BigTV English

Autopen Controversy Trump: బైడెన్ క్షమాభిక్షలు రద్దు చేసిన ట్రంప్.. అమెరికాలో ఆటోపెన్ వివాదం

Autopen Controversy Trump: బైడెన్ క్షమాభిక్షలు రద్దు చేసిన ట్రంప్.. అమెరికాలో ఆటోపెన్ వివాదం

Autopen Controversy Biden Trump| డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి.. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనంగా లేదా వివాదాస్పదంగా మారుతోంది. ఆయన పాలన మునుపటి ప్రభుత్వాల కంటే భిన్నంగా ఉంది. అక్రమ వలసదారులను తిరిగి పంపించడం, గ్రీన్ కార్డ్ రద్దు వంటి నిర్ణయాలు వివాదాలను రేకెత్తించాయి. ట్రంప్ తన ప్రత్యేక శైలిలో, తానే ప్రతిదీ అమలు చేయాలనే తీరులో కొనసాగుతున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలో ఉన్న చివరి రోజుల్లీ తీసుకున్న క్షమాభిక్ష నిర్ణయాన్ని ట్రంప్ విమర్శించారు. బైడెన్ అధ్యక్ష పదవి నుండి తొలగే ముందు అనేక మందికి క్షమాభిక్షలు పెడితే.. ఇప్పుడవి చెల్లవంటూ ట్రంప్ మరో వివాదానికి తెరలేపారు.


ట్రంప్ వాదన ప్రకారం.. ఆ క్షమాభిక్షలపై ఆటోపెన్ ద్వారా సంతకాలు చేయబడ్డాయి. బైడెన్‌కు ఈ విషయం గురించి తెలియదు. బైడెన్ నిద్రలో ఉన్న సమయంలో.. రాజకీయ నాయకులు అనేకమందికి క్షమాభిక్షలు మంజూరు చేశారని.. అవి చెల్లనివని ట్రంప్ తేల్చి చెప్పారు. వాస్తవానికి, బైడెన్ వయస్సు, ఆరోగ్య కారణాల వల్ల అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా వైదొలిగారని తెలిసిందే. ఇప్పుడు ఆటోపెన్ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత, బైడెన్ ఆరోగ్యం పైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, బైడెన్ ఆటోపెన్ ఉపయోగించారా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు. ఈ విషయంపై ట్రంప్ కూడా తన వ్యాఖ్యలను కొంత మార్చుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో (అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణించే విమానం) విలేకర్లతో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇది నా నిర్ణయం కాదు, కోర్టులపై ఆధారపడి ఉంటుంది. కానీ, అవి చెల్లనివని నేను చెప్పాను. బైడెన్‌కు ఏం జరిగిందో సరిగా తెలియకపోయి ఉండొచ్చు” అని వ్యాఖ్యానించారు.

Also Read: గ్రీన్‌కార్డు దారులకు కొత్త టెన్షన్, సీనియర్ సిటిజన్స్.. ఆపై ఆ ఐదు అంశాలు


సంతకాలు చేసే యంత్రం.. ఆటోపెన్!
ఆటోపెన్ అనేది వ్యవహారికంగా వచ్చిన పేరు. ఇది డూప్లికేట్ సంతకాలను నిజమైన సంతకాలుగా చేసే యంత్రం. ఇది ప్రజా జీవితంలో ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వాణిజ్య అవసరాల కోసం భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్‌లు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక ప్రింటర్ సైజులో యాంత్రిక హస్తంతో ఉంటుంది. ఇది సాధారణ పెన్ లేదా పెన్సిల్‌ను పట్టుకోగలదు, ప్రోగ్రామ్ చేసిన సంతకానికి నకళ్లు రాయగలదు. తాజాగా, మేరీల్యాండ్‌కు చెందిన సంస్థ ‘ది ఆటోపెన్ కంపెనీ’ స్పందిస్తూ, సాధారణంగా ఈ యంత్రాలను యూనివర్శిటీలు, ప్రభుత్వ ఏజెన్సీలు.. ఇతర సంస్థలు దాదాపు 60 ఏళ్లుగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నేతలు కూడా దీనిని కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

19వ శతాబ్దం ప్రారంభంలో ఒక ప్రత్యేకమైన పాలిగ్రాఫ్ యంత్రం ఉపయోగించేవారు. ఇది రెండు పెన్నులను ఉపయోగించి రాయడానికి వీలు కల్పించేది. 1803లో దీనికి పేటెంట్ లభించింది. అప్పట్లో థామస్ జెఫర్సన్ తన పదవీకాలం తర్వాత కూడా దీనిని ఉపయోగించారు. 2005లో అమెరికాలోని జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లోని ది ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, ఆటోపెన్ ఉపయోగించడం చట్టబద్ధమే. గతంలో కూడా అనేక అధ్యక్షులు ఆటోపెన్ ఉపయోగించారు. వీరిలో బరాక్ ఒబామా ది పేట్రియాట్ యాక్ట్‌కు సంబంధించిన నిర్ణయంపై ఆటోపెన్ ఉపయోగించి సంతకం చేయడం వివాదాస్పదమైంది.

బైడెన్ కుటుంబానికి ప్రత్యేక భద్రత తొలగింపు
గత ప్రభుత్వం చివరి రోజుల్లో మంజూరు చేసిన క్షమాభిక్షలను చెల్లనివిగా ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబానికి ఇచ్చిన సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు. బైడెన్ కుమారుడు హంటర్ భద్రత కోసం సీక్రెట్ సర్వీస్‌కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని ట్రంప్ తెలిపారు. అలాగే, కుమార్తె ఆష్లే బైడెన్‌కు 13 మంది ఏజెంట్లతో కూడిన భద్రత ఉందని చెప్పారు. ఈ రక్షణను వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. ఈ విషయంపై బైడెన్ కార్యాలయం ఇంకా స్పందించలేదు.

సాధారణంగా అమెరికాలో ఫెడరల్ చట్టాల ప్రకారం, మాజీ అధ్యక్షుడు మరియు అతని జీవిత భాగస్వామికి జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ ఉంటుంది. అయితే, వారి పిల్లలు 16 ఏళ్లు దాటిన తర్వాత, అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన వెంటనే భద్రతను తొలగిస్తారు. కానీ, బైడెన్ తన పదవి నుండి తొలగిపోయే ముందు తన పిల్లలకు కల్పించిన రక్షణను జులై వరకు పొడిగించుకున్నారు. ఇదే విధంగా ట్రంప్ కూడా తన పదవీకాలం ముగిసే ముందు తన పిల్లల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇప్పుడు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.

క్షమాభిక్షలపై ట్రంప్ వ్యాఖ్యలు
బైడెన్ మంజూరు చేసిన క్షమాభిక్షలపై ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. క్షమాభిక్ష పత్రాలపై బైడెన్ పేరిట ఆటోపెన్ ద్వారా సంతకాలు చేయబడ్డాయని, అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బైడెన్ అధ్యక్ష పదవి నుండి తొలగిపోయే ముందు కొన్ని గంటల్లో అనేకమందికి క్షమాభిక్షలు మంజూరు చేశారు. డిసెంబర్ 12న ఒకే రోజులో 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు.  మరో 39 మంది ఖైదీలకు శిక్ష పూర్తిగా క్షమించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవరూ మంజూరు చేయలేదు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×