B.Tech Students: బీటెక్ చదివే విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఫెయిల్ అయిన బీటెక్ విద్యార్థులకు ఇది వరం లాంటి న్యూస్. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా సర్టిఫికెట్ జారీ కానుంది. ఈ దిశగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. సగం క్రెడిట్లు సాధిస్తే ఇక ఈజీగా సర్టిఫికెట్ ఇవ్వాలని యోచిస్తోంది.
బీటెక్ నాలుగేళ్ల కోర్సు అని అందరికీ తెలిసిన విషయమే. మూములుగా.. నాలుగేళ్లు బీటెక్ చదివిన విద్యార్థి ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా బీటెక్ పట్టా ఇవ్వరు. దాంతో ఫెయిల్ అయిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లినా బీటెక్ సర్టిఫికెట్ అడుగుతారు. ఇక నుంచి అలా కాకుండా బీటెక్ ఫెయిల్ అయినా సర్టిఫికెట్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ALSO READ: ISRO Recruitment: ఐటీఐ, బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. ఇంకెందుకు ఆలస్యం
నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా వారికి ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని కూడా నియమించనుంది. బీటెక్ లో 160 క్రెడిట్లు (ఒక్కో సెమిస్టర్ కు 20) ఉంటాయన్న విషయం తెలిసిందే. కనీస మార్కులతోనైనా అన్ని సబ్జెక్టులు పాసైతే వారు 160 క్రెడిట్లు సాధించిన వారు అవుతారు. ఇందులో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైనా బీటెక్ పట్టా పొందేందుక అనర్హులవుతారు. దీంతో విద్యార్థి నాలుగేళ్ల కాలం వృథా అవుతోంది. ఎక్కడా ఉద్యోగంలోకి సెలెక్ట్ కాలేరు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానంతో ఇక సగం సబ్జెక్టుల్లో పాసైనా విద్యార్థులు సర్టిఫికెట్ పొందుతారు. అంటే ఆ విద్యార్థులు 80 క్రెడిట్లు పొందుతారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఓ కమిటీని కూడా నియమించనుంది. దీంతో వారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అంతే కాకుండా యూనివర్సిటీల్లో ఎగ్జామ్ ఫీజులు, ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి ప్రమోట్ అయ్యేందుకు అవసరమైన క్రెడిట్లు రకరకాలుగా ఉండటంపై కూడా అధికారుల చర్చించనున్నారు.
ALSO READ: Jobs: రాష్ట్రంలో 10,954 గవర్నమెంట్ జాబ్స్.. ప్రభుత్వం కీలక ప్రకటన
ALSO READ: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?