OTT Movie : ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలలో స్టోరీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలలో కామెడీ, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. చనిపోయిన తర్వాత స్వర్గం, నరకం ఎలా ఉంటాయో తెలియదు. ఒక వ్యక్తి చనిపోయాక దేవుడు మళ్లీ అతనిని ఒక కండిషన్ పెట్టి భూమిపైకి పంపిస్తాడు. కామెడీగా సాగిపోయే ఈ హాలీవుడ్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘స్విచ్‘ (Switch). స్విచ్ బ్లేక్ ఎడ్వర్డ్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎల్లెన్ బార్కిన్, జిమ్మీ స్మిట్స్, జోబెత్ విలియమ్స్, లోరైన్ బ్రాకో నటించారు. ఈ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో కనిపించిన ప్రతి అమ్మాయిని వదలకుండా అదే దృష్టితో చూస్తాడు. ఇతనికి ఫ్యామిలీ కూడా ఉండదు. అయితే ధనవంతుడు కావడంతో, అమ్మాయిలతో ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తుంటాడు. ఈ క్రమంలో ముగ్గురు ఫ్రెండ్స్ గా ఉండే అమ్మాయిలను హీరో మోసం చేస్తాడు. అలా వాళ్ళు ముగ్గురు ఇతనిని చంపాలనుకుంటారు. మళ్లీ రాత్రి గడుపుదాం అంటూ అతన్ని పిలిపించి చంపేస్తారు. హీరో చనిపోయిన తర్వాత ఒక ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక పిలుపు వినబడుతుంది. నువ్వు చేసిన మంచి పనుల వల్ల స్వర్గానికి వెళతావు. అయితే ఆడవాళ్ళతో నువ్వు చేసిన మోసాల వలన, ముందు నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తారు. దేవుడు ఇతనికి ఒక అవకాశం ఇస్తాడు. స్వచ్ఛమైన మనసుతో నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని భూమి మీదకి మళ్ళీ పంపిస్తాడు. యమధర్మరాజు కూడా ఇతని వెంట వస్తాడు. ఇతనికి ఆడవాళ్ళ మీద చులకన భావం ఉండటంతో ఇతన్ని ఆడదానిగా మారుస్తాడు యమధర్మరాజు.
అప్పటి నుంచి మొదలవుతాయి హీరోకి కస్టాలు. అమ్మాయిగా మారడంతో కంగారు పడిపోతాడు హీరో. ఆఫీస్ లో తను హీరో చెల్లెలు అని పరిచయం చేసుకుంటాడు. హీరో సన్యాసంలో కలవడానికి వెళ్ళాడని, ఇప్పుడు రాడని లెటర్ రాసి పెడతాడు. అమ్మాయి రూపంలో హీరో ఆఫీస్ లో జాయిన్ అవుతాడు. ఆఫీస్ లో ఒక అమ్మాయి హీరో రాడని తెలిసి బాగా బాధపడుతూ ఉంటుంది. ఈమె నన్ను బాగా ప్రేమిస్తుందని అనుకుంటాడు హీరో. అతడు వెళ్లిపోయినందుకు ఆమె ఆనందపడుతూ ఉంటుంది. ఆఫీసులో అమ్మాయిలు అందరూ, హీరో ఇక రాడనీ సంతోష పడుతూ ఉంటారు. చివరికి హీరోకి స్వచ్ఛంగా ప్రేమించే మనిషి దొరుకుతుందా ? మళ్లీ హీరో నరకానికి వెళతాడా? హీరో అమ్మాయి రూపంలోనే ఉండిపోతాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘స్విచ్’ (Switch) రొమాంటిక్ ఫాంటసీ కామెడీ మూవీని చూడాల్సిందే.