Under-16 : ఈ మధ్య కాలంలో క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎవ్వరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారో చెప్పడం కష్టం అనే చెప్పాలి. ఇటీవల ఐపీఎల్ లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి టీమింఇయా క్రికెటర్ల రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అండర్ -16 కుర్రాడు కూడా విజృంభించాడు. వన్డే క్రికెట్ లో ముఖ్యంగా 160 బంతుల్లో 486 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ బ్యాట్స్ మెన్ తన ఇన్నింగ్స్ లో 46 ఫోర్లు, 23 సిక్స్ లు బాదాడు. సాధారణంగా వన్డే క్రికెట్ లో 486 పరుగులు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఏ బ్యాట్స్ మెన్ కు అయినా సాధ్యం కాదనే చెప్పాలి. కానీ ఈ కుర్రాడు సాధించాడు.. ఇతను చాలా గ్రేట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read : Lalit Modi – Yuvraj : యువరాజ్ సింగ్ 6 సిక్స్ ల వెనుక లలిత్ మోడీ కుట్రలు.. ఇలా కూడా డబ్బు సంపాదించాడుగా!
అండర్ – 16 క్రికెటర్ సంకృత్ శ్రీరామ్ అనే యువ క్రికెటర్ అత్యంత అద్భుతాన్ని సృస్టించాడు. కేవలం ఒకే ఒక్క వన్డే మ్యాచ్ లోనే సింగిల్ బ్యాట్స్ మెన్ 160 బంతుల్లో 486 పరుగులు చేశాడని చెప్పుకోవడానికే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇంతకు ఈ క్రికెటర్ మరెవ్వరో కాదండోయ్.. బెంగళూరు కి చెందిన యువ క్రికెటర్ మరెవ్వరికీ సాధ్యం కానీ అరుదైన.. అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. 2014లో నీలగిరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఊటీలో అండర్ -16 అజర్ హసన్ మెమోరియల్ ఇంటర్ స్కూల్ లిమిటేడ్ ఓవర్ క్రికెట్ టోర్నీ నిర్వహించింది. ఇందులో ఊటీలోని జేఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి సంకృత్ శ్రీరామ్ 40 ఓవర్ల వన్డే మ్యాచ్ లో ఈ అరుదైన ఘనత సాధించాడు. వాస్తవానికి ఇలాంటి క్రికెటర్లను త్వరలోనే అండర్-19, ఐపీఎల్, టీమిండియాలోకి తీసుకురావాలని కొందరూ పేర్కొంటున్నారు. యువ క్రికెటర్ సంకృత్ శ్రీరామ్ కి ధనుష్ ప్రియాన్ అద్భుతమైన సహాకారాన్ని అందించాడు.
ఈ ఓపెనింగ్ జంట 605 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు విజయం నల్లేరు పై నడకలా అయింది. హెబ్రాల్ స్కూల్ 15 ఓవర్లలో కేవలం 42 పరుగులు మాత్రమే చేసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్ లో శ్రీరామ్ దెబ్బకి జేఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 563 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం విశేషం. ఇలా అద్భుతమైన క్రికెట్ ఆడేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వారు నిలదొక్కుకుంటే ముందు ముందు మరిన్నీ విజయాలను సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. ఇలాంటి ఆటగాళ్లు టీమిండియా తరపున ఆడితే అద్భుతమైన విజయాలను సాధించవచ్చు. కేవలం ఒక్క సెంచరీ, రెండు సెంచరీలు అంటేనే గొప్ప అనుకుంటారు. కానీ ఏకంగా 4 సెంచరీలు చేసి అద్భుతం సృష్టించాడు. ఇవాళ్టీ నుంచి ఎవ్వరైనా క్రికెట్ భారీ స్కోర్ అంటే అతని గురించి ప్రతీ ఒక్కరూ చెప్పుకోవడం ఖాయం. అండర్ -16 ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం సాధారణ విషయం కాదనే చెప్పవచ్చు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పినా తొలుత ఆశ్చర్యపోతారు. ఆ తరువాత వామ్మో అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సంకృత్ శ్రీరామ్ కి ప్రతీ ఒక్కరూ హ్యాట్సాప్ చెప్పాల్సిందే.