E-Paper
Advertisement

ప్రపంచం అంతమైనా తగ్గని ట్రబుల్స్… మంచు ప్రపంచంలో బిక్కుబిక్కుమంటూ… చలిజ్వరం తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

ప్రపంచం అంతమైనా తగ్గని ట్రబుల్స్… మంచు ప్రపంచంలో బిక్కుబిక్కుమంటూ… చలిజ్వరం తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Post-Apocalyptic Movie OTT : ప్రపంచం అంతమైపోయిన తర్వాత కూడా మనిషికి ప్రశాంతంగా బతికే అవకాశం దొరకకపోతే… ఐదేళ్లు భూగర్భ బంకర్‌ లో గడిపిన కుటుంబం… అక్కడ కూడా ప్రమాదం మొదలవడంతో మళ్లీ బయట ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. బయట మంచు మాత్రమే కాదు… ఆకలి, రేడియేషన్, విధ్వంసం, తెలియని మనుషుల నుంచి ప్రమాదం ఎదురవుతుంది. మానవ నాగరికత శిథిలాల మధ్య కొత్త ఇంటి కోసం ఓ కుటుంబం చేసే ప్రాణాంతక ప్రయాణమే ‘గ్రీన్‌ల్యాండ్ మైగ్రేషన్’ (Greenland 2 Migration). మరి ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

భూమిని క్లార్క్ అనే భారీ ఉల్క ఢీకొట్టిన తర్వాత ప్రపంచం దాదాపుగా నాశనమవుతుంది. ఆ విపత్తు నుంచి బయటపడిన జాన్ గ్యారిటీ, అలిసన్ గ్యారిటీ, వారి కుమారుడు నాథన్ గ్రీన్‌ ల్యాండ్‌ లోని భూగర్భ బంకర్‌ లో ఆశ్రయం పొందుతారు. బయట పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని భావించి అక్కడే సంవత్సరాలు గడుపుతారు. ఐదేళ్లు బంకర్‌ లో గడిచిన తర్వాత బయట ప్రపంచం కొంత మెరుగుపడుతుందని ఆశిస్తారు. కానీ వారి సురక్షిత ప్రదేశం కూడా శాశ్వత రక్షణ కాదని తెలుస్తుంది. భూకంపాలు, నిర్మాణపరమైన నష్టాలు, వనరుల కొరత కారణంగా బంకర్‌లో ఉండటం కూడా ప్రమాదకరంగా మారుతుంది.

Advertisement

చివరకు కుటుంబం బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయట అడుగు పెట్టగానే మరో ప్రపంచం కనిపిస్తుంది. గతంలో మనకు తెలిసిన నగరాలు శిథిలాలుగా మారిపోయాయి. మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో ప్రయాణించడం కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కుటుంబం యూరప్ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అక్కడ మానవులు మళ్లీ కొత్త సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉందనే సమాచారం వారికి ఆశను కలిగిస్తుంది. కానీ ఆ ప్రయాణంలో ప్రతి దశలో కొత్త ప్రమాదం ఎదురవుతుంది. ప్రకృతి విపత్తులతో పాటు ప్రాణాల కోసం పోరాడుతున్న ఇతర గుంపులు కూడా వారిని వెంటాడుతుంటాయి. జాన్ కుటుంబాన్ని కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలు పరిస్థితిని మరింత కష్టంగా మారుస్తాయి.

ఒకప్పుడు సురక్షితంగా ఉన్న ప్రపంచం ఇప్పుడు శిథిలమైపోయింది. అయినా తమ పిల్లల కోసం కొత్త జీవితం మొదలు పెట్టాలనే ఆశతో జాన్, అలిసన్ ముందుకు సాగుతారు. మంచు మధ్య ప్రయాణం ఎంత దూరం సాగుతుందో… వాళ్లకు ఎదురయ్యే ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతాయి. గ్యారిటీ కుటుంబం నిజంగా సురక్షితమైన ప్రాంతానికి చేరుకుంటుందా ? వాళ్లు వెతుకుతున్న కొత్త నివాసం నిజంగానే ఉందా ? ప్రపంచం నాశనమైన తర్వాత మనుషులు మళ్లీ నాగరికతను నిర్మించుకోగలరా ? ప్రాణాల కోసం సాగించే ఈ ప్రయాణమే ‘గ్రీన్‌ల్యాండ్ మైగ్రేషన్’లో చూడాల్సిన ఉత్కంఠభరితమైన కథ.

Advertisement

Also Read : ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

తెలుగులో ఉందా ?

‘గ్రీన్‌ల్యాండ్ 2 మైగ్రేషన్’ Airtel Xstream Playలో అందుబాటులో ఉంది. దీనికి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. జెరార్డ్ బట్లర్ (Gerard Butler), మొరెనా బాకరిన్ (Morena Baccarin), రోమన్ గ్రిఫిన్ డేవిస్ (Roman Griffin Davis), అంబర్ రోజ్ రేవా (Amber Rose Revah) తదితరులు నటించిన ఈ చిత్రానికి రిక్ రోమన్ వాగ్ (Ric Roman Waugh) దర్శకత్వం వహించారు. 2020లో వచ్చిన సూపర్ హిట్ డిజాస్టర్ మూవీ ‘గ్రీన్‌ల్యాండ్’ కు ఇది సీక్వెల్.

Related News

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్… వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్

పగటిపూట ప్రెసిడెంట్… రాత్రి వేళ సీక్రెట్ వేట… మెంటలెక్కించే హర్రర్ థ్రిల్లర్

బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్

పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్

భార్యాభర్తల వందల కోట్ల యుద్ధం… 8 ఎపిసోడ్ల ఇగో వార్… ఇంటెన్స్ లీగల్ డ్రామా

ఒకే రూమ్‌లో క్రష్‌తో సీక్రెట్ లైఫ్… చెప్పుకోలేని ప్రేమతో హీరో తిప్పలు… నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ల్యాండింగ్

Big Stories

Advertisement
×