OTT Movie : కొంతమంది చేసే వికృత చేష్టలు ఒక్కోసారి చేయి దాటిపోతుంటాయి. మనుషుల మధ్య ఉంటూ ఈ సైకోలు చేసే పనులు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ప్రమాదవశాత్తు చనిపోయిన హీరోయిన్ పై, ముగ్గురు వ్యక్తులు హాస్పిటల్ లోనే గలీజ్ పని చేస్తుంటారు. ఎవ్వరికీ తెలీకుండా ఈ పని చేస్తుంటారు ఈ సైకోలు. హీరోయిన్ పై అలా చేస్తునప్పుడు ఒక్కసారిగా, స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ స్పానిష్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్’ (The Corps of Anna Fritz). 2015లో రిలీజ్ అయిన ఈ మూవీకి హెక్టర్ హెర్నాడెజ్ దర్శకత్వం వహించారు. ఒక ప్రసిద్ధమైన నటి అయినా అన్నాఫ్రిట్జ్ మరణం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. చాలా సున్నితమైన అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్ తో ఈ థ్రిల్లర్ మూవీ పిచ్చెక్కిస్తుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అన్నా ఫ్రిట్జ్ ఒక అందమైన సినిమా నటి. ఆమె ఒక ప్రమాదంలో చనిపోతుంది. ఆమె శవాన్ని ఆసుపత్రిలో మార్చురీకి తరలిస్తారు. అక్కడ పనిచేసే పౌ అనే వ్యక్తి ఆమె ఫోటోను తీసి తన ఫ్రెండ్స్ కి పంపిస్తాడు. అతని ఇద్దరు స్నేహితులు ఆమె అందాన్ని చూడాలని, మద్యం సేవించి మరీ అక్కడికి వస్తారు. అంతటితో ఆగకుండా, ఆ శవంతో రొమాన్స్ చేయాలనుకుంటారు. ఆమెపై ఆ పని చేస్తూ ఉండగా, మధ్యలోనే ఆ నటికి మెలకువ వస్తుంది. అయితే ఆమె కదలలేని స్థితిలోనే ఉంటుంది. ఆమె బ్రతకడం చూసి ఆ ముగ్గురికి మతి పోతుంది. ఇప్పుడు వాళ్లకు రెండే దారులు కనపడతాయి. ఆమె బ్రతికే ఉందని చెప్పి, తాము చేసిన నేరానికి లొంగిపోవడం. లేకపోతే ఆమెను చంపి వాళ్ళు చేసిన నేరాన్ని దాచిపెట్టడం. ఈ రెండింటిలో వీళ్లు రెండవ దానిపైనే మక్కువ చూపుతారు.
ఆ తర్వాత వీళ్ళు ముగ్గురూ ఆమెను చంపాలనుకుంటారు. ఆమె నన్ను చంపకండి అని చాలా బతిమాలుతుంది. అయితే అందులో ఒక వ్యక్తి ఆమెను చంపడానికి మొదట నిరాకరిస్తాడు. ఆమె కూడా అతనిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. చివరికి తెలివిగా వాళ్లలో వాళ్లే కొట్టుకునే స్థితికి తీసుకువస్తుంది. ఎలాగైనా అక్కడినుంచి తప్పించుకోవాలని చూస్తుంది. చివరికి హీరోయిన్ బ్రతికి బయటపడుతుందా? ఆ ముగ్గురు సైకోలు ఏమవుతారు? అన్నాఫ్రిట్జ్ కి ఎవరైనా సహాయం చేస్తారా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్’ (The Corps of Anna Fritz) అనే ఈ స్పానిష్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.