Rohit Sharma : సాధారణంగా కొంత మంది భారతీయులు కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. మరికొంత మంది వెజ్, నాన్ వెజ్ రెండూ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు చాలా ఎక్కువగా ఉంటే..కేవలం వెజ్ తీసుకునే వారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. భారతదేశంలో వెజ్ ఫుడ్ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఇతర దేశాల్లో మాత్రం వెజ్ ఫుడ్ కంటే ఎక్కువగా నాన్ వెజ్ ఫుడే లభిస్తుంది. మరోవైపు వెజ్ ఫుడ్ కి చాలా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే.. భారతదేశంలో అన్ని రకాల కూరగాయలు పండుతాయి. ఇతర దేశాల్లో పండే పరిస్తితి ఉండదు. కొన్ని దేశాల్లో పండిస్తే.. మరికొన్ని దేశాల్లో కూరగాయలను దిగుమతి చేసుకుంటారు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ సమయంలో క్రికెటర్ పుజారా కి జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.
Also Read : Watch : ఏంట్రా గల్లీ క్రికెట్ లో Review సిస్టమా.. మామూలుగా లేదుగా
పుజారా భార్య రాసిన పుస్తకాన్ని తాజాగా రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా 2012లో వెస్టిండీస్ పర్యటనలో పుజారా కి జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశాడు. రాత్రి పూట వెజిటేరియన్ ఫుడ్ కోసం వెతుకుతున్న సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పుజారా దాడికి గురయ్యాడని.. దీంతో రాత్రి 9 గంటల తరువాత బయటికి వెళ్లకూడదని పూజారా కి సూచించామని చెప్పాడు రోహిత్ శర్మ. ఇక “ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్” పుస్తకంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇండియా ఏ తరపున వెస్టిండీస్ టూర్ కి వెళ్లినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ను రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. 2012లో ఇన్సిడెంట్ ఇప్పటికీ మాటలకు అందనివిధంగా ఉంటుందని.. ఆ ఇన్సిడెంట్ తరువాత వెస్టిండీస్ లో రాత్రి 9 గంటల తరువాత బయటికి వెళ్లలేదని పుజారా కూడా చెప్పుకొచ్చాడు. మరోవైపు పుజారా లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను పూజా ఈ బుక్ లో రాశారు. క్రికెట్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇలా చాలా సంఘటనలు.. అలాగే క్రికెటర్ వైఫ్ గా ఉంటే ఎలా ఉంటుందోనన్న విషయాలను కూడా చర్చించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా 2012లో వెస్టీండిస్ టూర్ కి వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తు చేసుకున్నారు.
“నాకు తెలిసి ఇది బుక్ లో రాసినట్టు లేరు. 2012 వెస్టిండిస్ టూర్ కి వెళ్లినప్పటి విషయాలు ఏమైనా పొందుపరిచారా..? ఏమైంది.. ఏంటి..? అనేది అని రోహిత్ శర్మ పుజారా ని అడిగాడు. “నేనేం చెప్పలేదు. నా అర్థం తనకు దాని పై అవగాహన ఉంది. తనకు ఆ వివరాలు పూర్తి తెలియదు” అంటూ పూజారా చెప్పుకొచ్చాడు. ఇక ఆ రోజును పూజారా ఇలా గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చాడు. ” నేను శాకాహారిని. అందువల్ల మేము రాత్రి పూట ఏమైనా వెజిటేరియన్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నాం. ఆ ప్లేస్ వెస్టిండిస్ లోని ట్రినిటాడ్ అండ్ టొబాగో, రాత్రి 11 గంటలు అయింది. మాకు ఎలాంటి భోజనం కనిపించలేదు. ఇక మేము వెనక్కి తిరిగి వస్తున్న క్రమంలో ఒక అటాక్ కి గురయ్యామని.. దాని గురించి పూర్తిగా అయితే చెప్పలేను” అని చెప్పుకొచ్చాడు పుజారా.