ప్రతీకార హత్యలు చాలా సినిమాల్లో కనిపిస్తాయి. తమ కుటుంబ సభ్యుల చావుకు కారణం అయిన వాళ్లను చంపే కథాంశాలతో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చాలా అంటే చాలా డిఫరెంట్. 2023లో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ ఇదీ ఒకటి. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ప్రతీకార హత్యలకు కారణం ఏంటి? వెంటాడి వేటాడే మాస్క్ కిల్లర్ ఎవరు? అనే ఆసక్తికర విషయాల ఇప్పుడు తెలుసుకుందాం..
ది కాన్ఫరెన్స్(2023)
2023లో నేరుగా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన స్వీడిష్ చిత్రం ‘ది కాన్ఫరెన్స్’. పాట్రిక్ ఎక్లండ్ దర్శకత్వంలో ఈ హారర్ సినిమా తెరకెక్కింది. కటియా వింటర్ , ఆడమ్ లుండ్‌గ్రెన్, ఎవా మెలాండర్, బహార్ పార్స్, అమెద్ బోజన్, మారియా సిడ్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ ఏంటంటే?
సినిమా ప్రారంభం కాగానే లోకల్ కంపెనీకి చెందిన ఎంపాయీస్ అంతా ఒకచోట కలుస్తారు. ఒక పెద్ద షాపింగ్ మాల్ ను కట్టడానికి వాళ్లంతా కోలరంగిన్ అనే ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాజెక్టును ఇంగ్లా, జోనస్ లీడ్ చేస్తుంటారు. ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంతో ఉత్సాహంతో ఉంటారు. మిగిలిన ఎంప్లాయీస్ కు పెద్దగా ఇష్టం ఉండదు. తర్వాత వాళ్లంతా మాల్ ను కట్టే ప్లేస్ కు వెళ్లి పరిశీలిస్తారు. అక్కడి నుంచి టౌన్ కు కొద్ది దూరంలో ఉన్న ఒక రిసార్ట్ కు వెళ్తారు. ఆ రిసార్టు వాళ్లు వారిని ప్రేమగా ఆహ్వానిస్తారు.
షాపింగ్ మాల్ వద్దంటూ స్థానికుల నిరసనలు
తమ ప్రాంతంలో షాపింగ్ మాల్ కట్టడం స్థానికులకు ఇష్టం ఉండదు. ఆ మాల్ కోసం చాలా మంది రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. మాల్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తారు. అయినా, ఇంగ్లా, జోనస్ ఈ మాల్ ను కట్టాలని భావిస్తారు. వాళ్లు అక్కడికి రావడం స్థానికులకు ఇష్టం లేదని తెలిసినా, రిసార్టు వాళ్లు డబ్బు కోసం వారిని ఆహ్వానిస్తారు. అందరూ ఆ రిసార్టులో బస చేస్తారు. అదే సమయంలో అందరూ కలిసి తమ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తుంటారు. ఇంగ్లా, జోనస్ మార్కెటింగ్ ఐడియాస్ తో కంపెనీకి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విషయంపై చర్చ జరిగే సమయంలో వారి మధ్య గొడవలు వస్తాయి. నిజానికి ఆ కంపెనీ ఉద్యోగుల మధ్య మంచి సంబంధాలు ఉండవు.
చెఫ్ హత్యతో మారణహోమం ప్రారంభం
అటు రిసార్ట్ కు వచ్చిన వాళ్ల కోసం చెఫ్ వంట చేస్తుంటే గ్యాస్ అయిపోతుంది. కొత్త గ్యాస్ సిలిండర్ తెచ్చేందుకు వెళ్తుంటే, అతడి కారు టైర్ పంక్చర్ అవుతుంది. ఏమైందో చూద్దామని కారు దిగి వెళ్తాడు. ఎవరో కావాలనే అలా చేసినట్లు అర్థం అవుతుంది. అక్కడ ఉన్న అడవిలో ఎవరో కావాలనే డెత్ ట్రాప్స్ ఏర్పాటు చేసినట్లు తెలుసుకుంటాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెఫ్ తల మీద కొట్టి చంపేస్తాడు.
అటు రిసార్టులో మాల్ ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు అందరూ మీట్ అవుతారు. వాళ్లలో ఉండే లీనా ప్రాజెక్టు కాంట్రాక్టును చదువుతుంది. అందులో బడ్జెట్ గురించి రాయరు. దాన్ని చూసి ఆమె షాక్ అవుతుంది. రైతుల నుంచి తీసుకున్న ల్యాండ్ లో షాపింగ్ మాల్ కడుతున్నారు. వారికి డబ్బులు ఇవ్వకుండా ఆ స్థలం ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తుంది. అదే సమయంలో ఈ మాల్ విషయంలో ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగడం లేదని జోనస్ లీనాతో చెప్తాడు. మాల్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఒప్పుకునే సంతకం చేశారని.. వాళ్లకు డబ్బుకూడా ఇచ్చామంటాడు. ఈ ప్రాజెక్టులో ఏ తప్పూ లేదంటాడు.
