E-Paper
Advertisement

బాట్‌మ్యాన్‌కే భయంకరమైన రాత్రి… నిద్ర లేకుండా చేసే విలన్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

బాట్‌మ్యాన్‌కే భయంకరమైన రాత్రి… నిద్ర లేకుండా చేసే విలన్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?
Advertisement

Batman Knightfall OTT: గోథమ్ సిటీలో నేరగాళ్లను అదుపులో పెట్టడం బాట్‌మ్యాన్‌కు కొత్తేమీ కాదు. కానీ ఆర్కమ్ అసైలమ్ ధ్వంసమై, అందులోని ప్రమాదకరమైన విలన్లంతా ఒక్కసారిగా వీధుల్లోకి వస్తే ? వాళ్లను ఒక్కొక్కరిగా ఎదుర్కొంటూ బాట్‌మ్యాన్ పూర్తిగా అలసిపోయేలా చేస్తే ? ఇక చివర్లో అతని ముందు బలానికి మారుపేరైన బెన్ నిలబడితే ? బాట్‌మ్యాన్ జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన పోరాటానికి తెర తీసే యానిమేటెడ్ సూపర్‌హీరో మూవీ ‘Batman Knightfall Part 1 – Knightfall’. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

గోథమ్‌లో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పుతాయి. ఆర్కమ్ అసైలమ్ ధ్వంసమైపోవడంతో అక్కడ బంధించబడిన బాట్‌ మ్యాన్ శత్రువులంతా స్వేచ్ఛగా బయటకు వస్తారు. ఒక్క విలన్‌ ను ఎదుర్కోవడం బాట్‌మ్యాన్‌కు పెద్ద విషయం కాదు. కానీ ఈసారి ఒకరి తర్వాత ఒకరు ప్రమాదకరమైన నేరస్తులు ఎదురవుతుండటంతో అతనికి విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండదు.

Advertisement

అయితే ఈ గందరగోళం వెనుక అసలు ప్లాన్ ఎవరిదో మొదట బాట్‌మ్యాన్‌కు అర్థం కాదు. అతన్ని నేరుగా ఓడించడం కంటే, ముందుగా శారీరకంగా, మానసికంగా బలహీనపరచాలనేది ఆ ప్లాన్. చివరికి ఆ వ్యూహం వెనుక ఉన్నది బెన్ అని తెలుస్తుంది. బాట్‌మ్యాన్ బలాన్ని బెన్ బాగా అర్థం చేసుకుంటాడు. అతనితో నేరుగా పోరాడితే గెలవడం అంత సులభం కాదని తెలుసుకుని, ముందుగా వరుసగా విలన్లను అతనిపైకి పంపిస్తాడు. ప్రతి పోరాటంతో బాట్‌మ్యాన్ శక్తి తగ్గిపోతుంది. అదే సమయంలో బేన్ మాత్రం సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాడు.

ఈ క్రమంలో అజ్రాయెల్ కూడా కథలో కీలకంగా ఎంట్రీ ఇస్తాడు. గోథమ్‌ను కాపాడాల్సిన బాధ్యత ఒకవైపు, తన శారీరక పరిమితులు మరోవైపు బాట్‌మ్యాన్‌కు సవాలుగా మారతాయి. అసలు బెన్ ఎందుకు బాట్‌మ్యాన్‌ను టార్గెట్ చేశాడు ? ఆర్కమ్ నుంచి విలన్లను బయటకు వదలడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి ? బాట్‌మ్యాన్ తన శక్తి మొత్తం కోల్పోయిన తర్వాత బెన్ ను ఎదుర్కోగలడా ? అనేదే ఈ కథలో చూసి తెలుసుకోవలైన అసలైన కథ.

తెలుగులో అందుబాటులో ఉందా ?

Advertisement

జెఫ్ వామెస్టర్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ యాక్షన్ మూవీకి బాట్‌మ్యాన్‌గా అన్సన్ మౌంట్, బేన్‌గా మైఖేల్ మాండో, అజ్రాయెల్‌గా పాబ్లో ష్రైబర్ వాయిస్ అందించారు. రన్‌టైమ్ సుమారు 79 నిమిషాలు. డార్క్ టోన్, బ్లడీ యాక్షన్, క్రైమ్, సూపర్‌హీరో ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా R రేటింగ్ తో విడుదలైంది. కాబట్టి ఇది పిల్లల కోసం రూపొందించిన బాట్‌మ్యాన్ కార్టూన్ కాదు. ప్రస్తుతం Prime Videoలో రెంట్ కి అవైలబుల్ గా ఉంది. ఆగస్టు 24 నుంచి Apple TVలో ఒరిజినల్ ఆడియో ఇంగ్లీష్‌ లో అందుబాటులో ఉంది. డార్క్, రా బాట్‌మ్యాన్ యాక్షన్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఛాయిస్.

Read Also: హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

Related News

గుండెను చీల్చీ చూస్తే… టీవీ ప్రత్యక్షం, ఇదెక్కడి థ్రిల్లర్ మామా… మైండ్ బెండింగ్ అనుకో!

పాడుబడిన స్కూల్ లో పారానార్మల్ సీన్స్… సైకాలజిస్ట్‌కు ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజం

టాక్సిక్ టాక్.. డిజిటల్ రైట్స్ పై భారీ ఎఫెక్ట్.. నిర్మాతల రియాక్షన్?

మనుషుల్ని చంపే పులిని పట్టుకోవడానికెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని లాక్కుని జైలుకు… తిరిగొచ్చాక వీడి ఊచకోత చూస్తే గూస్ బంప్స్

నగరాన్ని కమ్మేసే పొగమంచు… హీరోయిన్ల వరుస హత్యలు… అదృశ్య కిల్లర్ అరాచకం

ప్రాణాంతక అనారోగ్యం మధ్య పుట్టిన ప్రేమకథ… తెలుగులో ఎక్కడ చూడాలి?

విడాకుల నోటీసు ఇచ్చిన 2 రోజులకే శవమయ్యే భార్య… తెలుగులో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×