OTT Movie : స్పెయిన్‌లో ఒక చిన్న పట్టణంలో,హోలీ వీక్ సమయంలో, ఒక వింత ఆత్మహత్య జరుగుతుంది. ఒక వ్యక్తి తన కడుపును కోసుకుని, రిచ్వలిస్టిక్ పద్ధతిలో మరణిస్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పానిష్ సివిల్ గార్డ్ సార్జెంట్ లూసియా గుటిరెజ్ బాధ్యత తీసుకుంటుంది. అదే సమయంలో, సమీపంలోని మోరోన్ ఎయిర్ బేస్‌లో జాన్సన్ అనే ఒక అమెరికన్ సైనికుడు అదృశ్యమవుతాడు. ఈ కేసును విచారించడానికి యు.ఎస్. ఆర్మీ స్పెషల్ ఏజెంట్ మగలీ కాస్టుల్లో, సార్జెంట్ ఆండ్రూ టేలర్ నియమించబడతారు. ఈ రెండు కేసులు ఊహించని విధంగా ఒక దానితో ఒకటి ముడిపడతాయి. ఈ రహస్యాల వెనుక ఉన్న నిజం ఏమిటి? సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ స్పెయిన్‌లోని ఒక హోలీ వీక్ సమయంలో జరుగుతుంది. లూసియా గుటిరెజ్ అనే స్పానిష్ సివిల్ గార్డ్ సార్జెంట్ ఒక ఆత్మహత్య కేసును విచారిస్తుంది. ఇది ఊరేగింపుల సమయంలో జరిగిన రిచ్వలిస్టిక్ సంఘటనలతో ముడిపడి ఉంటుంది. అదే సమయంలో మగలీ, కాస్టిల్లో, మోరోన్ ఎయిర్ బేస్‌లో అదృశ్యమైన సైనికుడు జాన్సన్ గురించి విచారిస్తారు. ఈ రెండు కేసులు స్థానిక మతపరమైన ఆచారాలతో ముడిపడి ఉంటాయి. సిరీస్ హోలీ వీక్ రోజును మొదలుపెట్టి , గుడ్ ఫ్రైడే వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఈ సిరీస్‌లో కంటికి కనిపించని అతీంద్రియ శక్తులు ఉంటాయి. హాలూసినేషన్స్, రక్తసిక్త దర్శనాలు కనిపిస్తాయి. ఇవి కథకు మిస్టికల్ లేయర్‌ను జోడిస్తాయి. ఇద్దరు స్త్రీలు పురుషాధిపత్య ప్రపంచంలో నావిగేట్ చేయడం, కథకు హ్యూమన్ స్టేక్స్‌ను అందిస్తుంది. ఆండలూసియా అందం, మారిబెల్ వెర్డూ నటన, లూసియా, మారియెలా గరిగా డిటర్మిన్డ్, మగలీ పాత్ర సిరీస్‌కు బలాన్ని జోడిస్తాయి. చివరికి హోలీ వీక్ ఊరేగింపులలో అతీంద్రియ శక్తులు నిజంగానే ఉంటాయా ? అదృశ్యమైన అమెరికన్ సైనికుడు జాన్సన్ ఎక్కడ ఉన్నాడు ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : పాటల ప్రపంచంలో రారాజుగా ఓ అనాథ … ప్రియురాలితో స్టేజ్ షో లు … దుమ్ముదులుపుతున్న పంజాబీ మూవీ
ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘వెన్ నో వన్ సీస్ అస్'(When No One Sees Us). 2025 లో వచ్చిన ఈ సిరీస్ ను డానియల్ కార్పాస్ రూపొందించారు. దీని అసలు పేరు Cuando nadie nos ve. ఇది సెర్గియో సరియా రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో మారిబెల్ వెర్డూ, మారియెలా గరిగా, ఆస్టిన్ అమెలియో, బెన్ టెంపుల్, మరియు డాని రోవిరా ప్రధాన పాత్రలలో నటించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో ఇది స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో 7.2/10 రేటింగ్‌ను కలిగి ఉంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.