Beautiful Train Journeys In India: భారతదేశం సమశీతోష్ణ ప్రదేశం. ఇక్కడ అన్ని రకాల వాతావరణాలు ఉంటాయి. దేశ సరిహద్దుల్లో సముద్రాలు, ఎడారులు, మంచుకొండలు కనువిందు చేస్తాయి. విశాలమైన, వైవిధ్యమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన రైలు ప్రయాణాలు భారత్ లో చాలా ఉన్నాయి. తీర ప్రాంతాలు, దట్టమైన అడవులు, మంచు పర్వతాల గుండా వెళ్తూ ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వాటిలో నాలుగు అందమైన రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ జైసల్మేర్ – జోధ్ పూర్
క్వీన్ అఫ్ డెసర్ట్ రైలు ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిందే. ఈ రైలు రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి జోధ్ పూర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం పూర్తిగా థార్ ఎడారి మీదుగా కొనసాగుతుంది. బంగారు వర్ణపు ఇసుక దిబ్బలు, శుష్క మైదానాలు, పురాతన కోటలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
⦿ ముంబై- గోవా
మాండోవి ఎక్స్ ప్రెస్ ట్రైన్ జర్నీ జీవితాంతం మర్చిపోలేం. ఇది ముంబై నుంచి గోవా వరకు ప్రయాణిస్తుంది. దట్టమైన అడవులు, ఉప్పొంగే జలపాతాలు, కొంకణ్ తీరం వెంబడి అద్భుతమైన నదులను దాటుతూ వెళ్తుంది. పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది. చక్కటి బీచ్ లు, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ప్రయాణీకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. జలపాతం నుంచి వచ్చే నీటి తుంపరలు ప్రయాణీకులను తాకుతూ ఆహా అనిపిస్తాయి.
⦿ మండపం- రామేశ్వరం
ఈ ప్రాంతాల మధ్య బోట్ మెయిల్ ఎక్స్ ప్రెస్ పూర్తిగా సముద్రం మీదే ప్రయాణం చేస్తుంది. ఈ రైలు చెన్నై నుంచి రామేశ్వరం వరకు కొనసాగుతుంది. దేశంలోని అత్యంత ప్రత్యేకమైన రైలు ప్రయాణాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఐకానిక్ పంబన్ వంతెన మీది నుంచి ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు సముద్రపు అలలతో నీటి తుంపరలు రైళ్లో వెళ్లేవారి పై పడుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: ఢిల్లీ నుంచి ఒక్క రోజులో చుట్టేసే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
⦿ జమ్మ- బారాముల్లా
జమ్మూ మెయిల్ రైలు జమ్మూ నుంచి ఉధంపూర్ వరకు ప్రయాణిస్తుంది. హిమాలయ శ్రేణుల గుండా వెళ్తూ ఎంతగానో ఆట్టుకుంటుంది. లోతైన లోయలు, గడ్డకట్టే నదులు, దట్టమైన అడవులతో సహా మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాల నడుమ ప్రయాణిస్తుంది. ఎటు చూసినా మంచు పర్వతాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. సొరంగాలు, వంతెనలు, మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య పరుగులు తీస్తూ అలరిస్తుంది. ముఖ్యంగా శీతాకాలం ముగిసి, వేసవి కాలం మొదలయ్యే సమయంలో ఈ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇండియాలో ఉన్నామా? స్విట్జర్లాండ్ లో ఉన్నామా? అనే ఫీలింగ్ కలిగిస్తుంది. సో, మీరు కూడా వీలు చూసుకుని ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాలు చేయండి.
Read Also: 158 ఏండ్ల క్రితం పట్టాలెక్కిన రైలు, ఇప్పటికీ నడుస్తోంది, ఎక్కడో తెలుసా?