రిసార్ట్ లోకి మాస్క్ మ్యాన్ ఎంట్రీ
అటు చెఫ్ ను చంపిన మాస్క్ మ్యాన్ రిసార్ట్ లోకి ఎంటర్ అవుతాడు. రిసార్ట్ సెక్యూరిటీ గార్డును చంపేస్తాడు. అదే సమయంలో కంపెనీ మరో ఎంప్లాయీ అయిన అమేర్.. లీనాతో ఓ షాకింగ్ విషయాన్ని చెప్తాడు. “మనం షాపింగ్ మాల్ కట్టే స్థలం పాల్సన్ అనే రైతుది. అతడి నుంచి ఈ ల్యాండ్ ను బలవంతంగా లాక్కున్నారు. ఆ బాధతో తను ఉరేసుకుని చనిపోయాడు” అని చెప్తాడు. లీనా షాక్ అవుతుంది. మరోవైపు కిల్లర్ ఓ మాస్క్ ను ధరించి రిసార్ట్ లో ఉన్న జెన్సీని కిరాతకంగా హత్య చేసి హాల్లో వేలాడదీస్తాడు.
Also Read: హోటల్‌లో అమ్మాయి – పిల్లాడిని ముక్కలు చేసి.. ఈ సీరిస్ చూశాక, గెస్టులు ఘోస్టుల్లా కనిపిస్తారు
జోనస్ ల్యాప్ టాప్ ఓపెన్ చేసి షాకైన లీనా
తన తోటి ఎంప్లాయీస్ ట్రెక్కింగ్ చేస్తుండగా, లీనా రిసార్టుకు వచ్చి జోనాస్ ల్యాప్ టాప్ ఓపెన్ చేస్తుంది. ఆ ల్యాప్ టాప్ షాపింగ్ మాల్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఈ మాల్ కట్టినా సక్సెస్ కాదు. ఈ మాల్ ద్వారా వాళ్ల కంపెనీ పూర్తిగా దివాళా తీస్తుంది. ఈ విషయం వాళ్ల టీమ్ లోని జోనస్, ఇంగ్లాకు తెలుసు. లాస్ వస్తుందని తెలిసినా వాళ్లు ఆ మాల్ ను ఎందుకు కడుతున్నారంటే.. బ్లాక్ మ్యాన్ క్రూ అనే కంపెనీతో జోనాస్ ఓ డీల్ చేసుకుంటాడు. వాళ్లు ఇప్పుడున్న కంపెనీ దివాళా తీసేలా చేస్తారు. ఆ తర్వాత బ్లాక్ మ్యాన్ క్రూ కంపెనీలో జాయిన్ కావాలనుకుంటారు. ఈ విషయం తెలిసి లీనా షాక్ అవుతుంది. మరోవైపు మిగతా ఎంప్లాయీస్ రెక్కింగ్ కంప్లీట్ చేసి రిసార్టుకు వస్తారు.
హత్యలకు కారణం ఎవరంటే?
అదే సమయంలో రిసార్ట్ లోని ఒక్కొక్క ఎంప్లాయీని కిల్లర్ దారుణంగా చంపేస్తాడు. అప్పటికే చాలా మందిని దారుణంగా చంపేస్తాడు. మాల్ ను లీడ్ చేసే జోనాస్, ఇంగ్లాను కూడా హత్య చేస్తాడు. అదే సమయంలో టీమ్ లోని నాడియా బలమైన ఆయుధంతో తలను నరికేస్తుంది. చివరకు ఈమా,లీనా, నాడియా, టోర్పియన్ అనే నలుగురు మాత్రమే మిగులుతారు. అప్పుడే టోర్పియన్ కు ఓ న్యూస్ పేపర్ కనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు పాల్సన్ కు ఓ కొడుకు ఉన్నాడు. తన తండ్రి చావుకు కారణమైన వారిని చంపే వ్యక్తి మరెవరో కాదు పాల్సన్ కొడుకే. ఆ కంపెనీ కారణంగా తన తండ్రి చనిపోవడంతో పాటు భూమిని కూడా కోల్పోయాననే కోపంతో ఆ కంపెనీ వాళ్లను వేటాడి, వెంటాడి చంపేస్తాడు. ఈ కుట్రతో సంబంధం లేని నలుగురు మినహా మిగతావాళ్లు అంతా చనిపోతారు. చివరకు కిల్లర్ కూడా చనిపోవడంతో సినిమా అయిపోతుంది.