Tollywood:దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని.. హీరోయిన్స్ అవకాశాలు వస్తున్నప్పుడే గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అలా సంపాదించిన డబ్బును వృధా చేయకుండా లగ్జరీ భవనాలు, కార్లు ఇలా తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వెచ్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో లగ్జరీ కారు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరు? ఆ లగ్జరీ కారు ఖరీదు ఎంత? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు..
ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆకాంక్ష సింగ్(Akanksha Singh). ‘డాన్ ఔర్ డాక్టర్’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమె.. తెలుగులో అక్కినేని సుమంత్ (Akkineni Sumanth) సరసన ‘మళ్లీ రావా’ అనే సినిమాలో నటించి, తన గ్లామర్ తో యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో అటు ఆకాంక్ష సింగ్ నటన, అభినయం, అందానికి మంచి మార్పులే పడ్డాయి. దీంతో వెంటనే అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాని(Nani ) కాంబినేషన్లో వచ్చిన ‘దేవదాసు’ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా సరే తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది ఆకాంక్ష శర్మ. ఇక ఇటీవలే ‘షష్టిపూర్తి’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. పవన్ ప్రభాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన రూపేష్, అచ్యుత్ కుమార్, జబర్దస్త్ చంటి, మురళీధర్ గౌడ్, ఆనంద్ చక్రపాణి, సంజయ్ స్వరూప్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించగా.. ఈ సినిమాలో హీరోగా నటించిన రూపేష్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఆకాంక్ష శర్మ..
ఇదిలా ఉండగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆకాంక్ష శర్మ తాజాగా ఒక లగ్జరీ కార్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సెలబ్రిటీలందరూ ఎక్కువగా ఇష్టపడే ఎలక్ట్రిక్ SVC, XEV 9EV ను కొనుగోలు చేసింది. దీని ఖరీదు రూ.30.50 లక్షలు వరకు ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు నెటిజన్స్ , ఇటు సినీ సెలబ్రిటీలు ఆకాంక్ష శర్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆకాంక్ష శర్మకు సంబంధించిన లగ్జరీ కారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఎలక్ట్రిక్ SVC, XEV 9EV కార్ ఫీచర్స్..
ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. మహేంద్ర కంపెనీకి చెందిన XEV 9EV అనేది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ చార్జర్, మనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇది ఒక ఎలక్ట్రిక్ SUV కార్. కనెక్ట్ చేయబడిన కారు టెక్, క్రూయిజ్ కంట్రోల్ తో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం కూడా కలిగి ఉంది. 542 కిలోమీటర్ల పరిధితో 59kWh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాదు 140kW DC చార్జర్ తో 20 నిమిషాలలోనే ఫుల్ చార్జింగ్ అవుతుంది.
ALSO READ:Mrunal Thakur: జాన్వీ కపూర్ పై మృనాల్ షాకింగ్ కామెంట్.. ఎందుకు ఈ వివక్షత అంటూ ఫైర్!