OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, కొంతకాలం తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్ల వరకు వెళ్లకుండానే నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. ఒక బెంగాలీ మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా, నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ లాక్ డౌన్ లో ఒక ఫ్యామిలీలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫ్యామిలీ డ్రామా బెంగాలీ మూవీ పేరు ‘తాషెర్ ఘౌర్‘ (Tasher Ghawr). ఈ బెంగాలీ మూవీ సెప్టెంబర్ 3, 2020న నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ హోయిచోయ్ (hoichi) లో విడుదలైంది. సుదీప్తో రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్వస్తిక ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య, చేసే పనులతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మీరా, రమేష్ భార్య భర్తలుగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే భార్యకి పిల్లలు పుట్టకపోవడంతో, రమేష్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీరాకు రెండుసార్లు అబార్షన్ అవడంతో గర్భసంచి కూడా పోతుంది. ఈ క్రమంలో రమేష్ వేరొకరితో రిలేషన్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నుంచి మీరాతో దూరంగా ఉంటూ, ఆమెపై కోపంగా మాట్లాడుతుంటాడు. మీరా అత్త అనారోగ్యం కారణంగా మంచం మీదనే ఉంటుంది. ఆమెకు సేవ చేయడానికి ఎవరిని పెట్టుకోకుండా, భార్యతోనే అన్నిపనులూ చేపిస్తుంటాడు రమేష్. అయితే అత్త దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్, మీరా తట్టుకోలేక పోతుంది. ఆమె తినే భోజనంలో స్లో పాయిజన్ కలుపుతూ, అత్తని కొన్నిరోజుల్లో చంపేస్తుంది మీరా. ఆ తర్వాత భర్త సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావడంతో, లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే జాబ్ చేయాల్సి వస్తుంది.
ఈ క్రమంలో భార్య మీరాకి ఎక్కువ టార్చర్ పెడుతుంటాడు రమేష్. ఆమెతో చిన్న విషయాలకి గోడవపడి, తన ముందర బెడ్ రూమ్ తలుపులు వేసుకొని గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటాడు. రాత్రిపూట గదిలో తనతో గడిపే సమయంలో లైట్లు ఆఫ్ చేసి, గర్ల్ ఫ్రెండ్ ని ఊహించుకుంటాడు. ఈ విషయాలతో తిక్క లేచిన మీరా ఒక నిర్ణయం తీసుకుంటుంది. భర్తకి పెట్టే భోజనంలో ఎలకల మందు కలుపుతుంది. ఈరోజు నుంచి నాకు ఈ నరకం నుంచి విడుదల అనుకుంటూ ఉంటుంది. చివరికి భర్త ఆ భోజనం తిని చనిపోతాడా? మీరాకి భర్త నుంచి స్వేచ్ఛ వస్తుందా? చివరికి మీరా ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తాషెర్ ఘౌర్’ (Tasher Ghawr) అనే ఈ బెంగాల్ మూవీని మిస్ కాకుండా చూడండి.