E-Paper
Advertisement

కలగా భావించిన వేడుకే సమస్యగా మారితే… కజిన్ చేసిన పనికి ఊరంతా షాక్

కలగా భావించిన వేడుకే సమస్యగా మారితే… కజిన్ చేసిన పనికి ఊరంతా షాక్
Advertisement

Australian Family Drama: ఓ చిన్న పల్లెటూరి అమ్మాయికి జీవితంలో ఒక్కసారే వచ్చే డెబ్యుటాంట్ బాల్… అదే తనను అందరి దృష్టిలో పడేసే పెద్ద అవకాశం. కానీ సిటీ నుంచి వచ్చిన కజిన్ మాత్రం ఆ వేడుకలో ఉన్న పాత పద్ధతులనే ప్రశ్నిస్తే ? ఒకరికి డెబ్ అంటే కల… మరొకరికి అదే డెబ్ అంటే మార్చాల్సిన వ్యవస్థ. ఈ ఇద్దరి మధ్య మొదలైన గొడవలు చివరకు ఎలాంటి మార్పుకు దారి తీశాయి ? ఇలా ఫన్, మ్యూజిక్, ఫ్యామిలీ డ్రామాతో సాగే ఆస్ట్రేలియన్ మ్యూజికల్ కామెడీ ‘ది డెబ్’ కథేంటో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఆస్ట్రేలియాలోని డన్‌ బర్న్ అనే చిన్న పల్లెటూరిలో టేలాహ్ అనే హైస్కూల్ అమ్మాయి ఉంటుంది. చదువు, సోషల్ లైఫ్‌లో పెద్దగా గుర్తింపు లేని ఆమెకు డెబ్యుటాంట్ బాల్ అనే ఈవెంట్ తన జీవితాన్ని మార్చే అవకాశం అనిపిస్తుంది. ఆ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించి, ఊరిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంది. అదే సమయంలో సిడ్నీ నుంచి ఆమె కజిన్ మేవ్ అక్కడికి వస్తుంది. మేవ్ చాలా మోడ్రన్‌గా ఆలోచించే అమ్మాయి. ఆమె దృష్టిలో డెబ్ అనేది పాతకాలపు సామాజిక పద్ధతులను కొనసాగించే వేడుక.

Advertisement

దీంతో టేలాహ్‌కు నచ్చినదే మేవ్‌కు అస్సలు నచ్చదు. ఒకరు డెబ్‌లో స్టార్ కావాలని చూస్తుంటే… మరొకరు ఆ వేడుకనే మార్చాలని ప్రయత్నిస్తారు. దీంతో ఇద్దరి మధ్య చిన్న గొడవలు కాస్తా పెద్ద సమస్యలుగా మారతాయి. కానీ క్రమంగా ఇద్దరికీ తమ తమ సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది. టేలాహ్‌కు గుర్తింపు కావాలి. మేవ్ మాత్రం తనపై ఏర్పడిన ఇమేజ్‌ను దాటి, తనను తాను అర్థం చేసుకోవాలని చూస్తుంది.

డెబ్ దగ్గరపడే కొద్దీ పార్ట్‌నర్‌ను వెతకడం, ఇమేజ్ మార్చుకోవడం, ఊరి వాళ్ల అభిప్రాయాలను ఎదుర్కోవడం వంటి పరిణామాలు కామెడీని పండిస్తాయి. చివరకు ఒకరిని మరొకరు అర్థం చేసుకున్న ఈ ఇద్దరు కజిన్స్, తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఒకరికొకరు అండగా నిలబడతారు. అయితే టేలాహ్ కల నెరవేరిందా ? మేవ్ డెబ్‌లో మార్పు తీసుకురాగలిగిందా ? ఈ ఇద్దరి గొడవ చివరకు వారి బంధాన్ని మరింత బలపరిచిందా ? అనేదే సినిమా కథ.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

Advertisement

రెబెల్ విల్సన్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెబ్’. నటాలీ అబాట్, షార్లెట్ మాక్‌ఇన్నెస్, రెబెల్ విల్సన్ కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్, డ్యాన్స్, Gen-Z కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సెల్ఫ్ యాక్సెప్టెన్స్, యూత్ ప్రెజర్, సోషల్ ఎక్స్‌పెక్టేషన్స్ వంటి అంశాలతో సరదాగా సాగిపోతుంది సినిమా. ఆగస్టు 25 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. అయితే Prime Videoలో ఈ సినిమా రెంట్ కి అవైలబుల్ గా ఉంది. మ్యూజికల్ కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి వీకెండ్ ఛాయిస్.

Read Also: మద్యం తాగే ఏలియన్ తో ఫుల్ ఫన్… ఫెయిల్యూర్‌కు ఫెయిల్యూర్ తోడైతే ఎలా ఉంటుందో చూపించే క్రేజీ కామెడీ థ్రిల్లర్

Related News

అమాయకపు కుర్రాడు అనుకున్నారు… కట్ చేస్తే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ మాంత్రికుడు… ఓటీటీలోకి సీజన్ 2

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సంగీతంతో ఒక్కటయ్యే బంధాలు… మనసును తాకే భావోద్వేగాలతో తెలుగు ఫ్యామిలీ డ్రామా

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×