E-Paper
Advertisement

ధురంధర్ రికార్డ్స్ బ్రేక్ చేసిన టాక్సిక్!

ధురంధర్ రికార్డ్స్ బ్రేక్ చేసిన టాక్సిక్!
Advertisement

Toxic Movie: ప్రముఖ మాలీవుడ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో కే.జీ.ఎఫ్ 1&2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం టాక్సిక్. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా, తారా సుతారియా (Tara sutharia) ,హుమా ఖురేషి (Huma Qureshi), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), నయనతార(Nayanthara ) తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ధురంధర్ 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ముఖ్యంగా ప్రీ సేల్ బుకింగ్స్ లో సత్తా చాటుతూ సరికొత్త రికార్డులు నెలకొనింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ధురంధర్ రికార్డ్స్ బ్రేక్ చేసిన టాక్సిక్..

పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన టాక్సిక్ సినిమా ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా ప్రీసేల్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. దీంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 ను బీట్ చేసింది. ధురంధర్ 2 ప్రీ సేల్ లో 14 లక్షల టికెట్లు అమ్ముడు కాగా.. టాక్సిక్ 16 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయి. ఈ భారీ ఓపెనింగ్ తో మొదటి రోజు అలవోకగా రూ.100 కోట్లు సాధించవచ్చని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

రూ.100 కోట్లు రాబడుతుందా?

Advertisement

లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు.. ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు, సిబ్బంది ఎన్నో ఏళ్లపాటు ప్రేమతో అడుగడుగునా కష్టపడి నిర్మించిన ఒక అద్భుతమైన ప్రపంచం. ఈ చిత్రాన్ని థియేటర్లలో బిగ్ స్క్రీన్ పై అందరితో కలిసి వీక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాము. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు సన్నివేశాలను మీ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో దయచేసి పోస్ట్ చేయవద్దు. సినిమా కథను, ట్విస్ట్ లను బయటకు చెప్పవద్దు” అంటూ టాక్సిక్ టీం కూడా విజ్ఞప్తి చేసింది. ఇకపోతే నేడు ఈ సినిమా విడుదల అయింది. ఒకవైపు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో మొదటి రోజు ప్రీ సేల్ కారణంగా రూ.100 కోట్లు రాబట్టినా.. నెగటివ్ టాక్ కారణంగా మిగతా రోజులలో ఈ సినిమా నెట్టుకు రాగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

also read:అనసూయ తుమ్మింది.. మీరు మీరూ కొట్టుకుని చావండి

ఇరుముడి మూవీ పై టాక్సిక్ దెబ్బ..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి. ఈ సినిమాను వయసు తేడా లేకుండా ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తున్నాడు. కేవలం తక్కువ సమయంలోనే వంద కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా. వరుసగా కలెక్షన్లు కురిపిస్తున్న సమయంలో థియేటర్ ఒప్పందం ప్రకారం సినిమాను తీసివేసి, ఆ సినిమా ఆడుతున్న థియేటర్లలో టాక్సిక్ వేయాల్సి వచ్చిందని, తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలా టాక్సిక్ కోసం బాగా కలెక్షన్లు వస్తున్న ఇరుముడి సినిమాను కూడా తీసేశారు. ఇప్పుడేమో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాను కంటిన్యూ చేస్తారా ? లేక ఈ సినిమాను తొలగించి మళ్లీ కలెక్షన్లు రాబడుతున్న ఇరుముడి మూవీని ప్రదర్శిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Related News

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

Big Stories

Advertisement
×