BigTV English
Advertisement

OTT Movie : ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్న ముద్దుగుమ్మ … పెళ్లి ఒకరితో, శోభనం మరొకరితో

OTT Movie : ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్న ముద్దుగుమ్మ … పెళ్లి ఒకరితో, శోభనం మరొకరితో

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. వీటిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటువంటి స్టోరీలు ప్రేక్షకుల్ని కూడా బాగా అలరిస్తాయి. ఇటువంటి సినిమాలలో క్లైమాక్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే సినిమాలో కూడా క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ స్టోరీని చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు. ఎమోషన్స్ తో ఈ స్టోరీ ముందుకు సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో 

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ది బ్రైడ్’ (The Bride). 2015 లో వచ్చిన ఈ మూవీకి పౌలా ఒర్టిజ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇన్మా క్యూస్టా, అలెక్స్ గార్సియా, అసియర్ ఎట్క్సియాండియా నటించారు. ఫెడెరికో గార్సియా లోర్కా రచించిన 1933 ట్రాజెడీ ‘బ్లడ్ వెడ్డింగ్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  89వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా పోటీ పడింది. ఈ మూవీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడంతో, అసలు స్టోరీ మొదలవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే …

జోనా ఒక అందమైన అమ్మాయి. చిన్నప్పటి నుంచి జోనాతో నోవియో, లియోనార్డో మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. లియోనార్డో జోనాను చిన్నప్పటినుంచి ఇష్టపడుతుంటాడు.  అయితే కొన్ని కారణాలవల్ల లియోనార్డో ఫ్యామిలీకి, మిగతా ఫ్యామిలీలకు కొన్ని గొడవలు జరుగుతాయి. ఆ గొడవల్లో కొంతమంది చనిపోవడం జరుగుతుంది. అప్పటినుంచి లియోనార్డో వీళ్ళకు దూరంగానే ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నోవియోకి, జోనాకి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకుంటారు. మరోవైపు లియోనార్డో కి పెళ్లి కూడా జరిగిపోయి ఉంటుంది. అతనికి ఒక కూతురు కూడా ఉంటుంది. అయినా కూడా జోనా మీద మనసు చంపుకోలేక, ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరి పెళ్లి విషయం తెలుసుకుని చాలా బాధపడతాడు. లియోనార్డో తనని ఇంకా ప్రేమిస్తున్నాడని జొనా కూడా గ్రహిస్తుంది.

మరోవైపు నోవియోతో పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతుంటాయి. వీళ్లిద్దరికి పెళ్లి జరుగుతుంది అనుకుంటూ ఉండగానే, జోన అందరికీ షాక్ ఇస్తుంది. ఒకవైపు పెళ్లి జరుగుతుండగా, మరోవైపులియోనార్డోతో జోనా లేచిపోతుంది. ఇది రెండు కుటుంబాల మధ్య మళ్లీ పగను రగులుస్తుంది. నోవియో కూడా చాలా కోపంతో వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలని వెంబడిస్తాడు. చివరికి వీళ్ళిద్దరిని ఒకచోట, చూడకూడని పరిస్థితుల్లో చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకచోట ఏకాంతంగా గడుపుతుంటారు. ఇది చూసిన నోవియో రక్తం మరిగిపోతుంది. చివరకు నోవియో వాళ్ళిద్దరనీ శిక్షిస్తాడా ? జోన తన తప్పు తెలుసుకుంటుందా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ

OTT Movie : అబ్బాయిలతో పని కానిచ్చి చంపే లేడీ సైకో… ఏకంగా 8 మంది హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

Big Stories

×