OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కి వేదికగా నిలిచింది. రకరకాల కంటెంట్తో వచ్చే సినిమాలు, వెబ్ సెరిస్ లు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చే సినిమాలను చూసి, ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. మంచి రొమాంటిక్ కిక్ ఇచ్చే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది లేయవర్‘ (The Layover). ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయిని పోటీపడి లవ్ చేస్తారు. అతడేమో వీళ్లిద్దరినీ ఒకరికి తెలీకుండా ఒకరిని వాడుకుంటాడు. అయితే వీళ్ళిద్దరికీ క్లైమాక్స్లో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఎదురవుతుంది. మసాలా సీన్స్ ఇస్టపడేవాళ్ళకి ఈ మూవీ బెస్ట్ సజెషన్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మేఘన్, కేట్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ చేస్తున్న ఉద్యోగాలు, వాళ్ల చేష్టల వల్ల పోగొట్టుకుంటారు. ఈ క్రమంలో రిలీఫ్ అవ్వడానికి టూర్ కి ప్లాన్ చేస్తారు. ఇద్దరూ కలిసి ప్లేన్ ఎక్కుతారు. అక్కడ వీళ్ళిద్దరికీ రొయాన్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతడు చాలా అందంగా ఉండటంతో వీళ్ళిద్దరూ అతన్ని లవ్ లో పడేయాలని ట్రై చేస్తారు. ఈ క్రమంలో తుఫాను ఎక్కువగా ఉండటంతో ప్లేన్ ని ఒకచోట ఆపేస్తారు. అక్కడ ఒక హోటల్ తీసుకుంటారు. కేట్, మేఘన్ అతన్ని పడేయడానికి చాలా ట్రై చేస్తారు. ఒకరిని మించి ఒకరు అందంగా తయ్యారవుతారు. అయితే మేఘన్ ని అక్కడే వుండే డ్రైవర్ ఇస్టపడుతుంటాడు. ప్లేన్ ఆలశ్యంగా వెళ్తుందని తెలియడంతో వీళ్ళు ముగ్గురూ ఆ ప్రాంతం అంతా తిరిగి చూస్తారు. రొయాన్ ఒక పెళ్లికి వెళ్లాలని వీళ్లకు చెప్తాడు. ఈ సమయంలోనే ఒకరికి తెలియకుండా ఒకరితో రొయాన్ ఏకాంతంగా గడుపుతాడు.
చివరికి వీళ్ళిద్దరికీ తెలియకుండా అతడు వెళ్ళిపోతాడు. అతడు మోసం చేయడం వల్ల, అతనికి గుణపాఠం చెప్పాలని వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక పెళ్లి రోయాన్ ది అని తెలుసుకుంటారు. రొయాన్ పెళ్ళిలో వీళ్లిద్దరినీ చూసి కంగారుపడతాడు. ఈ విషయం పెళ్ళికూతురికి చెప్పి పెళ్లి చెడగొట్టాలని అనుకుంటారు. అయితే పెళ్ళికూతురు రొయాన్ ని కంట్రోల్ లో పెడుతున్న తీరుని చూసి ఆగిపోతారు. చివరికి వీళ్ళిద్దరూ అతడి పెళ్లిని చెడగొడతారా? కేట్ మేఘన్ లు మరెవరినైనా సెట్ చేసుకుంటారా? మేఘన్ డ్రైవర్ ని లవ్ చేస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది లేయవర్’ (The Layover) అనే ఈ రొమాంటిక్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.