Gundeninda GudiGantalu Today episode march 24 th : శనివారం ఎపిసోడ్ లో.. శృతి వీడియోను అడ్డుపెట్టుకొని చంద్రకాంతని దగ్గరుండి ఫంక్షన్ చేసేలా చేస్తుంది. అటు నీలకంఠం సంజయ్ సడన్ గా అక్కకి ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. చంద్రకాంతం ప్రవర్తన చూసి సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తప్పక ఆమె చెప్పినట్టు విని అక్కడినుంచి మెల్లగా జారుకుంటాడు. పదండి త్వరగా వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా మౌనికను ఏడిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు అని అంటే దానికి చంద్రకాంతం అయ్యో అలా ఎందుకు అవుతుంది నేను ఉంటాను కదా దగ్గరుండి చూసుకుంటానని అంటుంది. ప్రభావతి ఫ్యామిలీ మాత్రం ఈమెలో ఇంత మార్పు ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చినప్పటి నుంచి గయ్యాలి లాగా అలా అరుస్తూ ఉన్నది ఇప్పుడు ఏమైందో తెలియలేదే ఇంత సైలెంట్ గా ఇంత బుద్ధిగా మారిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. మౌనిక నువ్వు దగ్గరుండి అందరూ సాగనంపుతారు. ప్రభావతి మీనాకు క్లాస్ పీకుతుంటే శృతి వచ్చి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గోల్డ్ చైన్ కనిపించకుండా పోవడానికి మీనాన్నే కారణమని ప్రభావతి మీనా ను తిడుతుంది. ఇప్పుడే బాలు లోపలికి వచ్చి ఏమైంది ఎందుకు తిడుతున్నావ్ ఏం చేసింది నా భార్య అంతగా అనేసి అడుగుతాడు. ఆ బంగారు చైను నా చేతికివ్వమని చెప్పాను కానీ ఈవిడ ఇవ్వకుండా ఈవిడ భర్త అన్ని చేస్తున్నారన్నట్టుగా గొప్పగా చెప్పుకోవాలని ఆ చైన్ ఆమె దగ్గర పెట్టుకొని పోగొట్టేసింది మొత్తానికి అది దొరికింది కాబట్టి సరిపోయింది లేకున్నా అంటే మన పరువు ఏం కావాలి అని మీన పై అరుస్తుంది. వెంటనే శ్రుతి ఎందుకంటే మీరు ఊరికే మీనా అని అర్థం చేసుకోకుండా అరుస్తారు అని ఆడుతుంది.. ఇదంతా చేసింది మీనా కాదు ఆ చంద్రకాంతం నేను కాసేపు బయటకు వెళ్లి వచ్చేలోగా ఇదంతా జరిగింది మీనా అని అందరూ తిట్టేశారు బయట నేను ఒక వీడియో తీస్తున్నప్పుడు ఆమెడా కార్లో పెట్టడం నేను చూశాను అందుకే లోపలికి వచ్చి చైన్ తెచ్చాను అంటుంది.
ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆమె ఇదంతా చేసి ఇన్ని మాటలు నిండా అని నోరెళ్ల పెట్టేస్తారు. ఇక మీనా శృతికి థాంక్స్ చెప్తుంది. నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడే వ శృతి చాలా థాంక్స్ అనేసి అంటుంది అలాగే రోహిణి కూడా నన్ను సపోర్ట్ చేసి మాట్లాడావు అని థాంక్స్ చెప్తుంది.
రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత సత్యం కు సుశీల ఫోన్ చేస్తుంది. యోగక్షేమాలన్నీ అడిగిన తర్వాత ఉగాదికి అక్కడ రమ్మని పిలుస్తుంది.. ఉగాదికి అంటే అందరూ అంటే కష్టం అమ్మ అని సత్యం అంటాడు. నువ్వైతే కరెక్ట్ గా చెప్పావు గాని బాలుకి ఫోన్ ఇవ్వు అని అంటుంది. బాలుతో ఉగాదికి రమ్మని పిలుస్తుంది. నేను ఒంటరిగా ఉన్నాను రా నాకు ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూనే ఉంటుంది మీరందరూ వస్తే నాకు సంతోషంగా ఉంటుందని సుశీల అంటుంది. షీలా డార్లింగ్ పండగకు అందరిని కట్టకట్టుకుని అక్కడికు తీసుకురమ్మంటుంది అని బాలు అంటాడు. అందరం వెళ్దాం, సరదాగా ఉంటుందని అనుకుంటారు. ఏమంటారు అని సత్యం అడుగుతాడు. నాకు వీలు కాదు నాన్న అని మనోజ్ చెబుతాడు. అవును, పార్క్ బోసి పోతుంది అని బాలు కౌంటర్ వేస్తాడు..
ఆ మాట అనగానే రోహిణి బాలు పై అరుస్తుంది. ఏది జరిగిన అదే ఎందుకు తీసుకొస్తావని అంటుంది.మీ నాన్నకు చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించకపోయావా అని బాలు అంటాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఆయన బిజినెస్‌లన్నీ వీడికే అప్పజెబుతారు అని ప్రభావతి గొప్పగా అంటుంది. ముందు వాళ్ల పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరు అయినా మన ఇంటికి వచ్చి మొహం చూపించమను. అప్పుడు చూద్దాం అని బాలు ఛాలెంజ్ చేస్తాడు..
రోహిణి బాధపడుతుంటే ప్రభావతి వెళ్తుంది. ఎంత పొగరుగా మాట్లాడాడో చూశారుగా, మనోజ్‌ను ఎప్పుడు అవమానిస్తూనే ఉంటాడు అని రోహిణి బాధగా చెప్పుకుంటుంది. అలాంటి వాళ్ల పొగరు దించాలంటే ఒక్కటే మార్గం. మీ నాన్నను ఇక్కడికి పిలిపించడమే అని ప్రభావతి అంటుంది. లేని నాన్నని ఎక్కడి నుంచి పిలిపించాలి. దీనికి పరిష్కారం చూడకపోతే నేను ఇరుక్కుంటాను అని రోహిణి అంటుంది.. మొత్తానికి రోహిణి మెడకు చుట్టుకుంటుంది. రోహిణి వెంటనే విద్య దగ్గరికి వెళ్తుంది. ఈ గండం నుంచి గట్టిగా అంటే నాకు ఒక సలహా కావాలని అడుగుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుతో తన మామ అని నాటకం మొదలుపెట్టబోతుంది రోహిణి అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది . రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..