BigTV English

OTT Movie : డ్రైనేజీ దగ్గర డెడ్ బాడీ… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… స్పైన్ చిల్లింగ్ మలయాళ మర్డర్ మిస్టరీ

OTT Movie : డ్రైనేజీ దగ్గర డెడ్ బాడీ… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… స్పైన్ చిల్లింగ్ మలయాళ మర్డర్ మిస్టరీ
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు చిల్లింగ్ థ్రిల్ ని ఇచ్చే ఒక మలయాళం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన డబుల్ మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఒక విచిత్రమైన థ్రిల్లర్ కథని చూపిస్తుంది. మరి ఈ సినిమా కథ ఏమిటి ? ఎందులో ఉంది ? పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సాజన్ ఫిలిప్ ఒక ప్రేమ జంటపై జరిగిన దారుణమైన డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి నియమించబడతాడు. ఈ కేసు రూబిన్, స్నేహల మరణాల చుట్టూ తిరుగుతుంది. ఈ జంట ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉండేవాళ్లు. జార్జ్ అనే ఒక టెకీ, క్లబ్‌లో మద్యం సేవించి, డ్రగ్స్ ప్రభావంలో రాత్రి ఇంటికి తిరిగి వచ్చి ఈ హత్యలను చూస్తాడు. CCTV ఫుటేజ్ జార్జ్‌ను అపార్ట్‌మెంట్‌లో చూపిస్తుంది. దీంతో అతను ప్రధాన అనుమానితుడిగా అరెస్టు అవుతాడు. సాజన్, తన ఉన్నతాధికారులు ACP జాన్, DGP రామదాస్ నుండి ఈ కేసు విషయంలో ఒత్తిడిని ఎదుర్కుంటాడు. తాను సేకరించిన ఈ ఆధారాలు తప్పుదారి పట్టిస్తున్నాయని గ్రహిస్తాడు. అసలు నేరస్థుడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడని తెలుసుకుని, సాజన్ అనేక అనుమానితులను విచారిస్తాడు. కానీ నమ్మదగని సాక్షులు వల్ల ఈ కేసు క్రిటికల్ గా మారుతుంది.

ఒక దశలో సాజన్ స్వయంగా అనుమానితుడిగా మారతాడు. ఇది కథకు మరింత ఉత్కంఠను తెచ్చి పెడుతుంది. సాజన్ కేసును డీప్ గా విచారిస్తూ, రూబిన్ స్నేహల గతం, వారి సంబంధాలు, శత్రువుల గురించి ఆధారాలను కనుగొంటాడు. ఈ దర్యాప్తు అతన్ని ఒక స్థానిక డ్రగ్ రింగ్, అక్రమ సంబంధాలు, వ్యక్తిగత పగల వైపు నడిపిస్తుంది. కథలో ఒక ట్విస్ట్ బయట పడుతుంది. ఇది హత్యల అసలు సెక్రెట్ ని బయటపెడుతుంది. క్లైమాక్స్‌లో సాజన్ అతి కష్టం మీద అసలు నేరస్థుడిని కనిపెడతాడు. అయితే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుందా ? నేరస్తుడు ఎవరు ? ఎందుకు ఆ జంటని చంపాడు ? సాజన్ అతన్ని ఎలా కనిపెడతాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘Kurukku’ 2024లో విడుదలైన మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. అభిజిత్ నూరానీ దర్శకత్వంలో, అనిల్ ఆంటో, ప్రీతా ప్రదీప్, అజయఘోష్, మీరా నాయర్, అమిత మిథున్, సుబిన్ టార్జన్, బాలాజీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూలై 5న థియేటర్లలో విడుదలై, 1 గంట 49 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు, తమిళ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Read Also : అబ్బాయిలను రెచ్చగొట్టి ఆ పని చేసే టీనేజర్… పని కానిస్తూ పరలోకానికి క్లయింట్… ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూడాల్సిన మూవీ

Related News

Dude OTT : ‘డ్యూడ్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : నెక్స్ట్ డోర్ క్రైమ్స్… ప్రతీ మర్డర్ కేసులో ఊహించని టర్నులు, ట్విస్టులు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్

OTT Movie : రియాలిటీ షోలో ఛాన్స్… ఎంత మోసం చేస్తే అంత డబ్బు… ప్రతీ 5 నిమిషాలకు ట్విస్ట్ ఉన్న థ్రిల్లర్

Big Stories

×