E-Paper
Advertisement

62 ఏళ్ల చరిత్రకు ముగింపు… కార్గిల్‌లో శత్రువులకు చుక్కలు చూపించిన ఆ విమానం కథ ఇదే

62 ఏళ్ల చరిత్రకు ముగింపు… కార్గిల్‌లో శత్రువులకు చుక్కలు చూపించిన ఆ విమానం కథ ఇదే
Advertisement

The Last Salute OTT : భారత్ ఆకాశాన్ని ఏకంగా 62 ఏళ్ల పాటు కాపాడిన ఓ యుద్ధ విమానం… ఎన్నో యుద్ధాలు, వేలాది మిషన్లు, ఎంతోమంది పైలట్ల సాహసాలకు సాక్ష్యంగా నిలిచిన ఓ ఫైటర్ జెట్… చివరకు సేవల నుంచి రిటైర్ అయితే ? ఆ విమానంతో అనుబంధం ఉన్న పైలట్లు ఏం చేస్తారు ? కార్గిల్ యుద్ధంలో మిగ్-21 పోషించిన పాత్ర ఏంటి ? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను, భావోద్వేగ అనుభవాలను కలిపి రూపొందించిన హిందీ డాక్యుమెంటరీ ‘ది లాస్ట్ సెల్యూట్: ఎ లవ్ లెటర్ టు మిగ్-21’ (The Last Salute 2026 Movie) తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మరి మిగ్-21 ప్రస్థానం ఎలా సాగింది ? ఏ ఓటీటీలో ఈ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

భారత వైమానిక దళంలో 62 ఏళ్ల పాటు సేవలందించిన మిగ్-21 కేవలం ఓ ఫైటర్ జెట్ కాదు. ఎన్నో తరాల పైలట్లకు అది ఓ స్నేహితుడిలా మారిపోయింది. భారత ఆకాశ రక్షణలో కీలక పాత్ర పోషించిన ఈ సూపర్సోనిక్ విమానం ప్రయాణాన్ని ‘ది లాస్ట్ సెల్యూట్’ డాక్యుమెంటరీగా ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా మిగ్-21ను నడిపిన పైలట్ల అనుభవాలే ఈ కథకు అసలైన బలం. ఆకాశంలో ఎదురైన ప్రమాదాలు, కష్టమైన మిషన్లు, యుద్ధ సమయాల్లో తీసుకున్న నిర్ణయాలు, విమానంతో ఏర్పడిన భావోద్వేగ అనుబంధాన్ని రియల్ ఎయిర్ వారియర్స్ స్వయంగా పంచుకుంటారు.

Advertisement

ఇక కార్గిల్ యుద్ధం సమయంలో మిగ్-21 చేసిన సాహసాలను కూడా డాక్యుమెంటరీ ప్రత్యేకంగా చూపిస్తుంది. గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ మిగ్-21లతో నిర్వహించిన ఆపరేషన్లు, శత్రు స్థావరాలపై దాడులు, పైలట్లు ఎదుర్కొన్న సవాళ్లు కథలో కీలకంగా ఉంటాయి. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్తో పాటు వివిధ తరాలకు చెందిన ఫైటర్ పైలట్లు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల ఇది సాధారణ చరిత్ర పాఠంలా కాకుండా, నిజమైన యుద్ధ అనుభవాలను దగ్గరగా చూపించే డాక్యుమెంటరీ.

అంతేకాదు ఇప్పటివరకు పెద్దగా చూడని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజువల్స్, మిగ్-21 గాల్లో చేసిన విన్యాసాలు, దేశ రక్షణ కోసం పైలట్లు చేసిన త్యాగాలను కూడా ఇందులో చూపించారు. శరద్ కేల్కర్ వాయిస్ ఈ ప్రయాణాన్ని మరింత ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకెళ్తుంది. మిగ్-21 చివరకు వీడ్కోలు తీసుకున్నప్పటికీ, దానితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి. అందుకే ఈ డాక్యుమెంటరీ ఒక యుద్ధ విమానం చరిత్ర కాదు, దాన్ని నడిపిన వీరులకు, ఆ విమానంతో ఉన్న అనుబంధానికి ఇచ్చిన చివరి సెల్యూట్‌లా అనిపిస్తుంది.

Advertisement

Also Read : బాట్‌మ్యాన్‌కే భయంకరమైన రాత్రి… నిద్ర లేకుండా చేసే విలన్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

ఏ ఓటీటీలో చూడాలి ?

కుశాల్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సుమారు 1 గంట 22 నిమిషాల నిడివి ఉంటుంది. ఆగస్టు 26 నుంచి Netflixలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. మిగ్-21 చరిత్ర, కార్గిల్ యుద్ధ విశేషాలు, రియల్ పైలట్ల అనుభవాలు తెలుసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్. అయితే తెలుగు ఆడియో లేదా తెలుగు సబ్‌టైటిల్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు. హిందీ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి.

 

Tags

Related News

ఆఫీసులో ఆరేళ్లు ప్రేమ… కట్ చేస్తే కార్పొరేట్ ప్రపంచం నుండి దూరంగా… ఫీల్ గుడ్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ డ్రామా

కలగా భావించిన వేడుకే సమస్యగా మారితే… కజిన్ చేసిన పనికి ఊరంతా షాక్

బాట్‌మ్యాన్‌కే భయంకరమైన రాత్రి… నిద్ర లేకుండా చేసే విలన్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

సంగీతం కోసం ఇంట్లోనే రచ్చ..‘జగమే సంగీతం’ట్రైలర్ చూశారా ?

ఇదేం ఖర్మరా బాబు… షార్క్స్ ఒకవైపు… మాఫియా మరోవైపు… సీట్ ఎడ్జ్ అండర్ వాటర్ సర్వైవల్ థ్రిల్లర్

కాస్ట్యూమ్ కోసం వెళ్తే ఎర్రటి ఆకారం ఎంట్రీ… పాప్ స్టార్ ను పరుగులు పెట్టించే హర్రర్ స్టోరీ

ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి 12 టైటిల్స్ వరకు… UConn బాస్కెట్‌బాల్ సామ్రాజ్యంగా ఎలా మారింది?

Big Stories

Advertisement
×