E-Paper
Advertisement

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Indonesian Action Thriller: హీరో అంటే ఎప్పుడూ యువకుడే కానక్కర్లేదు.. వయసు మీద పడినా అవసరమైతే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించగల తాత కూడా కావచ్చు. ముఖ్యంగా తన కుటుంబానికి ప్రమాదం ఎదురైతే ఆ తాతలోని అసలైన యాక్షన్ హీరో బయటకు వస్తే విలన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో ‘Never Surrender’ అనే ఇండోనేషియన్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో మాజీ సైనికుడిగా నటించిన లుక్మాన్ సర్ది ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇందులో తన మనవళ్ల కోసం ఓ తాత సాగించిన పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథ ఎయాంగ్ హరి (లుక్మాన్ సర్ది) అనే ఒక రిటైర్డ్ స్పెషల్ ఫోర్సెస్ సోల్జర్ చుట్టూ తిరుగుతుంది. గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల అపరాధ భావంతో తన కుటుంబానికి దూరంగా ఒక మారుమూల గ్రామంలోని ఇంట్లో ఒంటరిగా బతుకుతుంటాడు. అయితే ఒకరోజు అతనితో పెద్దగా పరిచయం లేని తన మనవడు, మనవరాలు అతని ఇంటికి వస్తారు. సరిగ్గా అదే రాత్రి, ఒక కరడుగట్టిన క్రిమినల్ గ్యాంగ్ ఆ ఇంటిపై భయంకరమైన దాడి చేస్తుంది. తన మనవళ్ల ప్రాణాలను కాపాడుకోవడం కోసం, ఆ రిటైర్డ్ తాత ఏళ్ల తర్వాత మళ్లీ ఆయుధం పడతాడు.

Advertisement

వయసు మీద పడినా తన పాత మిలిటరీ స్కిల్స్ తో ఆ ఇంట్లోకి చొరబడిన రౌడీ గ్యాంగ్ మెంబర్స్ కి అతను చుక్కలు చూపించే సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అసలు ఆ గ్యాంగ్ అతని కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతోంది? చివరకు ఈ ముగ్గురూ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారా? అనేదే మిగతా కథ. వన్-మ్యాన్ ఆర్మీ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి తాతలో ఈ భయంకరమైన యాక్షన్ యాంగిల్ పక్కాగా గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అయితే ఇది కేవలం వన్ మ్యాన్ ఆర్మీ యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. మూడు తరాల మధ్య దెబ్బతిన్న అనుబంధాన్ని తిరిగి నిర్మించుకునే కథ కూడా. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ని అస్సలు మిస్ అవ్వకండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్  

ఇండోనేషియన్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ‘Never Surrender’ అనేది ఇంగ్లీష్ టైటిల్ కాగా, అసలు పేరు ‘Serangan Balik’. ఈ సినిమాకు ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేదు. ఇది ప్రముఖ ఓటీటీ వేదిక Netflix లో నవంబర్ 12 నుండి నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎయాంగ్ హరి పాత్రలో లుక్మాన్ సర్ది నటించగా, పుట్రీగా కల్లిస్టా అరుమ్, దిమాస్‌గా సుల్తాన్ హమోనంగన్ కనిపిస్తారు. సిధార్త టాటా దర్శకత్వం వహించగా, ఎడ్విన్ నజీర్, కిమో స్టాంబోయెల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా నిడివి సుమారు 2 గంటల 17 నిమిషాలు. ఇది ఇండోనేషియన్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ ఆడియో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: బాంబుల వర్షం కురుస్తున్న గాజాలోకి ముగ్గురు డాక్టర్లు… ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే

Tags

Related News

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చేసిందోచ్… ఓటీటీలో తలైవా మాస్ జాతర షురూ

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ

బాంబుల వర్షం కురుస్తున్న గాజాలోకి ముగ్గురు డాక్టర్లు… ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

Advertisement
×