OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఈ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక బొమ్మకు ప్రాణం వస్తుంది. అక్కడ జరిగే సన్నివేశాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ సైకలాజికల్ హారర్ మూవీ పేరు’ది బాయ్’ (The Boy). దీనిని విలియం బ్రెంట్ బెల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో లారెన్ కోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఒక అమెరికన్ మహిళ, ఇంగ్లాండ్‌లో ఒక విచిత్రమైన జంట కోసం నానీగా పనిచేస్తుంది. వారు తమ కొడుకుగా ఒక జీవం లేని పొడవైన బొమ్మను చూసుకుంటారు. ఈ స్టోరీ ఆ బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో లారెన్ కోహన్, రూపర్ట్ ఎవాన్స్ నటించారు. STXfilms 2016 లో ‘ది బాయ్’ మూవీని విడుదల చేసింది. ఈ మూవీ $10 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా $64 మిలియన్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్ ‘ది బాయ్ II’ 2021 లో విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
గ్రెటా ఎవాన్స్ అనే యువతి, తన గతంలోని బాధాకరమైన సంఘటనల నుండి తప్పించుకోవడానికి, ఇంగ్లాండ్‌లోని ఒక గ్రామంలో హీల్ షైర్ దంపతులకు నానీగా ఉద్యోగం చేయడానికి వెళ్తుంది. ఆమె ఉద్యోగం ఏమిటంటే, వారి కొడుకు బ్రహ్మ్స్‌ను చూసుకోవడం. కానీ అక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, బ్రహ్మ్స్ అనేది నిజమైన బాలుడు కాదు, ఒక పోర్సలైన్ డాల్. హీల్‌షైర్ దంపతులు ఈ బొమ్మను తమ కొడుకుగా భావిస్తారు.ఎందుకంటే వారి నిజమైన కొడుకు బ్రహ్మ్స్ ఒక అగ్నిప్రమాదంలో చనిపోతాడు. అప్పటినుంచి ఆ బొమ్మను వాళ్ళు కొడుకు లాగా చూసుకుంటారు. హీల్‌షైర్ దంపతులు గ్రెటాకు బొమ్మను చూసుకోవడానికి కఠినమైన నియమాల జాబితాను ఇస్తారు. ఆ తర్వాత వారు వెకేషన్‌కు వెళ్లిపోతారు. గ్రెటా మొదట్లో ఈ నియమాలను పట్టించుకోదు. బొమ్మను నిర్లక్ష్యం చేస్తుంది. అప్పుడే కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. బొమ్మ స్థానం మారినట్లు కనిపిస్తుంది, ఇంట్లో శబ్దాలు వినిపిస్తాయి. గ్రెటాకు ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తుంది.
స్థానికంగా ఉండే మాల్కం అనే వ్యక్తి సహాయంతో, బ్రహ్మ్స్ గురించి లోతుగా తెలుసుకోవడం ప్రారంభిస్తుంది గ్రెటా. ఆమెకు తెలిసిన విషయం ఏమిటంటే, నిజమైన బ్రహ్మ్స్ చనిపోయినప్పటికీ, అతని ఆత్మ బొమ్మలో ఉందని హీల్‌షైర్ దంపతులు నమ్ముతారు. కానీ చివరలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెల్లడవుతుంది. నిజమైన బ్రహ్మ్స్ చనిపోలేదు, అతను ఇంటి గోడల్లో దాక్కుని జీవిస్తూ ఉంటాడు. అతను వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మారి, గ్రెటాపై ఒక విచిత్రమైన అనుబంధాన్ని పెంచుకుంటాడు. గ్రెటా తన మాజీ ప్రియుడి నుండి తప్పించుకోవడానికి, బ్రహ్మ్స్‌తో పోరాడటానికి ధైర్యం చేస్తుంది. చివరికి ఆ బొమ్మ వల్ల గ్రెటా పడ్డ ఇబ్బందులు ఏమిటి? బ్రహ్మ్స్ గోడల్లో దాగి ఉండటానికి కారణం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడండి.