Komaram Irumudi: ఇరుముడి …శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూల్లని కొల్లగొడుతుంది.ఇక ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిందటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు కూడా.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాగులు అనే పాత్ర పోషించిన కొమరం ఆలియాస్ కొమరక్కకి ఇపుడు మంచి గుర్తింపు లభిస్తుంది.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొమరం అసలు ఈ సినిమా తన దగ్గరికి ఎలా వచ్చిందో ,ఆ సమయంలో తన అనుభూతి ఏంటి అన్న విషయాలని ఇలా బయటపెట్టాడు.
కొమరం మాట్లాడుతూ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి బ్యానర్ పై ఇరుముడి అనే సినిమా చేస్తున్నామని మిమ్మల్ని ఒక క్యారెక్టర్ కి అనుకుంటున్నామని కాల్ చేశారని తెలిపాడు. అయితే అప్పటికి శివ నిర్వాణ అంటే తెలీదని కేవలం మైత్రి బ్యానర్ ఒకటే పెద్దదని తెలుసని చెప్పాడు. అయితే అప్పటికే జబర్దస్త్ తో పాటు ప్యారడైజ్ సినిమాకి 85 డేస్ కమిట్ అయిపోవడం వల్ల ఎందుకొచ్చిన ఇబ్బంది అని పోలేదని తెలిపాడు.
అయినప్పటికీ రెండు సార్లు ఫోన్ చేయడంతో తప్పక పోయాననిఆ సినిమాలో ఎలాంటి పాత్ర అనేది తెలియదని కేవలం ఒక లేడీ గెటప్ లో ఉండే పాత్ర మాత్రమే అని చెప్పారని తెలిపాడు.ఇక అతను శివ నిర్వాణనే దగ్గరుండి తన గెటప్ చెక్ చేశాడని కేవలం ఆడవాళ్ళని చీట్ చేస్తూ ఒక కబడ్డీ సీన్ లో చేయాలని మాత్రమే చెప్పినట్టు తెలిపాడు.
అయితే సినిమాలో ఏదైనా హిజ్రా పాత్ర దక్కుతుందేమో అని అనుకున్నానని తన మనసులోని మాటని బయటపెట్టాడు.
also read :కొమరం కన్నీళ్ల వెనుక ఇంత కథ ఉందా !
ఇక సినిమాలో హీరో రవితేజ అని తెలిగానే షాక్ అయ్యానని, తాను చినప్పుడు స్కూల్లో చదువుకునేతప్పుడే రవితేజ ఒక పెద్ద హీరో అని అలాంటి హీరోతో కలిసి పని చేస్తానని అస్సలు అనుకోలేదని తెలిపాడు.
ముఖ్యంగా రవితేజ సెట్ లోకి వచ్చినప్పుడు పూర్తిగా టెన్షన్ పడిపోయానని, ఇక రవితేజకి ఎదురుగా నిలబడి సైకో విలన్ గా నటిస్తుంటే తన జర్నీ అంతా గుర్తుకు వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు.అయితే రవితేజ కి ఎదురుగా నటిస్తుంటే మొదట్లో భయపడిపోయానని, కానీ డైరెక్టర్ శివ నిర్వాణ సూచనలతో బాగా నటించగలిగానని తెలిపాడు.
ఇక తనకి అసలు సిగరెట్ తాగే అలవాటు లేదని ,కానీ సినిమాలో సిగరెట్ తాగుతూ నటించే సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, కానీ పాత్ర కోసం చేయాల్సి వచ్చిందని ఇపుడు అదే క్యారక్టర్ ని మరింత ఎలివేట్ చేసిందని చెప్పుకొచ్చాడు. అసలే శివ నిర్వాణ ఈ పాత్ర నేనే చేయాలని పట్టుబట్టి మరీ ఇచ్చినప్పుడు ఎక్కడా తన అంచనాలకి తక్కువగా ఉండకూడదని కష్టపడ్డానని తెలిపాడు.
ముఖ్యంగా రవితేజని తో నటించిన తర్వాత శివ నిర్వాణ దగ్గరికి వెళ్లి అసలు నేను ఏమవుతానని ఇంత మంచి క్యారక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారని, గత 12 ఏళ్లుగా కొమరక్కగానే గుర్తున్నాను తప్ప నన్ను మరోలా ఇంకెవరూ చూళ్లేకపోయారని చెబుతూ అతని కాళ్ళ మీద పడ్డానని ఎమోషనల్ అయిపోయాడు.
also read :మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?
ఇక సినిమాలో తన ఫ్రెండ్స్ ఎవరూ నాగులు పాత్రలో తనని గుర్తు పట్టలేదని చెబుతూ సంతోషపడిపోయాడు. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కడెక్కడినుండో తనకి మెసేజ్ లు వస్తున్నాయని, ఆ మెసేజ్ లతో తన వాట్సప్, ఇంస్టా మొత్తం నిండిపోయిందని చెబుతూ ఆనందపడిపోయాడు.
ఇక వీరందరికీ వీడియోతో ఒక జవాబు ఇస్తానని తెలిపాడు. మొత్తంగా 18 ఏళ్ల తన కష్టానికి ఇరుముడి సినిమాలోని నాగులు క్యారెక్టర్ తో గుర్తింపు వచ్చిందని ఎమోషనల్ అయిపోయాడు కొమరం !