OTT Movie : ఒకప్పుడు మలయాళం సినిమాలంటే పెద్దలకు మాత్రమే అన్నట్టు ఉండేవి. మొదటగా ఈ మలయాళం లేడీ సూపర్ స్టార్ షకీలానే గుర్తుకొచ్చేది. అయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పరిస్థితి మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీయగలుగుతున్నారు. రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, హీరో హీరోయిన్లు ఏటి గట్టు దగ్గర రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఒకరోజు కాదు ప్రతిరోజు అదే పనిలో మునిగితేలుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చే పరిణామాలు వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ మలయాళం మూవీ పేరు ‘థానుప్’ (Thanupp). 2024 లో విడుదలైన ఈ మలయాళం మూవీకి నారాయణన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నిధీష్ నంబియార్, జిబియా టి.సి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 4 అక్టోబర్ 2024న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ మనోరమ మ్యాక్స్ (Manorama Max), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో, హీరోయిన్లు కొత్తగా ఒక ఊరికి వచ్చి అద్దె ఇంట్లో దిగుతారు. వీళ్లకు అదే ఊర్లో ఉండే ప్రకాష్ హెల్ప్ చేస్తాడు. ఈ ప్రకాష్, హీరోకి సంతోష్ అనే వ్యక్తి ద్వారా పరిచయం అవుతాడు. ప్రకాష్ అదే ఊరిలో పెయింట్ పని చేసుకుంటూ ఉంటాడు. హీరో కూడా అతని వెంట పెయింట్ పనికి వెళ్తాడు. అందరూ వెళ్లిపోయాక రాత్రిపూట భార్యా, భర్తలు ఏటి గట్టు దగ్గరికి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఈ విషయం అక్కడ ఉన్న ఒక తాగుబోతు గ్యాంగ్ గమనిస్తుంది. వాళ్ల వెంట వెళ్లి వాళ్ళు చేసే పనిని వీడియో కూడా తీస్తారు. ఆ వీడియో అక్కడ ఉన్నవాళ్లు చూసి వీళ్లను ఎగతాళి చేస్తుంటారు. ఆ వీడియొ వైరల్ కూడా అయిపోతుంది. అప్పుడు ఈ భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. విషయం తెలుసుకున్న హీరో ఫ్రెండ్ సంతోష్ అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న వాళ్లకు జరిగిన విషయం చెప్తాడు.
నిజానికి హీరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్, హీరోయిన్ ఒక డబ్బున్న అమ్మాయి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే హీరో హిందు, హీరోయిన్ క్రిస్టియన్ కావడంతో ఇద్దరి ఇళ్లల్లో పెళ్లికి ఒప్పుకోరు. ఆ తర్వాత ఇద్దరు బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు కలిగితే పెద్దవాళ్లు దగ్గరికి వస్తారని భావిస్తారు. ఎంత ప్రయత్నించినా పిల్లలు మాత్రం పుట్టకపోవడంతో దిగులు పడతారు. ఒక స్వామీజీని కలిసి తమ గోడు చెప్పుకుంటారు. ఆ స్వామీజీ వీళ్లకు ఏటిగట్టు దగ్గర కొన్ని నియమాలతో కలిస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో ఇలా చేస్తారు. ఈ విషయం తెలిసిన ఆ ఊరు ప్రజలు చాలా బాధపడతారు. చివరికి ఈ భార్యా, భర్తలు ఆ వీడియో వల్ల ఏమవుతారు? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, ‘థానుప్’ (Thanupp) అనే ఈ మూవీ చూడండి.