Thriller Movie In OTT : మలయాళం, తమిళ ఇండస్ట్రీల నుంచి ఎన్నో హిట్ సినిమాలు తెలుగులోకి కూడా వస్తున్నాయి.. ఈ ఏడాది మలయాళం లో వచ్చిన ప్రతి మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాయి. అలాగే తమిళ్ చిత్రాలు కూడా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడం తో బడ్జెట్ సినిమాలు సైతం అవాక్కాయలే కలెక్షన్స్ అందుకున్నాయి. లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీస్ మాత్రమే కాదు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కూడా వస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఆ మూవీ ఎంటీ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే జనాలు వదలరు. కథలో కొంచెం తడబడిన సినిమాలు మాత్రమే థియేటర్ల నుంచి కొన్ని రోజులకే వెనక్కి వస్తున్నాయి.. ఇటీవల థ్రిల్లర్ కాన్సెఫ్ట్ తో సినిమాలు ఎక్కువగా ఓటీటీ లోకి రిలీజ్ అవుతున్నాయి. తమిళ మూవీ ‘సొర్గవాసల్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ థ్రిల్లర్ చిత్రానికి థియేటర్లలో పెద్దగా వసూళ్లు దక్కలేదు. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఆర్జే బాలాజీ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా ఓటీటీలోకి వచ్చిన తర్వాత భారీ వ్యూస్ ను రాబట్టడంతో పాటుగా క్రేజ్ అందుకుంటున్నాయి. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. తమిళ మూవీ సొర్గవాసల్ .. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సొర్గవాసల్ చిత్రం సుమారు రూ.15కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అంచనాలకు తగ్గట్టు వసూళ్లు రాలేదు. మోస్తరు వసూళ్లు దక్కించుకుంది. అయితే, ఈ తక్కువ బడ్జెట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. గత నెల 27 న ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ అప్పటి నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. సిద్ధార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది.. ఇది మొత్తం జైలు బ్యాక్ డ్రాప్లోనే తెరకెక్కుతుంది.. చెయ్యని మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తే అతని చుట్టూ ఉన్న సమాజం అతన్ని ఎలా చూస్తుంది అనేది ఈ మూవీ స్టోరీ. సానియా ఇలప్పన్, షరాఫుద్దీన్, షరాఫుద్దీన్, నాటీ సుబ్రమణియం, బాలాజీ శక్తివేల్, హక్కిమ్ షా, రవి రాఘవేంద్రన్ కీరోల్స్ పోషించారు..ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసి మీరు కూడా ఎంజాయ్ చెయ్యండి.. కేవలం 8 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ డబుల్ కలెక్షన్స్ ను అందుకుంది.