OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏ భాషలో వచ్చినా, కంటెంట్ కొంచెం నచ్చినా వదలకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. అందులోను యాక్షన్ హీరోలు ఇలాంటి సిరీస్ లలో నటిస్తే కథ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సిరీస్ లో, సిల్వెస్టర్ స్టాలోన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సిరీస్ రేటింగ్ లో కూడా దూసుకుపోతోంది. ఇదివరకే వచ్చిన రెండు సీజన్ లు ఓటీటీని షేక్ చేశాయి. ఇప్పుడు వచ్చిన మూడో సీజన్ అంతకు మించి ఉంటోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘టుల్సా కింగ్ సీజన్ 3’ 2025లో విడుదలైన అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్. టేలర్ షెరిడాన్ దీనిని రూపొందించారు. ఇందులో సిల్వెస్టర్ స్టాలోన్, మార్టిన్ స్టార్, జే విల్, అన్నాబెల్లా సియోరా, నీల్ మెక్‌డోనౌ, గారెట్ హెడ్‌లండ్ ప్రధాన పాత్రల్లో నటించారు. MTV ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్, 101 స్టూడియోస్ బ్యానర్‌పై టేలర్ షెరిడాన్, స్టాలోన్, ఎరిక్సన్ నిర్మించిన ఈ సిరీస్, 2025 సెప్టెంబర్ 21 నుంచి పారామౌంట్+లో ప్రీమియర్ అయి, వీక్లీ ఎపిసోడ్స్‌తో నవంబర్ 23 వరకు స్ట్రీమ్ అవుతోంది. ఇండియాలో జియో హాట్‌స్టార్ లో సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ పది ఎపిసోడ్స్ తో IMDbలో 8.0/10 రేటింగ్ పొందింది.
డ్వైట్ (సిల్వెస్టర్ స్టాలోన్) అనే గ్యాంగ్ స్టర్ 25 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తరువాత న్యూయార్క్ నుంచి టుల్సాకి బహిష్కరణకి గురవుతాడు. ఆ తర్వాత అతను తన క్రిమినల్ ఎంపైర్‌ని విస్తరిస్తాడు. ఈ సమయంలో డ్వైట్‌ని కొంతమంది మాస్క్డ్ గన్‌మెన్ లు కిడ్నాప్ చేసి బెదిరిస్తారు. డ్వైట్ తన టీమ్ టైసన్, బోధి, మిచ్, బిగ్‌ఫుట్ తో కలిసి ఈ కొత్త శత్రువులను ఎదుర్కొంటాడు. ఇక్కడ కొత్తగా జెరెమియా డన్‌మైర్, అతని కొడుకు కోల్ డన్‌మైర్, టుల్సాలోని పవర్‌ఫుల్ ఫ్యామిలీగా డ్వైట్ ఎంపైర్‌కి సవాల్ విసురుతారు. డ్వైట్ ని చంపడానికి, అతని సామ్రాజ్యాన్ని కూల్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిని తన తెలివితేటలతో డ్వైట్ తిప్పికొడుతుంటాడు.
సెకండ్ హాఫ్‌లో డన్‌మైర్స్‌తో డ్వైట్ ఓపెన్ వార్‌లోకి దిగుతాడు. ఈ సమయంలో డ్వైట్‌కు పోలీసుల నుండి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా స్పెషల్ ఏజెంట్ ముస్సో నుండి ఎక్కువగా ఉంటుంది. అతనికి డ్వైట్‌పై వ్యక్తిగత కక్ష కూడా ఉంటుంది. ఇది ఇలా ఉంటే డ్వైట్ తన స్నేహితురాలు మార్గరెట్‌తో సంబంధాన్ని కొనసాగిస్తాడు. డ్వైట్ తన నేర జీవితాన్ని, వ్యక్తిగత బాధ్యతలను సరిదిద్దడానికి పోరాడతాడు. ఇక క్లైమాక్స్ కూడా ఊహించని మలుపులు తీసుకుంటుంది. డ్వైట్‌కు డన్‌మైర్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రమాదాలు వస్తాయి ? స్పెషల్ ఏజెంట్ ముస్సోకి డ్వైట్‌పై కక్ష ఎందుకు ఉంటుంది ? డ్వైట్ తన ఫ్యామిలీతో కలసి జీవిస్తాడా ? అనే విషయాలను, ఈ అమెరికన్ క్రైమ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు