E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ మృతి!

ఇండస్ట్రీలో విషాదం.. ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ మృతి!
Advertisement

Aggipette macha Kiran:చిత్ర సీమలో ఈ మధ్యకాలంలో తరచూ విషాద వార్తలు అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.. మొన్నటికి ఉన్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఇక నిన్న మలయాళం ప్రొడ్యూసర్ 63 సంవత్సరాలు వయసులో తుది శ్వాస విడిచారు. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా తనదైన స్టైల్ లో నవ్వులు పంచిన ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మృతి చెందారు.

వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ అగ్గిపెట్టే మచ్చ కిరణ్ మృతి.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత ఐదు రోజుల క్రితం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ లో చేరారు. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ప్రాణాలు వదిలినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనదైన కామెడీ డైలాగ్ తో స్వాగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ కిరణ్ ఇక లేరు అనే వార్త అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది.. పలువురు యూట్యూబర్స్ , బుల్లితెర ప్రముఖులు, అభిమానులు ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు..

Advertisement

అగ్గిపెట్టె మచ్చ అనే ఒక ప్రత్యేకమైన పేరుతో సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు కిరణ్ కుమార్ మాట్లాడే తీరు, ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, విలక్షణమైన హావ భావాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈయన చేసే చిన్న చిన్న వీడియోలు, రీల్స్ ఇట్టే వైరల్ అయ్యేవి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈయనకున్న పాపులారిటీ కారణంగా పలు యూట్యూబ్ ఛానల్స్, కంటెంట్ క్రియేటర్లు ఈయనతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకొచ్చారు.

ALSO READ: నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా సందడి..

Advertisement

ఇకపోతే సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపును ఆయన టీవీ రంగంలో కూడా ఉపయోగించుకున్నారు. అలా బుల్లితెరపై ప్రేక్షకులను.. కామెడీ షోలు జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా పెర్ఫార్మెన్స్ చేసి నవ్వించారు. తనదైన యాస , జోకులతో కడుపుబ్బా నవ్వించిన కిరణ్ కామెడీ స్కిట్లు, పంచ్ డైలాగ్ లు యువతలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఇక అలాంటి ఈయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న శివకుమార్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్.. వైద్యులు ఏమన్నారంటే?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్టులు పాస్ అవ్వాల్సిందేనా?

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

Gundeninda GudiGantalu Today episode: తాయత్తు ఎంతపని చేసింది..? ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : మహా, విక్కీ లవ్ ట్రాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పై సెటైర్లు.. ఇదే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..? ఇంట్లోంచి వల్లి వెళ్ళిపోతుందా..?

Big Stories

Advertisement
×