ఈ సినిమాలో ఆధ్యాత్మిక ఎలిమెంట్స్, ట్విస్టులు, సస్పెన్స్ అన్నీ ఉంటాయి. చేతబడి, కల్ట్, జాంబీలు, ఆధ్యాత్మిక రహస్యాలను అద్భుతంగా మిళితం చేసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తుంది. ప్రస్తుతం Netflixలో ఒరిజినల్ కొరియన్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. అయితే తెలుగులో మాత్రం లేదు.

Read Also: కాన్సర్ట్ కోసం బయల్దేరి కనిపించకుండా పోయే గ్యాంగ్… విమానం కూలడంతో కథ కంచికి

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×