BigTV English

OTT Movie : అమ్మాయిని అడ్డుపెట్టుకుని డేంజర్ గేమ్ … బిలియనీర్ ని ఓ ఆట ఆడుకునే నైట్ మేనేజర్

OTT Movie : అమ్మాయిని అడ్డుపెట్టుకుని డేంజర్ గేమ్ … బిలియనీర్ ని ఓ ఆట ఆడుకునే నైట్ మేనేజర్

OTT Movie : జోనాథన్ పైన్ అనే ఒక మాజీ బ్రిటిష్ సైనికుడు, జూరిచ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో నైట్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. అతని జీవితం సాధారణంగా సాగుతుంటుంది. అయితే ఒక రోజు రాత్రి రిచర్డ్ రోపర్ అనే ధనవంతుడైన, ఆయుధాల వ్యాపారి ఈ హోటల్‌కు వస్తాడు. పైన్‌కు గతంలో రోపర్ చేసిన ఒక దారుణమైన ఘటన గురించి తెలిసి ఉంటుంది. అందులో పైన్ కూడా బాధితుడే. ఇప్పుడు రోపర్‌ సీక్రెట్స్  బయటపెట్టాలని అనుకుంటాడు. కానీ ఈ ప్రయాణంలో పైన్ ఒక సీక్రెట్ ఆపరేషన్‌లో చిక్కుకుంటాడు. ఇది అతన్ని ప్రమాదకరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక రోపర్‌ను పట్టుకోవడానికి పైన్ ఎలాంటి రిస్క్‌లు తీసుకుంటాడు? అతను ఈ ఆపరేషన్‌ నుంచి బయటపడగలడా ? ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ జోనాథన్ పైన్ (టామ్ హిడిల్‌స్టన్) అనే మాజీ బ్రిటిష్ సైనికుడు, జూరిచ్‌లోని హోటల్ మీస్టర్ ప్యాలెస్‌లో నైట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తితో మొదలవుతుంది. అతను ఆ హోటల్ లో ఒక రోజు రిచర్డ్ రోపర్ (హ్యూ లారీ)ను కలుస్తాడు. రోపర్ ఒక బిలియనీర్ అయిన ఆయుధాల వ్యాపారి. అతను డ్రగ్స్, ఆయుధాల అక్రమ వ్యాపారంలో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించాడు. పైన్‌కు రోపర్ గతంలో కైరోలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసు. ఇది అతని జీవితంలో ఒక వ్యక్తిగత గాయాన్ని మిగిల్చింది. ఈ గత సంఘటన కారణంగా, పైన్ రోపర్‌ను జైలుకి పంపాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రమంలో ఆంజెలా బర్ (ఒలివియా కోల్మన్) అనే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌తో కలిసి ఒక సెక్రెట్ ఆపరేషన్‌లో చేరతాడు.


ఈ ఆపరేషన్ కోడ్‌నేమ్ ‘లింపెట్’. రోపర్ అక్రమ వ్యాపారాలను నిర్మూలించడానికి రూపొందింది. ఇది ఒక కొలంబియన్ డ్రగ్ కార్టెల్‌తో జరుగుతుంది. మొదట పైన్ ఒక నకిలీ క్రిమినల్ గుర్తింపును సృష్టించి, రోపర్ వర్గంలో చేరిపోతాడు. ఆ తరువాత అతను రోపర్ సన్నిహితురాలైన జెడ్ (ఎలిజబెత్ డెబికీ) తో సంబంధం ఏర్పరుచుకుంటాడు. మరో వైపు రోపర్ సంస్థలో మేజర్ కార్కీ, ఇతర సభ్యులు పైన్‌ను అనుమానిస్తారు. ఇది అతని ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుంది. ఆంజెలా బర్ అమెరికన్ ఇంటెలిజెన్స్‌తో కలిసి, రోపర్ ఆయుధాల ఒప్పందాన్ని అడ్డుకోవడానికి పైన్‌ను గైడ్ చేస్తుంది. కానీ ఈ ఆపరేషన్‌లో అనేక రాజకీయ అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి రోపర్ అక్రమ వ్యాపారాలను పైన్ బయట పెడతాడా ? జెడ్‌తో అతని సంబంధం ఆపరేషన్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది? పైన్‌ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కుంటాడు ? అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సిరీస్‌ను చూడండి.

Read Also :  కంపెనీ యజమానితోనే డేటింగ్ కి ప్లాన్ … ఈ అమ్మాయి యాక్టింగ్ కి ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ బ్రిటిష్-అమెరికన్ ఎస్పియోనేజ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager). 2016 లో వచ్చిన ఈ సిరీస్ జాన్ లే కారే రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇది సుజాన్ బియర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సిరీస్‌లో టామ్ హిడిల్‌స్టన్ (జోనాథన్ పైన్), హ్యూ లారీ (రిచర్డ్ రోపర్), ఒలివియా కోల్మన్ (ఆంజెలా బర్), టామ్ హాలండర్ (కార్కీ), ఎలిజబెత్ డెబికీ (జెడ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 6 ఎపిసోడ్‌లతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×