BigTV English

OTT Movie : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్

OTT Movie : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ని అయోమయంలో పడేస్తుంది. ఇందులో హీరో తల్లి వైపు ఉండాలా, ప్రియురాలి వైపు నిలబడాలా అనే సందేహంలో పడతాడు. దీనికి తగ్గట్టే థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. చివరి వరకు ఉత్కంఠంగా నడిచే ఈ సిరీస్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

లారా అనే మహిళ సాండర్సన్ లండన్‌లో బాగా రిచ్. ప్రేమ గల భర్త హోవార్డ్, ప్రియమైన కొడుకు డేనియల్ తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఒక రోజు డేనియల్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ చెర్రీ లైన్ ను ఇంటికి తీసుకొస్తాడు. లారా మొదటి సమావేశంలోనే చెర్రీ పట్ల అనుమానం కలుగుతుంది. చెర్రీ డబ్బుకోసమే తన కొడుకుని వల్లో వేసుకుందని అనుకుంటుంది. డేనియల్‌తో చెర్రీ ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ లారా ఆమెను ఒక మానిప్యులేటివ్ సోషల్ క్లైంబర్ అని నమ్ముతుంది. లారా బెస్ట్ ఫ్రెండ్ ఇసాబెల్లా, ఆమె కుమార్తె బ్రిగిట్టే గతంలో డేనియల్‌తో డేట్ చేసి ఉంటారు. చెర్రీ రాకతో వాళ్లు కూడా అయోమయంలో పడతారు. లారా తన కొడుకును రక్షించడానికి చెర్రీ గురించి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. కానీ ఆమె చర్యలు, కుటుంబ సంబంధాలను ఒత్తిడికి గురిచేస్తాయి.

ఈ సమయంలో చెర్రీ నిజంగా మోసం చేస్తోందా ? లేక లారా అతిగా ఆలోచిస్తోందా ? అనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో మెదులుతుంది. అయితే చెర్రీ తల్లి ట్రేసీ, లారా భర్త హోవార్డ్ సిరీస్‌కు కొత్త డైనమిక్‌ను జోడిస్తారు. ఇప్పుడు లారా చర్యలు హద్దులు దాటడంతో, ఆమె కుటుంబం ఆమె పారనాయిడ్‌ను ప్రశ్నిస్తుంది క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లు, రివిలేషన్స్ ద్వారా లారా, చెర్రీల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్తుంది. డేనియల్ తన తల్లి, ప్రేమికురాలి మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవలసి వస్తుంది. మరి ఈ క్లైమాక్స్‌ ఎలా వెళ్తుంది ? డేనియల్ ఎవరి మాట వింటాడు ? చెర్రీ నిజంగా మోసం చేస్తోందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ది గర్ల్‌ఫ్రెండ్’ 2025లో విడుదలైన ఆరు ఎపిసోడ్‌ల సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రాబిన్ రైట్ దర్శకత్వంలో మిషెల్ ఫ్రాన్సెస్ నవల ఆధారంగా ఇమాజినేరియం ప్రొడక్షన్స్, అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మించాయి. ఇందులో డేనియల్ (లారీ డేవిడ్‌సన్), చెర్రీ (ఒలివియా కుక్), రాబిన్ రైట్ (లారా సాండర్సన్), ఒలివియా కుక్ (చెర్రీ లైన్), లారీ డేవిడ్‌సన్ (డేనియల్), వలీద్ జుయాటర్ (హోవార్డ్, లారా భర్త) ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆరు ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్‌ 45-55 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 7.0/10 రేటింగ్ పొందింది.

Read Also : 20 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి పాడు పనులు… భార్యేమీ తక్కువ తినలేదు… భార్యాభర్తలు కలిసి చూడాల్సిన మూవీ

Related News

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×