Heist Action Movie OTT : ఒక గ్యాంగ్ కలిసి కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేస్తారు. ప్లాన్ పక్కాగా ఉంటుంది… ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా ఉండదు. కానీ దోపిడీ సక్సెస్ అయిన తర్వాత సొంత మనిషే వెన్నుపోటు పొడిస్తే ? డబ్బుతో పాటు తన ఫ్రెండ్ ను కూడా కోల్పోయిన ఆ గ్యాంగ్ ఊరుకుంటుందా ? అసలు తమ దగ్గర నుంచి కొట్టేసిన బంగారాన్ని తిరిగి ఎలా కొట్టేయాలో ప్లాన్ చేస్తే ? ఈ గేమ్ లో కార్ చేజింగ్స్, హైటెక్ ప్లాన్స్, మోసం, రివేంజ్ అన్నీ కలిపి అదిరిపోయే హీస్ట్ యాక్షన్ క్రైమ్ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఆ మూవీ పేరే ‘The Italian Job’. మరి హీస్ట్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే..,
చార్లీ క్రోకర్ ఒక ప్రొఫెషనల్ దొంగ. అతడి టీమ్ లో ఒక్కొక్కరికీ ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. సేఫ్ లను ఓపెన్ చేయడంలో దిట్ట అయిన స్టెల్లా, కార్లను నడపడంలో తోపు అయిన హ్యాండ్సమ్ రాబ్, టెక్నాలజీని తన గుప్పిట్లో పెట్టుకున్న లైల్, ఇంకా లెఫ్ట్ ఇయర్… ఇలా అందరూ కలిసి ఒక భారీ దోపిడీకి ప్లాన్ చేస్తారు.
వాళ్ల టార్గెట్ డబ్బు కాదు, భారీ మొత్తంలో బంగారం కొట్టేయడం. ప్లాన్ ప్రకారం వెనిస్ లో దొంగతనం చేసి బంగారాన్ని సొంతం చేసుకుంటారు. ఆ ఆపరేషన్ కూడా దాదాపుగా పర్ఫెక్ట్ గా సాగుతుంది. కానీ వాళ్లు ఊహించని సమస్య అక్కడే మొదలవుతుంది. టీమ్ లో ఉన్న స్టీవ్ వాళ్లను మోసం చేస్తాడు. బంగారాన్ని మొత్తం తన దగ్గర పెట్టుకుని, చార్లీ టీమ్ ను చావుకు వదిలేస్తాడు.
ఇక్కడి నుంచి సినిమా మలుపు తిరుగుతుంది. చార్లీ తన టీమ్ తో కలిసి స్టీవ్ పై రివేంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అంతేకాదు అతడు కొట్టేసిన బంగారాన్ని తిరిగి కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ఇందుకోసం స్టెల్లాను కూడా తమ టీమ్ లోకి తీసుకుంటారు. ఆమె సేఫ్ క్రాకింగ్ స్కిల్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారతాయి. కానీ ఒకసారి దొంగతనం చేసిన వాళ్లు మళ్లీ అదే బంగారాన్ని దొంగిలించడానికి బయలుదేరితే పరిస్థితి ఎంత టఫ్‌గా ఉంటుందో ఊహించండి.
ఒక్కో ప్లాన్ కు కౌంటర్ ప్లాన్, పోలీసులకు దొరకకుండా వేసే ఎత్తులు, ట్రాఫిక్ మధ్య జరిగే మినీ కూపర్ కార్ చేజ్ లు సినిమాలో మంచి హైలైట్. ముఖ్యంగా చిన్న కార్లను ఉపయోగించి భారీ యాక్షన్ చేయడం ఈ సినిమాకు ప్రత్యేకమైన స్టైల్ తెచ్చింది. ఇది కేవలం దోపిడీ సినిమా కాదు. సొంత టీమ్‌ను మోసం చేసిన వ్యక్తికి ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో చూపించే రివేంజ్ హీస్ట్ మూవీ. మరి చివరికి ఆ బంగారాన్ని ఎలా కొట్టేశారు ? అన్నది తెలుసుకోవాలని ఉంటే ఈ మూవీని చూడాల్సిందే.
Also Read : ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్
‘ది ఇటాలియన్ జాబ్’ మూవీ 2003లో విడుదలైంది. దీనికి F. Gary Gray దర్శకత్వం వహించారు. Mark Wahlberg చార్లీ క్రోకర్‌గా, Charlize Theron స్టెల్లా బ్రిడ్జర్‌గా, Jason Statham హ్యాండ్సమ్ రాబ్‌గా, Edward Norton స్టీవ్‌గా, Seth Green లైల్‌గా, Donald Sutherland జాన్ బ్రిడ్జర్‌గా నటించారు. ప్రస్తుతం ఇండియాలో ఈ సినిమా JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఓటీటీలో తెలుగుతో పాటు ఇంగ్షీషు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.