Gopichand : టాలీవుడ్ హీరో గోపి చంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోకు ఇప్పుడు సక్సెస్ సినిమాలు లేవు. హిట్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు పవర్ ఫుల్ స్టోరీల తో సినిమాలు చేస్తున్నాడు. అయితే గోపీచంద్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. గోపి చంద్ సినిమాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఎవరి వల్ల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్. తన డెబ్యూ మూవీ తొలి వలపు తో అందరిని ఆకర్షించాడు.. ఆ మూవీతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస సినిమాల తో బిజీ అయ్యాడు. గోపి చంద్ తేజా డైరెక్షన్ లో జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనతో మరో కోణాన్ని చూపించాడు. అయితే కెరీర్ పరంగా గోపిచంద్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం రవి కుమార్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యజ్ఞం సినిమానే.. ఇక ఆ తర్వాత ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్టు, చాణక్య, పంతం వంటి డిజాస్టర్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.. ఈ మధ్య సీటిమార్ మూవీతో ప్రేక్షకుల ను పలకరించాడు. అది కొంత పర్వాలేదు అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన మారుతీ దర్శకత్వం లో పక్కా కమర్షియల్ తో మళ్లీ నిరాశ పరిచాడు. జయాపజయాలను పక్కన పెడితే మాస్ యాక్షన్ సినిమాలతో పాటు గోపీచంద్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు..
ఇక గోపిచంద్ గురించి ఒక టాప్ సీక్రెట్ బయటకు వచ్చింది.. అసలు గోపి చంద్ కు ఇష్టం లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడట. తండ్రి కృష్ణ ఒకప్పుడు దర్శకుడి గా వరుస సినిమాలను చేశారు. ఇక గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయన కూడా ఒకటి రెండు సినిమాలకు దర్శకుడుగా పనిచేసారు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ యాక్సిడెంట్ లో కన్నుమూసారు. ఇక తన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో ఒకరైన ఉండాలని తన తండ్రి కోరాడట. దాంతో తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇష్టం లేకపోయిన సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడట.. అలా ఆయన సినీ కేరీర్ మొదలైంది. ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్ కు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు సినిమాలను నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ హీరోతో మొదటి సినిమాను నిర్మిస్తారో చూడాలి. ఇక అలాగే ఈయన సినిమాల ను చేస్తున్నాడు.