OTT Movie : చార్లెస్ హెల్లర్ ఒక CIA డీకోడర్ వర్జీనియాలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. లండన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అతని భార్య మరణిస్తుంది. ఈ దాడికి కారణమైన వారిని శిక్షించాలని CIAని కోరినప్పటికీ అధికారులు చర్య తీసుకోరు. దుఃఖం, కోపంతో ఉన్న చార్లెస్, తన నైపుణ్యాలను ఉపయోగించి, స్వయంగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. చార్లెస్ తన భార్య హంతకులను చేరుకోగలడా? ఈ కుట్ర వెనుక ఉన్న నిజమైన శత్రువు ఎవరు? ఈమూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలగురించి తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
చార్లెస్ హెల్లర్, ఒక సాధారణ CIA డీకోడర్, తన భార్య మరణం తర్వాత ప్రతీకార దారిలో అడుగుపెడతాడు. అతను CIA రహస్య సమాచారాన్ని బ్లాక్‌మెయిల్‌గా ఉపయోగించి, ఉగ్రవాదులను వెంబడించడానికి ఫీల్డ్ మిషన్‌కు వెళతాడు.ఈ మిషన్ అతన్ని ప్రమాదకరమైన కుట్రలోకి లాగుతుంది.అతను ఫీల్డ్ ఏజెంట్‌గా శిక్షణ లేనప్పటికీ, తన కోడింగ్ నైపుణ్యాలు, సంకల్పంతో ఉగ్రవాదులను వెంబడిస్తాడు. కథ లండన్, జర్మనీ, ఇతర యూరోపియన్ నగరాలలో జరుగుతుంది. ఇక్కడ చార్లెస్ డేంజరస్ హంతకులను దుర్కొంటాడు. ఈ స్టోరీ సర్వైలెన్స్ సామర్థ్యాలు, రహస్య ఆపరేషన్‌లు, డబుల్ క్రాస్‌లను చూపిస్తూ జేమ్స్ బాండ్ స్టైల్ థ్రిల్లర్‌లతో పోల్చబడింది.
చార్లెస్ ప్రయాణంలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే భార్యతో సన్నివేశాలు పరిమితంగా ఉన్నాయని, దీనివల్ల ఎమోషనల్ డెప్త్ కొంత తక్కువగా ఉందని కొందరు విమర్శించారు. ఇక యూరోపియన్ లొకేషన్‌లు అబ్బురపరుస్తాయి. చార్లెస్ భార్యను చంపిన ఉగ్రవాదులు ఎవరు?వారి వెనుక ఉన్న నిజమైన శక్తులు ఏమిటి? చార్లెస్‌ను ఆపడానికి CIA ఎందుకు ప్రయత్నిస్తోంది? వాళ్ళు దాచిన రహస్యం ఏమిటి? అనుభవం లేని చార్లెస్ ఈ ప్రమాదకరమైన మిషన్‌లో ఎలా బయటపడతాడు, వంటి విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అమ్మాయిని అడ్డుపెట్టుకుని డేంజర్ గేమ్ … బిలియనీర్ ని ఓ ఆట ఆడుకునే నైట్ మేనేజర్
ఈ అమెరికన్ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘The Amateur ‘ 2025 లో వచ్చిన ఈ సినిమాకి జేమ్స్ హావ్స్ దర్శకత్వం వహించారు. 1981 లో రాబర్ట్ లిటెల్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో రామి మాలెక్, రాచెల్ బ్రోస్నహాన్, కైట్రియోనా బాల్ఫే, లారెన్స్ ఫిష్‌బర్న్, హోల్ట్ మెక్‌కల్లానీ, జూలియన్ నికల్సన్, జాన్ బెర్న్‌థల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 20th సెంచరీ స్టూడియోస్ నిర్మాణంలో 2025 ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఒక CIA డీకోడర్ తన భార్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే కథను చూపిస్తుంది, ఇందులో సస్పెన్స్, ట్విస్ట్‌లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం 1 గంట 52 నిమిషాల నిడివితో, MDbలో 6.6/10 రేటింగ్ కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.