BigTV English

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : రియల్ లైఫ్ లో జరుగుతున్న క్రైమ్ స్టోరీలతో వస్తున్న సినిమాలను ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు అన్ని భాషల్లో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సీరియల్ కిల్లర్ సినిమా లైతే, ప్రతి భాషలోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, సైనైడ్ మోహన్ అనే సీరియల్ కిల్లర్ కేస్ ఆధారంగా తీయబడింది. అమ్మాయిలను మోసం చేస్తూ, అతడు చేసే ఘోరాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘భగ్వత్ చాప్టర్ వన్: రాక్షస్’ (Bhagwat Chapter One: Raakshas) 2025లో వచ్చిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అక్షయ్ షేరే దీనికి దర్శకత్వం వహించారు. ముఖ్య పాత్రల్లో అర్షద్ వార్సీ, జితేంద్ర కుమార్, అయేషా కాదుస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17న ZEE5 ఓటీటీలో తెలుగు, తమిళ సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDb లో దీనికి 6.5/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న టౌన్‌లో పూనం అనే యువతి ఒక రోజు మిస్సింగ్ అవుతుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ భగ్వత్ కి ఫిర్యాదు చేస్తారు. భగ్వత్ ఒక ధైర్యవంతమైన పోలీసు ఆఫీసర్. అతను పూనం కేసును తీసుకుని, 15 రోజుల్లో కేసును సాల్వ్ చేస్తానని చెబుతాడు. అదే సమయంలో సమీర్ అనే కాలేజ్ ప్రొఫెసర్, మీరా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్లు రహస్యంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ భగ్వత్ విచారణలో పూనం లాంటి అమ్మాయిలు చాలా మంది మిస్సింగ్ అయ్యారని తెలుస్తుంది. ఈ కేసుల వెనుక పెద్ద ప్రొస్టిట్యూషన్ రాకెట్ ఉందని అర్థమవుతుంది. భగ్వత్ విచారణలో అమ్మాయిల మిస్సింగ్ కేసుల వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది.


Read Also : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

సమీర్ ప్రేమ కథ కూడా ఈ కేసులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. భగ్వత్‌కు సమీర్‌పై అనుమానం వస్తుంది. ఎందుకంటే అతను మీరాతో ప్రేమ నటిస్తూ, ఏదో దాస్తున్నట్లు అనుమానిస్తాడు. ఈ క్రమంలో ఊరిలో పొలిటికల్ ప్రెషర్ భగ్వత్‌ను ఇబ్బంది పెడతాయి. అతను పూనం తల్లిదండ్రులతో కలిసి, నిజం కనుక్కోవడానికి చాలా కష్టపడతాడు. ఈ కథ సస్పెన్స్, టెన్షన్‌తో ముందుకు సాగుతుంది. అయితే భగ్వత్ అనుమానం నిజమవుతుంది. సమీర్ ఒక సీరియల్ కిల్లర్ అని, అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసి చంపుతున్నాడని తెలుస్తుంది. చివరికి సమీర్ ని భగ్వత్ పట్టుకుంటాడా ? అతనికి శిక్ష పడుతుందా ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×