Gundeninda GudiGantalu Today episode march 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు మనోజ్ కేపీ పాలెం లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంటారు. ప్రభావతి కోడలు పోయిందని బాధతో ఉంటుంది. ఇక మనోజు కార్ ఆపరా నేను వెళ్ళిపోతానని అంటాడు. ఎక్కడికి వెళ్తావు రా వెళ్ళు.. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికి రావాలి అది ఆలోచించు పద మీనా మనం వదిలేసి వెళ్ళిపోదాం వాడి చావు వాడు చేస్తాడు అనేసి బాలు సెటైర్లు వేస్తాడు.. రోహిణి కోసం అందరిని అడుగుతారు. అక్కడ చింటూ మీనా అత్త అనేసి వస్తాడు. చింటూ నువ్వేంటి ఇక్కడ అని నేను అడుగుతుంది. మా ఊరు అత్త అంటే మీ అమ్మమ్మ ఫోన్ ఎందుకు పనిచేయలేదు అంటే మా అమ్మమ్మ ఫోను లేదు అని చింటూ అంటాడు. అందరూ కలిసి సుగుణమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడికి రావడం రోహిణి చూసి షాక్ అవుతుంది. వీళ్లంతా ఎందుకు వచ్చారు నేను ఇక్కడ ఉన్నాను సంగతి తెలియకుండా మ్యానేజ్ చేసి పంపించేయాలని రోహిణి అంటుంది. సుగుణమ్మ వాళ్లను పంపిస్తుంది. ఇక రోహిణి కోసం ఊరంతా జల్లెడ పట్టి వెతుకుతారు అయినా కూడా రోహిణి కనిపించదు ఇంకా ఇంటికి వెళ్లి పోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటికి వెళ్ళగానే ప్రభావతికి బాలు నన్ను సన్యాసం తీసుకొని మాట్లాడడమ్మా రోహిణి వెళ్ళిపోయింది అని బాధలో నేనుంటే నన్ను ఇంకా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మానేసి కంప్లైంట్ ఇస్తాడు. చిరాకు లో ఉన్నాను రా నువ్వు నన్ను ఇది చేయకు నేనేం చేస్తాను నాకే తెలియదని మనోజ్ బాలుకు వార్నింగ్ ఇస్తాడు. ఇది మరీ బాగుందిరా నీకోసం నేను నా ట్రిప్పును వదిలేసుకుని డీజిల్ లేకపోతే డీజిల్ మరీ కొట్టించుకొని ఇంత చేస్తే 200 కిలోమీటర్ల నీకోసం తిరిగితే నువ్వు ఈ మాట అంటావా చూసావా మీనా ఈ డబ్బావతికి మనోజ్ ఏమని చెప్తున్నాడు అనేసి అంటాడు బాలు. ఇదంతా కాదురా 200 కిలోమీటర్లు వచ్చాను కిలోమీటర్కు 15 రూపాయలు చొప్పున నాకు 3,000 తీ డబ్బులు చూసావా మీనా ఎంత కష్టపడి వీడి కోసం వెళ్తే వీడు ఎలా అంటున్నాడు అని బాలు అంటాడు. ఇప్పుడే రోహిణి ఇక ఆపు బాలు అని అరుస్తుంది.
రోహిణిని ఇంట్లో ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు ఇదేందిది మనము ఊరంతా వెతికి వస్తే ఇంట్లోనే ఉందా కనీసం ఫోన్ చేసి కూడా చెప్పాలని లేదా అని బాలు అరుస్తాడు. నువ్వు మా ఆయనను అనడం మానేస్తే మంచిది అని రోహిణి బాలుకు వార్నింగ్ ఇస్తుంది. ఇది మరీ బాగుందే నేను మీ ఆయన చేసిన మోసాన్ని బయట పెట్టాను అంతేతప్ప మీ ఆయన్ని పట్టికలర్గా నిన్ను ఏదో చేయాలని అనుకోలేదని బాలు అంటాడు. జాబ్ లేదు అంతే కదా జాబ్ తెచ్చుకుంటాడు నువ్వు పెద్ద ఇది చేసి జాబ్ గురించి రచ్చ చేయొద్దు అని బాలుకి వార్నింగ్ ఇస్తుంది.
