E-Paper
Advertisement

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్… వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్…  వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్
Advertisement

Fantasy Adventure Movie OTT : స్కూల్లో సాధారణంగా కనిపించే ఓ 12 ఏళ్ల బాలుడి చేతికి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పురాణ ఖడ్గం వస్తే… అతని జీవితం ఒక్కరోజులో మారిపోతుంది. ఆ కత్తి చేతికి వచ్చిన వెంటనే పాతకాలపు శత్రువులు కూడా మేల్కొంటారు. ఇక తన క్లాస్‌మేట్స్‌ తో కలిసి ఓ రాక్షస శక్తిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆ బాలుడిపై పడుతుంది. కింగ్ ఆర్థర్ కథను ఆధునిక స్కూల్ లైఫ్‌తో కలిపి తెరకెక్కించిన ఫ్యామిలీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ది కిడ్ హూ వుడ్ బీ కింగ్’ (The Kid Who Would Be King). మరి పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడగలిగే ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అలెక్స్ లండన్‌ లో చదువుకునే 12 ఏళ్ల బాలుడు. స్కూల్లో అతనికి పెద్దగా గుర్తింపు ఉండదు. అతని బెస్ట్ ఫ్రెండ్ బెడ్డర్స్ కూడా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకరోజు కొంతమంది పెద్ద పిల్లల నుంచి తప్పించుకునే క్రమంలో అలెక్స్ ఓ నిర్మాణ ప్రదేశంలోకి వెళ్తాడు. అక్కడ అతని కంటికి ఓ విచిత్రమైన కత్తి కనిపిస్తుంది. రాయిలో ఇరుక్కున్న ఆ ఖడ్గాన్ని ఎవరూ కదిలించలేరు. కానీ అలెక్స్ మాత్రం దాన్ని బయటకు తీస్తాడు. ఆ కత్తి సాధారణ ఆయుధం కాదని.. కింగ్ ఆర్థర్‌కు చెందిన ఎక్స్కాలిబర్ అని తర్వాత తెలుస్తుంది.

Advertisement

అలెక్స్ చేతిలో ఎక్స్కాలిబర్ రావడంతో పురాతన మాయాజాలం మళ్లీ కదలడం మొదలవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా నిద్రిస్తున్న మోర్గానా అనే శక్తివంతమైన మాంత్రికురాలు తిరిగి ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను అడ్డుకోవాలంటే అలెక్స్‌ కు తన దగ్గర ఉన్న కత్తి మాత్రమే సరిపోదు. అతనికి మార్గనిర్దేశం చేసేందుకు మెర్లిన్ వస్తాడు. అతను ఒకే రూపంలో కనిపించడు. వయసు మారినట్టుగా కనిపిస్తూ అలెక్స్‌ కు మాయాజాలం గురించి చెబుతాడు. మోర్గానా శక్తివంతం కాకముందే ఆమెను అడ్డుకోవాలని హెచ్చరిస్తాడు. అలెక్స్‌ కు ఇప్పుడు సైన్యం అవసరం.

అందుకే తనతో ఎప్పుడూ ఉండే బెడ్డర్స్‌ తో పాటు తనను ఇబ్బంది పెట్టే లాన్స్, కేలను కూడా తన టీమ్‌లోకి తీసుకుంటాడు. స్కూల్లో ఒకరితో ఒకరు గొడవపడే పిల్లలే ఇప్పుడు కలిసి ఓ రహస్య యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. మోర్గానా శక్తి పెరుగుతున్న కొద్దీ అలెక్స్‌కి తనలోని నాయకత్వ లక్షణాలను బయటకు తీయాల్సి వస్తుంది. ఎక్స్కాలిబర్‌ను పట్టుకోవడం ఒక విషయం.. దానికి తగ్గ బాధ్యతను మోయడం మరో విషయం. తన స్నేహితులను కాపాడుకుంటూ శత్రువును ఎదుర్కోవాల్సిన పరిస్థితి అతన్ని చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అలెక్స్ నిజంగా ఆ ఖడ్గానికి అర్హుడేనా ? మోర్గానాను ఈ పిల్లల టీమ్ అడ్డుకోగలదా ? లాన్స్, కేలు నిజంగా అలెక్స్‌ కు నమ్మకమైన నైట్స్‌ గా మారతారా ? స్కూల్ నుంచి మొదలైన ఈ అడ్వెంచర్ చివరకు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్

ఓటీటీలో తెలుగులో ఉందా?

‘ది కిడ్ హూ వుడ్ బీ కింగ్’ 2019లో వచ్చిన ఫ్యామిలీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ. లూయిస్ యాష్‌బోర్న్ సెర్కిస్ (Louis Ashbourne Serkis), రెబెక్కా ఫెర్గుసన్ (Rebecca Ferguson), పాట్రిక్ స్టీవర్ట్ (Patrick Stewart) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇంగ్షీషు మూవీకి Amazon Prime Videoలో ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు.

Related News

పిన్ ను తాకితే ఫ్యూచర్ వరల్డ్ లోకి… పాప సాహసం చూస్తే సైలెంట్ గా ఉండలేరు… క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ

ప్రపంచం అంతమైనా తగ్గని ట్రబుల్స్… మంచు ప్రపంచంలో బిక్కుబిక్కుమంటూ… చలిజ్వరం తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్

బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్

పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్

భార్యాభర్తల వందల కోట్ల యుద్ధం… 8 ఎపిసోడ్ల ఇగో వార్… ఇంటెన్స్ లీగల్ డ్రామా

Big Stories

Advertisement
×