E-Paper
Advertisement

మద్యం తాగే ఏలియన్ తో ఫుల్ ఫన్… ఫెయిల్యూర్‌కు ఫెయిల్యూర్ తోడైతే ఎలా ఉంటుందో చూపించే క్రేజీ కామెడీ థ్రిల్లర్

మద్యం తాగే ఏలియన్ తో ఫుల్ ఫన్… ఫెయిల్యూర్‌కు ఫెయిల్యూర్ తోడైతే ఎలా ఉంటుందో చూపించే క్రేజీ కామెడీ థ్రిల్లర్
Advertisement

Malayalam Sci Fi Comedy on OTT: సాధారణంగా ఏలియన్ సినిమాలంటే సూపర్ పవర్స్, వింత టెక్నాలజీ, భూమిని ఆక్రమించే ప్లాన్స్ గుర్తొస్తాయి. కానీ ఓ ఏలియన్‌కు సూపర్ పవర్స్ ఉన్నాయో లేదో కూడా తెలియకపోతే ? పైగా నీళ్లు, ఆహారం కంటే మద్యం అంటేనే ఎక్కువ ఇష్టమైతే ? మరోవైపు జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఫెయిల్ అవుతున్న ఓ యువకుడు అతనికి స్నేహితుడైతే ? ఈ ఇద్దరు ఫెయిల్యూర్స్ కలిసి చేసే హంగామానే మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ ‘ప్లూటో’ (Pluto). మరి ఈ ఏలియన్ భూమిపైకి ఎందుకు వచ్చాడు? విక్కీ జీవితంలోకి ప్లూటో రావడంతో ఏం జరిగింది? అనేది కథలో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

విక్కీ అలియాస్ విఘ్నేష్ జీవితంలో సక్సెస్ అనేది అందని ద్రాక్షలా మారుతుంది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే బ్యాక్‌లాగ్స్‌తో ఇబ్బందులు పడతాడు. చదువు పూర్తయ్యాక బిజినెస్ చేసి జీవితంలో సెటిల్ అవుదామని ప్రయత్నించినా, అతను మొదలుపెట్టిన ప్రతి పని వరుసగా ఫెయిల్ అవుతుంది. దీంతో కుటుంబం, స్నేహితులు మాత్రమే కాదు, ప్రేమించిన అమ్మాయి కూడా అతనిపై నమ్మకం కోల్పోతుంది. ఇలా పూర్తిగా నిరాశలో ఉన్న విక్కీ జీవితంలోకి ఓ రోజు ఊహించని అతిథి వస్తాడు.

Advertisement

అతనే ప్లూటో అనే ఏలియన్. అయితే ఇతను మామూలు గ్రహాంతరవాసిలా ఉండడు. తనకు ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయో లేదో అతనికే తెలియదు. భూమిపైకి వచ్చిన తర్వాత ఆహారం, నీళ్ల కంటే ఎక్కువగా మద్యం కోసం వెతుకుతుంటాడు. అసలు ప్లూటో కూడా తన గ్రహంలో సక్సెస్‌ఫుల్ వ్యక్తి కాదు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తన గ్రహం నుంచి పారిపోయి భూమిపైకి వచ్చినట్లు తెలుస్తుంది. అంటే విక్కీకి తన జీవితంలో వైఫల్యాలు ఎదురైతే, ప్లూటో కూడా తన గ్రహంలో ఓ ఫెయిల్యూర్.

ఈ ఇద్దరూ కలిసిన తర్వాత ఏర్పడే విచిత్రమైన స్నేహమే కథకు అసలు బలం. ప్లూటోలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని మొదట భావించిన విక్కీ, అతని అసలు పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతాడు. అయినా ఇద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. అదే సమయంలో ప్లూటో గురించి బయట ప్రపంచానికి తెలిసే ప్రమాదం రావడంతో పరిస్థితులు మారిపోతాయి. కొందరు వ్యక్తులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో విక్కీ, ప్లూటో కలిసి వారి నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది.

Advertisement

ఈ ప్రయాణంలో ఇద్దరూ ఒకరికొకరు అండగా మారతారు. ప్లూటోకు భూమి కొత్త ప్రపంచం అయితే, విక్కీకి మాత్రం జీవితం మీదే నమ్మకం పోయిన పరిస్థితి. ప్లూటో అతని జీవితంలోకి రావడంతో విక్కీలో కూడా మార్పు మొదలవుతుంది. అయితే ప్లూటో అసలు ఏం చేయగలడు? అతను భూమిపైకి ఎందుకు వచ్చాడు? అతన్ని పట్టుకోవాలని చూస్తున్నది ఎవరు? విక్కీ జీవితాన్ని ప్లూటో మార్చాడా? లేక మరిన్ని సమస్యల్లోకి నెట్టాడా? ఈ ఇద్దరు ఫెయిల్యూర్స్ చివరికి ఏం సాధించారు? అనేదే సినిమాలో చూడాల్సిన కథ.

తెలుగులో చూడొచ్చా ?

ఆదిత్యన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీరజ్ మాధవ్ విక్కీగా, అల్‌తాఫ్ సలీమ్ ప్లూటోగా నటించారు. అజు వర్గీస్, ఆర్ష బైజు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సూపర్ పవర్స్ ఉన్న ఏలియన్‌కు బదులుగా విచిత్రమైన అలవాట్లున్న ఏలియన్‌ను చూపించడం, అతనికి జోడీగా ఓ ఫెయిల్యూర్ యువకుడిని పెట్టడం ఈ సినిమాను డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ‘ప్లూటో’ 2026 జూలై 30న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆగస్టు 24 నుంచి Saina Playలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏలియన్ కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఫ్రెండ్‌షిప్ కామెడీ వంటి సినిమాలు వెతికేవాళ్లు ఈ సినిమాతో ఒక లైట్‌హార్టెడ్, క్రేజీ సైన్స్ ఫిక్షన్ ఎక్స్‌పీరియన్స్‌ చేయొచ్చు. కానీ ఈ మలయాళం సినిమా తెలుగులో లేదు.

Read Also: జైలు నుంచి తప్పించుకుని నరకంలోకి… రాక్షస సర్పాల చేతిలో చిక్కుకునే నగరం… ఈ క్రీచర్ హారర్ మూవీ తెలుగులోనే

Tags

Related News

2026లో కొరియర్లో వచ్చిన పుస్తకంలో 1999 నాటి మర్డర్ మిస్టరీ… ఇదెలా సాధ్యం భయ్యా

కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎక్కడ చూడొచ్చంటే?

కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

ఆ వర్షపు రాత్రి చేసిన ఒక్క తప్పు… చిన్న పొరపాటుకు జీవితాంతం శిక్ష… హార్ట్ టచింగ్ స్టోరీ

హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

Big Stories

Advertisement
×