ఇది మరీ బాగుంది మీ ఆయన చేసిన తప్పుకి మరి మా ఆయనను ఎందుకు అంటారు అని మీనా కూడా బాలుపై మాట పడనివ్వకుండా అరుస్తుంది.. పొయ్యి పార్కులో పడుకోవడం మా ఆయన ఇచ్చిన సంపాదనని వాడుకోవడం ఇవన్నీ ఏంటి మీ ఆయన మన డబ్బులు ఇస్తున్నాడా? ఇంటి ఖర్చులకోసం మా ఆయన డబ్బులు ఇస్తే దాన్ని మీ ఆయనకి ఇచ్చారు అది చూడలేదు అనుకుంటున్నారా అని ఇన్ డైరెక్టుగా ప్రభావతికి కౌంటర్ ఇస్తుంది మీనా. దానికి ప్రభావతి ఏంటే నా గురించి మాట్లాడుతున్నావ్ నేను ఎప్పుడు ఇచ్చాను అని అంటుంది.
నాకు అన్నీ తెలుసులెండి అత్తయ్య మీరు ఏమి కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది మీనా. బాయ్ ని గురించి బాధపడాల్సింది నేను మీకు అవసరం లేదు అని రోహిణి అనగానే అటు శృతి కూడా అవును కరెక్టే ఇది మీ పర్సనల్ విషయం మీ గురించి బయటకు తీయాల్సిన అవసరం ఎవరికీ లేదు అనగానే అటు రవి కూడా అవును నిజమే అన్నయ్య ఇది మీ పర్సనల్ విషయం అని అంటాడు దానికి బాలు కోపంతో రగిలిపోతాడు చూసావా లేచిపోయినోడు కూడా ఎన్ని మాటలు అంటున్నాడు నాదే తప్పు అంటున్నాడు వాడు జాబ్ తెచ్చుకోకుండా పార్కులో పడుకోవడం కూడా నాదే తప్పు అంటున్నాడు అని సత్యంతో అంటారు.
చూసావా నాన్న వీళ్ళు నేను ఈ పార్లరమ్మ ఇంట్లో మనిషే అని కనిపించకుండా పోయిందని ఎంతో కష్టపడి ఇన్నిళ్లు వెతికాను కానీ అది ఎవరికీ కనిపించదు. ఏమి ఎలా మాట్లాడుతుందో వింటున్నావా నా పనులన్నీ మానుకొని మరి ఆమె కోసం వెతకడానికి వెళ్లాను కనీసం ఇంత కూడా లేకుండా మాట్లాడుతున్నారు అని సత్యంతో అంటాడు. తనకి సత్యం నువ్వు మంచి మనసుతో చేసిన కూడా నీ మాటతో నీకు కోపంతో దాన్ని విలువ లేకుండా చేస్తున్నావని సత్యం క్లాస్ పీకుతాడు.
ఇక మనోజ్ ని భార్యను మోసం చేయడం కాదు భార్యకు నిజాలు చెప్పి తనకు ఓదార్పునివ్వడమే భర్త లక్షణం. ఇకమీదట మంచి జాబ్ చూసుకుని రోహిణి కి అబద్ధం చెప్పకుండా ఉండాలని మనోజ్ కి పెద్ద క్లాసే పీకుతాడు. ఇక రోహిణి పైకి వెళ్ళగానే మనోజ్ కూడా పైకెళ్ళి నన్ను క్షమించు రోహిణి అని అడుగుతాడు మొత్తానికి ఇద్దరు మధ్య కోపం తగ్గిపోయి మళ్లీ ప్రేమ మొదలవుతుంది. అటు బాలు మీనా ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు ప్రేమను కురిపిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో మనోజ్ జాబ్ కోసం వెతుకుతుంటే బాలు సెటైర్లు వేస్తాడు. బాలు పై రోహిణి కౌంటర్ లేస్తుంది. బాలునొక్క మాట అన్నా మీనా పడనివ్వకుండా అరుస్తుంది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..