Action Horror Movie OTT : చరిత్రలో అమెరికా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అబ్రహం లింకన్ కు మరో రహస్య జీవితం ఉంటే ఎలా ఉంటుంది ? పగటిపూట సాధారణ జీవితాన్ని గడుపుతూ… రాత్రిళ్లు గొడ్డలి చేత పట్టుకుని రక్తపిశాచులను వేటాడే యోధుడిగా మారితే ? చిన్నతనంలో తన తల్లిని కోల్పోయిన ఓ బాలుడి వ్యక్తిగత ప్రతీకారం క్రమంగా వాంపైర్లపై జరిగే పెద్ద యుద్ధంగా మారుతుంది. చరిత్రను డార్క్ ఫాంటసీగా మార్చిన యాక్షన్ హారర్ మూవీ ‘అబ్రహం లింకన్ వాంపైర్ హంటర్’ (Abraham Lincoln Vampire Hunter). మరి హర్రర్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
అబ్రహం లింకన్ చిన్నతనంలోనే తన తల్లి నాన్సీ లింకన్ ను కోల్పోతాడు. ఆమె మరణానికి అసలు కారణం తెలుసుకున్నప్పుడు లింకన్ జీవితమే మారిపోతుంది. ఆమెను చంపింది సాధారణ వ్యక్తి కాదని… ఓ వాంపైర్ అని అతనికి తెలుస్తుంది. ఆ సంఘటన అతని మనసులో చెరిగిపోని ముద్ర వేస్తుంది. తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న లింకన్ కు హెన్రీ స్టర్గెస్ అనే మిస్టీరియస్ వ్యక్తి ఎదురవుతాడు. అతను లింకన్ కు వాంపైర్లను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తాడు. అప్పటి నుంచి లింకన్ రాత్రి వేళల్లో రహస్యంగా వాంపైర్లను వేటాడటం ప్రారంభిస్తాడు.
అతని ప్రధాన ఆయుధం ఓ ప్రత్యేకమైన గొడ్డలి. మొదట తన తల్లి మరణానికి కారణమైన వాంపైర్ ను వెతుకుతున్న లింకన్… క్రమంగా ఈ జీవులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలుసుకుంటాడు. వారి వెనుక ఓ వ్యవస్థ ఉందని, అమెరికాలో జరుగుతున్న కొన్ని కీలక సంఘటనలతో వారి సంబంధం ఉందని గ్రహిస్తాడు. ఇదే సమయంలో లింకన్ రాజకీయ జీవితంలోకి అడుగు పెడతాడు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో నాయకుడిగా ఎదుగుతాడు. పగటిపూట రాజకీయ నాయకుడిగా, రాత్రిళ్లు వాంపైర్ హంటర్ గా రెండు జీవితాలను నడపాల్సి వస్తుంది. దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కూడా ఈ రహస్య యుద్ధంతో ముడిపడుతుంది.
లింకన్ ను నమ్మిన వాళ్లకు అతని రహస్య జీవితం తెలియదు. అతను ఎవరిని వేటాడుతున్నాడో కూడా చాలా మందికి అర్థం కాదు. తన వ్యక్తిగత ప్రతీకారం కంటే పెద్ద ప్రమాదం దేశం మీదకు వస్తోందని తెలుసుకున్న తర్వాత అతని పోరాటం మరింత తీవ్రమవుతుంది. తన తల్లి మరణానికి కారణమైన వాంపైర్ ను లింకన్ ఎదుర్కోగలడా ? వాంపైర్లు అమెరికాపై ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు ? అధ్యక్షుడిగా ఎదుగుతున్న లింకన్ తన రహస్య యుద్ధాన్ని ఎంతకాలం దాచగలడు ? అనే ప్రశ్నలకు చరిత్రకు పూర్తిగా భిన్నమైన ఈ ఫాంటసీ వెర్షన్ లో సమాధానాలు దొరుకుతాయి.
Also Read : బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ
‘అబ్రహం లింకన్ వాంపైర్ హంటర్’ 2012లో విడుదలైన ఇంగ్లీష్ యాక్షన్ హారర్ మూవీ. బెంజమిన్ వాకర్ (Benjamin Walker), డొమినిక్ కూపర్ (Dominic Cooper), ఆంథనీ మాకీ (Anthony Mackie) నటించారు. తైమూర్ బెక్మాంబెటోవ్ (Timur Bekmambetov) దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలలో రెంట్‌కు ఇంగ్షీషులోనే అందుబాటులో ఉంది.