BigTV English

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 850 కోట్ల మూవీ… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 850 కోట్ల మూవీ… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

OTT Movie : ఓటీటీలో ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దుమ్ము దులుపుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఏకంగా 850  కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

క్రిస్టియన్ వోల్ఫ్ అనే వ్యక్తి ఒక ఆటిస్టిక్ మ్యాథమెటికల్ జీనియస్. అతను సాధారణ అకౌంటెంట్‌గా కనిపిస్తూ, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ సంస్థలకు చెందిన నగదు లావాదేవీల సమస్యలను పరిష్కరిస్తుంటాడు. అతను లెక్కలలో అసాధారణమైన నైపుణ్యం కలిగి ఉంటాడు. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కూడా ఉంటుంది. సినిమా ప్రారంభంలో యు.ఎస్. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ (FinCEN) మాజీ డైరెక్టర్ రే కింగ్ ఒక ప్రమాదకరమైన అనైస్‌ అనే మహిళను కలుస్తాడు. అతను ఒక సాల్వడోరన్ కుటుంబాన్ని కనిపెట్టమని ఆమె సహాయం కోరుతాడు. కానీ ఆ సమయంలో ఒక గన్‌ఫైట్‌లో రే కింగ్ హత్యకు గురవుతాడు. అతని చేతిపై ‘ఫైండ్ ది అకౌంటెంట్’ అనే క్రిప్టిక్ సందేశం రాసి ఉంటుంది. ఈ హత్య రే కింగ్ శిష్యురాలిగా ఉన్న ప్రస్తుత FinCEN డైరెక్టర్ మేరీబెత్ మెడినాకి షాక్ ఇస్తుంది. ఆమె ఈ కేసును పరిష్కరించడానికి క్రిస్టియన్ వోల్ఫ్ సహాయం తీసుకుంటుంది.


క్రిస్టియన్ ఈ కేసును పరిష్కరించడానికి తన సోదరుడు బ్రాక్స్టన్ సహాయం తీసుకుంటాడు. అతను కూడా ఎన్నో నేరాలు చేసిన ఒక ప్రమాదకరమైన వ్యక్తి. క్రిస్టియన్, బ్రాక్స్టన్ సోదరుల మధ్య సంబంధం అంత సవ్యంగా ఉండదు. వాళ్ళు ఒకరినొకరు చాలా కాలంగా కలిసిందే లేదు. అయితే ఈ కేసులో సాల్వడోరన్ కుటుంబం లాస్ ఏంజిల్స్‌కు పారిపోయినట్లు క్రిస్టియన్ గుర్తిస్తాడు. క్రిస్టియన్, బ్రాక్స్టన్, మెడినా కలిసి ఈ కేసును పరిష్కరించే ప్రయత్నంలో, వీళ్ళు ఒక భయంకరమైన కుట్రను కనిపెడతారు. ఈ కుట్రలో హ్యూమన్ ట్రాఫికింగ్, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న ఒక భయంకరమైన మాఫియా ఉంటుంది. చివరికి ఈ ముగ్గురూ మాఫియాని ఎదుర్కుంటారా ? రే కింగ్ ను చంపింది ఎవరు ? అనైస్‌ పాత్ర ఇందులో ఎంత ? అనే విషయాలను తెలుసుకోవాల అనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిపించి ఆ పని చేసే ప్రియుడు… దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే ‘విష్ణు ప్రియ’

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది అకౌంటెంట్ 2’ (The Accountant 2). 2025 లో వచ్చిన ఈ సినిమాకి గావిన్ ఓ’కానర్ దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన ‘ది అకౌంటెంట్’ సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బెన్ అఫ్లెక్, జాన్ బెర్న్‌థాల్, సింథియా అడ్డాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×