Raja Saab:ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ సినిమాకి మైనస్ గా మారుతున్నాయి. భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు సంబంధించి కొన్ని వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం కారణంగా సినిమాకి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. అటు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. అలా భారీ బడ్జెట్ లు పెట్టి సినిమా షూటింగ్ లు చేస్తున్న మూవీ మేకర్స్ కి అప్పుడప్పుడు షాక్ తగులుతూ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో కొంతమంది ఆకతాయిలు ఆ హీరోల ఫోటోలు లీక్ చేయడంతో సినిమాకి నష్టం ఏర్పడుతుంది. ఇక తాజాగా మారుతి డైరెక్షన్లో పీపుల్స్ మీడియా బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ నుండి కూడా ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయింది.
ది రాజాసాబ్ నుండి మరో ఫోటో లీక్..
ఆ ఫోటో అంత క్లారిటీగా లేకపోయినప్పటికీ ప్రభాస్ ఆ ఫోటోలో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రభాస్ (Prabhas)హీరోగా చేస్తున్న ది రాజాసాబ్ మూవీ హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో హార్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇలాంటి జానర్ లోనే మారుతి.. ప్రభాస్ తో ఈ సినిమాని తీస్తున్నారు. అలా రాజా సాబ్ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ది రాజా సాబ్ మూవీ ఏప్రిల్ లో విడుదల కాబోతుందని అఫీషియల్ గా మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ సడన్ గా సినిమాని వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వాయిదాకి కారణం బడ్జెట్ లేకపోవడమే అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఆ వార్తలు అవాస్తవాలని కొట్టి పారేస్తున్నారు. వి ఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో సినిమా షూటింగ్ స్లోగా జరుగుతుందట. కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాము అంటూ మూవీ మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
ది రాజా సాబ్ సినిమా విశేషాలు..
అంతేకాదు సినిమా విడుదల తేదీ గురించి కూడా గుడ్ న్యూస్ చెప్పారు.ఈ సినిమా అన్ని పనులు పూర్తయితే దసరా తర్వాత రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలియజేశారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan) ,నిధి అగర్వాల్(Nidhi Agarwal) , రిద్ధి కుమార్ (Riddhi kumar) లు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో చేస్తున్నారు. ఇక తాజాగా ది రాజా సాబ్ మూవీ నుండి ప్రభాస్ మాస్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు ఆయన ఫోటో చూసి తెగ సంబరపడిపోతున్నారు. మళ్లీ మిర్చి లోని ప్రభాస్ లుక్ ని చూడబోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ:Tollywood: లగ్జరీ కారు కొనుగోలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ధర, ఫీచర్స్ తెలిస్తే గుండె గుబేల్!
?utm_source=ig_web_copy_link