BigTV English

Coolie Leaked : రజినీ మూవీ నుంచి యాక్షన్ ఎపిసోడ్ లీక్… నాగ్ క్లాసిక్ ఫైట్ ఏం ఉంది మామా….

Coolie Leaked : రజినీ మూవీ నుంచి యాక్షన్ ఎపిసోడ్ లీక్… నాగ్ క్లాసిక్ ఫైట్ ఏం ఉంది మామా….

Coolie Leaked : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. చిత్రం బృందం ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు ఆయన లుక్ కు సంబంధించిన పిక్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేసింది. కానీ తాజాగా ఈ సినిమాలో నాగార్జున యాక్షన్స్ సీన్స్ కు సంబంధించిన పిక్స్ తో పాటు లీకైన వీడియో మేకర్స్ లు షాకింగ్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగార్జున యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన లీక్డ్ పిక్ తెగ వైరల్ అవుతుంది.


రజినీ మూవీ నుంచి యాక్షన్ ఎపిసోడ్ లీక్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్  మ్యూజిక్ అందిస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇక కూలి మూవీ లో ఉపేంద్ర, శృతి హాసన్, షౌబిన్ షాహిర్ తో పాటు నాగార్జున కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే నాగర్జున ఈ సినిమాలో సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు అని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా కోసం ఏకంగా నాగ్ 40 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అనే రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, తాజాగా షూటింగ్ సెట్లో నాగార్జున ఫైట్ చేస్తున్న యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియోను ఎవరో ఇంటర్నెట్లో లీక్ చేసి మేకర్స్ కి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది.  లీకైన వీడియోలో నాగార్జున వైట్ సూట్ వేసుకుని సూపర్ యాంగ్రీగా కనిపిస్తున్నారు. దీంతో లోకేష్ సంభవం లోడింగ్, నాగ్ క్లాసిక్ ఫైట్ ఏం ఉంది మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Nagarjuna Akkineni's brutal action scene from 'Coolie' leaked online |  Tamil Movie News - Times of India

కన్ఫ్యూజన్లో నాగార్జున ఫ్యాన్స్…

అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న సీన్లు కూలీ మూవీకి సంబంధించినవి అని కొందరు ఉంటుంటే, కాదు కాదు నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న మరో మూవీ కుబేరుడు సినిమాలోని సన్నివేశాలు అని మరికొందరు అంటున్నారు. కుబేరుడు మూవీ తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా రూపొందుతోంది. ఈ వీడియోలో నాగార్జున తమిళంలో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే నాగ్ వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తుంటే అది ఖచ్చితంగా కూలీ మూవీదే అని అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా మొత్తానికి ఈ లీకైన వీడియో మేకర్స్ ను షాక్ కు గురి చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ కూలీ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుండగా, భారీ వర్షాల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అంతేకాకుండా కూలీ షూటింగ్లో చిన్నపాటి ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ఎవరూ ప్రమాదంలో గాయపడలేదని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో నాగార్జున యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ వీడియో వైరల్ అవుతోంది.

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×