E-Paper
Advertisement

OTT Movie : దయ్యానికే చుక్కలు చూపించే స్టూడెంట్స్… టీచర్ ని కూడా వదలకుండా…

OTT Movie : దయ్యానికే చుక్కలు చూపించే స్టూడెంట్స్… టీచర్ ని కూడా వదలకుండా…
Advertisement

OTT Movie : హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మూవీ లవర్స్. ఈ సినిమాలలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ తోనే సగం ప్రాణాలు పైకి పోతాయి. అయితే ఈ సినిమాలు చూస్తున్నంత సేపు బాగా థ్రిల్ అవుతారు మూవీ లవర్స్. ఈ సినిమాలను ఒంటరిగా చూసే ధైర్యం చాలా మంది చేయరు. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

రెండు ఓటీటీలలో 

Advertisement

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు (Mon Mon Mon Monsters). జూలై 28, 2017న థియేటర్లలో విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీకి గిడెన్స్ కో దర్శకత్వం వహించారు. తోటి విద్యార్థులు హీరోని తమలో ఒకరిగా అంగీకరించడంతో, వారి దుర్మార్గాలలో పాలుపంచుకుంటాడు. ఒక రాత్రి మనిషి  మాంసాన్ని తినే ఆడ పిశాచాలలో, ఒకదానిని పట్టుకుని బాగా హంసిస్తారు. ఈ మూవీ ఆపిల్ టీవీ (Apple TV), ప్రైమ్ వీడియో Prime video లలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

జాక్ అనే కుర్రాడు స్కూల్ కి వెళ్లి చదువుకుంటూ ఉంటాడు. అయితే ఇతని క్లాస్మేట్స్ జాక్ ని ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు. మరీ ఎక్కువగా రెన్హో ఏడిపిస్తూ ఉంటాడు. జాక్ స్కూల్ టీచర్ కి ప్రాబ్లం చెప్పినా ఆమె తేలిగ్గా తీసుకుంటుంది. కావాలనే వాళ్ళ మీద చాడీలు చెబుతున్నాడని అనుకుంటుంది. అయితే ఒకరోజు రెన్హో బ్యాచ్, జాక్ ని తీసుకొని ఒక చోటికి వెళుతుంది. ఒక ముసలోడి ఇంటికి వెళ్లి ఏదైనా దొంగతనం చేద్దామనుకుంటారు. అక్కడికి వెళ్లిన వీళ్ళకి ఒక మాన్ స్టర్ కనపడుతుంది. ఇంట్లో ఒక పెట్టిని దొంగతనం చేసి ఎత్తుకుపోతుండగా, వాళ్ల మీద మాన్స్టర్ దాడి చేస్తుంది. అయితే ఎలాగో తప్పించుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు రౌడీ బ్యాచ్. ఒక చోటికి వెళ్లి పెట్టే ఓపెన్ చేయగా, అందులో మరొక మాన్స్టర్ ఉంటుంది. సూర్యుని వెలుతురు ఆ మాన్స్టర్ తట్టుకోలేక పోతుంది. అది బలహీనంగా ఉండటంతో, ఈ రౌడీలు మాన్స్టర్ ని బంధిస్తారు. మనుషుల రక్తాన్ని తాగే ఆ మాన్స్టర్ తిండి లేక బలహీన పడిపోతుంది.

దానిని వెతుక్కుంటూ మరో మాన్స్టర్ అక్కడికి వస్తూ ఉంటుంది. ఈలోగా జాక్ ఆ మాన్స్టర్ కి తన రక్తాన్ని ఆహారంగా ఇస్తాడు. తప్పించుకోవడానికి కూడా సహాయం చేస్తానని చెప్తాడు. ఆ రౌడీ బ్యాచ్ ఈ మాన్స్టర్ ని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. దేవుడి మీద జోకులు వేస్తున్న రౌడీ బ్యాచ్ ని టీచర్ కొడుతుంది. ఆ రౌడీ బ్యాచ్ మాన్స్టర్ రక్తాన్ని ఆమె తాకే డ్రింక్ లో కలుపుతారు. అది తాగిన టీచర్ నిప్పులా కాలిపోతుంది. మరోవైపు మాన్స్టర్ కోసం వెతుక్కుంటూ తన సిస్టర్ అయిన మరో మాన్స్టర్ వస్తుంది. చివరికి జాక్ ఆ మాన్స్టర్లని కాపాడుతాడా ? మాన్స్టర్ చేతిలో రౌడీ బ్యాచ్ ఏమవుతుంది? ఇంతకీ ఆ మాన్స్టర్ లు ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ముంబైని వణికించే మూగ చెవిటి లేడీ సైకో… వణుకు పుట్టించే డార్క్ క్రైమ్ థ్రిల్లర్

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్

సోదరుడి మృతదేహం కోసం అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి… రాత్రంతా ఊపిరి బిగపట్టించే టెన్షన్… డార్క్ సస్పెన్స్ డ్రామా

క్రేజీ పోలీసుల పిచ్చి ప్లాన్‌లు… అడుగడుగునా పొట్టచెక్కలయ్యే కామెడీ

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

Big Stories

Advertisement
×