OTT Movie : దాదాపు రెండు గంటలకు పైగా సినిమాలలో ఆడియన్స్ ని కూర్చో బెట్టాలంటే, కథలో ఎంతో కొంత దమ్ము ఉండాలి. అలాంటి దమ్మున్న కథలు అన్ని భాషల్లో అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటిని వదిలి పెట్టకుండా చూడటానికి సమయం కేటాయిస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఎక్కువగా ఇప్పుడు థ్రిల్లర్ జానర్ లో వస్తున్న సినిమాలకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. బెంగాలీ ఇండస్ట్రీ నుంచి అలాంటి థ్రిల్లర్ స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, మదర్ సెంటిమెంట్ తో నే వచ్చింది. అయితే క్లైమాక్స్ వరకు మైండ్ బెండ్ అయ్యే ట్విస్ట్లు ఉంటాయి. ఒక మర్డర్ తో మొదలయ్యే ఈ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘పోటు’ (Potu) 2024 వచ్చిన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఇది అహ్మద్ హుమాయున్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. ఇది జాజ్ మల్టీమీడియా నిర్మాణంలో రూపొందింది. ఇందులో ఇవాన్ సైర్, అఫ్రా షయారా, షోయబ్ మోనీర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2024 మే 10న థియేటర్లలోకి వచ్చింది. 2025 జూలై 17 నుంచి Bongo ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పద్మా నది ఒడ్డున ఉన్న రాజ్‌షాహీ జిల్లాలోని చిన్న గ్రామం బాగ్దా. ఇక్కడ జమీలా అనే 45 ఏళ్ల వితంతువు తన ఏకైక కొడుకు పోటుతో ఒక చిన్న ఇంట్లో జీవిస్తుంటుంది. 28 ఏళ్ల పోటు ఆ గ్రామంలో చిన్న చిన్న బోట్ రిపేర్ పనులు, చేపల వ్యాపారం చేసుకుంటూ, తన తల్లిని చూసుకుంటూ ఉంటాడు. జమీలా భర్త మహ్మద్ హోస్సేన్ 10 ఏళ్ల క్రితం ఒక బోటు ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత జమీలా ఒక చిన్న టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. గ్రామంలో ఆమె గౌరవంగా బతుకుతుంటుంది. కానీ ఆమె గతంలో ఒక సీక్రెట్ దాగి ఉంది. ఆమె భర్తకు ముందు రహమాన్ అనే ఒక ధనవంతుడైన బిజినెస్‌మెన్‌తో ప్రేమలో ఉండేది. రహమాన్ ఢాకాలో ఉంటాడు. ఆ గ్రామానికి దూరంగా ఉన్నా ఆమెను మరచిపోలేదు.
Read Also : పిల్లల కళ్ళను తీసుకుని ఆయుష్షు పెంచుకునే దిక్కుమాలినోళ్లు… ఒళ్ళు ఝల్లుమనిపించే హర్రర్ థ్రిల్లర్
ఒక రోజు సాయంత్రం పద్మా నదిలో ఒక మృతదేహం తేలుతూ కనిపిస్తుంది. గ్రామస్తులు గుమిగూడతారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆకాష్ దర్యాప్తు మొదలు పెడతాడు. మృతుడి జేబులో ఒక కాగితం దొరుకుతుంది. అందులో జమీలా ఇంటి చిరునామా, ఆమె పేరు రాసి ఉంటుంది. ఇది పోటుకు షాక్ ఇస్తుంది. ఆ గ్రామంలో అందరూ అతన్ని అనుమానిస్తారు. అతను తన తల్లి గౌరవాన్ని కాపాడుకోవాలని సొంతంగా దర్యాప్తు మొదలు పెడతాడు. ఆ తరువాత రహమాన్ గురించి పోటు మొత్తం తెలుసుకుంటాడు. కథ నడిచే కొద్దీ మరిన్ని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్లు వస్తాయి. క్లైమాక్స్ లో మరో హత్యతో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్లు ఏమిటి ? రహమాన్ ను చంపింది ఎవరు ? పోటు తన తల్లి గౌరవాన్ని నిలబెడతాడా ? పోటు తల్లి గతం ఏమిటి ? ఆ గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ? అనే విషయాలను, ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.