Allu Arjun-Ram Charan: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే సందర్భంగా.. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు బర్త్ డే విష్ చేశాడు. మై డియర్ బ్రదర్.. హ్యాపీ బర్త్ డే అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా.. మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే చరణ్ అంటూ పోస్ట్ చేశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కొడుకు రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా ఆర్సీ 16 ప్రాజెక్ట్‌కి పెద్ది అనే టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌పై మెగాస్టార్ స్పందిస్తూ.. ‘పెద్ది ఫస్ట్ లుక్ చూస్తుంటే చాలా శక్తివంతంగా కనిపిస్తోంది. ఈ చిత్రం నీలోని నటుడిని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నమ్ముతున్నాను. దీన్ని అద్భుతంగా తీసుకురా..’ అంటూ చిరు రాసుకొచ్చారు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) చరణ్‌కు బర్త్ డే విష్ చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో మెగా ఫ్యామిలీ స్పందన
అసలు అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్నప్పటి నుంచే.. అల్లు మెగా వార్ మొదలైంది. అప్పటి వరకు ఒకే మెగా గొడుగు కింద ఉన్న అభిమానులు అప్పటి నుంచి అల్లు, మెగాగా విడిపోయారు. ఇక జనసేనకు కాకుండా.. వైసీపికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ప్రచారం చేయడంతో.. మెగా వార్ పీక్స్‌కు చేరుకుంది. నాగబాబు చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్‌లో మరింత అగ్గి రాజేసింది. ఇక 2024 డిసెంబర్‌లో, పుష్ప సినిమా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ సమయంలో, మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి మరియు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో, రామ్ చరణ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇది అభిమానుల అల్లు, మెగాభిమానుల మధ్య మరింత దూరాన్ని పెంచింది. ఇదే సమయంలో, “గేమ్ ఛేంజర్” సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో అల్లు అరవింద్ సెటైర్లు వేయడం మెగా అభిమానులను మరింత బాధించింది. దీనివల్ల రెండు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత స్పష్టమైంది. ఇక ఇప్పుడు మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ, అల్లు అర్జున్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
మెగా దోస్తీ కట్ అయినట్టే!
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నా.. రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరు ఎవడు అనే సినిమాలో కలిసి నటించారు. కానీ పవన్‌కు కాకుండా వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం, నాగ బాబు ట్వీట్ దుమారం లేపడం, పుష్ప సినిమా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా హీరోల్లో చిరంజీవి మాత్రమే స్పందించడం.. రామ్ చరణ్ స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. తాజాగా రామ్ చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ విష్ చేయలేదు. చిరు, ఎన్టీఆర్, మహేష్ బాబు విష్ చేశారు. కానీ బన్నీ చేయలేదు. దీంతో మరోసారి మెగా విభేధాలు బయట పడ్డాయనే చెప్పాలి.