E-Paper
Advertisement

OTT Movie : ప్రపంచ సుందరి ట్రాన్స్ జెండర్ గా మారితే… స్టార్ హీరోయిన్ చేసిన ఈ సాహసాన్ని చూడాల్సిందే మావా

OTT Movie : ప్రపంచ సుందరి ట్రాన్స్ జెండర్ గా మారితే… స్టార్ హీరోయిన్ చేసిన ఈ సాహసాన్ని చూడాల్సిందే మావా
Advertisement

OTT Movie : ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. వీటిలో అన్ని జానర్లలో సినిమాలు వస్తున్నాయి. అయితే ఒక మంచి సందేశాన్ని ఇచ్చే వెబ్ సిరీస్ లు ఎప్పటికీ గుర్తుకు ఉండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వెబ్ సిరీస్, ట్రాన్స్ జెండర్ లు సమాజంలో ఎదుర్కొనే పరిస్థితులతో తెరకెక్కించారు. నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, దీనిని రూపొందించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

జియో సినిమా (Jio Cinema) లో

Advertisement

2023 లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ పేరు ‘తాలీ’ (Taali). ఇది ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా రూపొందించబడింది.  దీనికి రవి జాధవ్ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటి సుష్మితా సేన్, శ్రీగౌరి సావంత్ పాత్రలో నటించారు. ఆమె ఈ సిరీస్‌లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. జియో సినిమా (Jio Cinema) లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

గణేష్ అనే 10 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. అయితే రాను రాను అతని ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. అతను ఆడపిల్లలా తయ్యారవ్వాలనుకుంటాడు. పెరిగి పెద్దయ్యాక తల్లి కావాలని కలలు కంటాడు. ఈ విషయం తెలిసిన అతని తండ్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. గణేష్ ను అతని తండ్రి దండిస్తాడు. తన తండ్రి ఒక పోలీసు అధికారి కావడంతో, కుటుంబ గౌరవం కోసం గణేష్ 15 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి వెళ్లిపోతాడు. గణేష్ అప్పటినుండి సమాజంలో గౌరీ గా మారుతుంది. గౌరి ముంబైకి వెళ్లి, అక్కడ ట్రాన్స్‌జెండర్ లతో కలసి ఒక కొత్త జీవితం ప్రారంభిస్తుంది. అక్కడ ఆమె నార్గిస్ అనే ధైర్యవంతమైన ట్రాన్స్‌జెండర్ ని కలసి, తన జీవితంలో మార్పు తెచ్చుకోవాలని అనుకుంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడచిపోతాయి. గౌరి ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటుంది. ఆ అమ్మాయిని వేశ్యావృత్తిలోకి కొంతమంది విక్రయించడానికి ప్రయత్నం చేస్తుండగా, ఆ ప్రమాదం నుండి ఆమెను కాపాడుతుంది గౌరి. ఈ విధంగా తాను తల్లిని కావాలనుకున్న కలను సాకారం చేసుకుంటుంది.

ఆ తరువాత గౌరి ట్రాన్స్‌జెండర్ లకు,  భారతదేశంలో మూడవ లింగంగా గుర్తించేలా చేయడానికి ఒక చారిత్రాత్మక పోరాటం చేస్తుంది. ఆమె నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) లో పాల్గొని, సుప్రీంకోర్టు ద్వారా 2014 లో ట్రాన్స్‌జెండర్లకు అధికారిక గుర్తింపు వచ్చేలా చేస్తుంది. ఈ విజయం ఆమె జీవితంలో గొప్ప విజయంగా చెప్పబడుతుంది. ఈ సిరీస్ ట్రాన్స్‌జెండర్ లు ఎదుర్కొనే సమస్యలను, వారి హక్కుల కోసం, సమాజంలో సమానత్వం, గౌరవం కోసం చేసే ప్రయత్నాలను వెలుగులోకి తెస్తుంది. గౌరి ఒక సంకల్పం తో ముందుకు వెళ్ళే విధానం ఇందులో చక్కగా చూపించారు. సుష్మితా సేన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్‌లతో వచ్చింది. ప్రతి ఎపిసోడ్ ఆమె జీవితంలోని ఒక ముఖ్యమైన పాత్రను వివరిస్తుంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×